AP 6th Class Social Notes 7th Unit సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం
→ హిమాలయాలకు మరియు దక్కన్ పీఠభూమి మధ్య గంగ, యమున నదులు ప్రవహిస్తున్నాయి. దీనిని గంగా నదీలోయ అంటారు.
→ తెగలను సంస్కృతంలో ‘జన’ అని, వారు స్థిరపడిన ప్రాంతాన్ని ‘జనపదం’ అని పిలుస్తారు.
→ గంగా, యమున నదుల వెంట ప్రజలు 2700 సం||రాలలో పెద్ద సంఖ్యలో స్థిరపడటం ప్రారంభించారు.
→ గంగా మైదానంలో ఇనుము యొక్క విస్తృతమైన ఉపయోగం పెద్ద ప్రాదేశిక ప్రాంతాలు ఏర్పడటానికి పరిస్థితులను సృష్టించింది.
→ గ్రామాలు మరియు పట్టణాల యొక్క పెద్ద సమూహాలను ‘మహాజన పదాలు’ లేదా ‘పెద్ద జనపదాలు’ అని పిలిచేవారు.
→ గోదావరి నదీ తీరాన నెలకొన్న జనపదం అస్మిక.
→ గాంధార జనపదం జీలం నదీ తీరాన నెలకొని ఉంది.
→ వేదాలలో ఉపనిషత్తులు ఒక భాగం.
→ మహాజనపదం నాటి వ్యవసాయం చేసే భూ యజమానులను గృహపతి లేదా ‘గహపతి’ అనేవారు.
→ ఇనుప నాగలి వినియోగం, వరి నారు పోసే పద్దతి ఈ కాలంలో వ్యవసాయంలోని రెండు ప్రధాన మార్పులు.
→ బట్టలు మరియు దుప్పట్లు నేసే పనివారిని ‘సాలివారు’ అనేవారు.
→ నాటి మట్టికుండలను ‘పెయింటెడ్ గ్రేవేర్’ అని పిలుస్తారు.
→ చాలా మహాజన పదాలను రాజులు పరిపాలించేవారు.
→ వ్యవసాయం చేసే గృహపతుల నుంచి రాజులు 1/6వ వంతు పంటను పన్నుగా వసూలు చేసేవారు. దీనిని ‘భాగ’ అని పిలిచేవారు.
→ ప్రతీనెల ఒకరోజు ఉచితంగా పనిచేయడం ద్వారా వృత్తిపనివారు, రాజుకు పన్నులు చెల్లించేవారు.
→ ఈ కాలంలోనే నాణేలను ఉపయోగించడం ప్రారంభమైనది.
→ ‘గణ’ అనే పదానికి సమాన హోదా ఉన్నవారు అని అర్థం.
→ ‘సంఘ’ అంటే శాసనసభ.
→ గణ-సంఘాలు ఒక ఉన్నత సమూహం పాలించే ఒక చిన్న భౌగోళిక ప్రాంతమే గణరాజ్యం.
→ రాజ్యం అంటే రాజు లేదా రాణి పాలించే భూభాగం.
→ మహాజన పదాలలో మగధ శక్తివంతమైన రాజ్యం
→ వజ్జి గణ రాజ్యా నికి ఉదాహరణగా చెప్పవచ్చు.
→ గణ రాజ్యంలో ఒకే పరిపాలకుడు కాక, ఒక పరిపాలకుల బృందం ఉండేది.
→ మహిళలకు, బానిసలకు, సేవకులకు గణ సమావేశాలలో పాల్గొనే అవకాశం లేదు.
→ ఈ గణ రాజ్యాలు 1500 సం||రాల పాటు మనగలిగాయి, చివరకు గుప్త రాజులు గణ రాజ్యాలను జయించారు.
→ అలెగ్జాండర్ (గ్రీస్) మాసిడోనియా పాలకుడు.
→ అలెగ్జాండర్ ఈజిప్టు మరియు పశ్చిమ ఆసియా యొక్క భాగాలను జయించి భారత ద్వీపకల్పానికి చేరుకుని బియాస్ నదీతీరం వరకూ వచ్చాడు.
→ గాంధార శిల్పకళ తక్షశిల చుట్టూ ఉన్న ప్రాంతంలో అభివృద్ధి చేయబడింది.
→ గాంధార శిల్పకళ బౌద్ధ (గౌతమ బుద్ధుని చిత్రాలు) మతానికి చెందనది.
→ పురావస్తు శాస్త్రం : పురావస్తు శాస్త్రం అంటే పూర్వీకుల జీవన విధానాలను గురించి శాస్త్రీయంగా విశ్లేషించే ఒక అధ్యయన శాస్త్రం.
→ గణ రాజ్యం : అనేక ప్రాంతాల పాలకులు, సభ్యులు ఉన్న ఒక రాజ్య వ్యవస్థ.
→ సంఘం : ఒక సంస్థ లేదా సంఘం
→ దిగానికాయ : బౌద్ధ వాజ్మయంలోని సుత్త పీఠికలో గల అయిదు నికాయలలో మొదటిది.
→ మధ్యమనికాయ : బౌద్ధ వాజ్మయంలోని సుత్త పీఠికలో గల అయిదు నికాయలలో రెండవది.
→ జనపదం : భారతదేశంలో మొదట్లో గంగా-సింధూ మైదానంలో వ్యవసాయం చేస్తూ అనేక తెగలు స్థిరపడ్డాయి. వీరిని సంస్కృతంలో ‘జన’ అని వారు స్థిరపడిన ప్రాంతాన్ని ‘జనపదం’ అని అంటారు.
→ మహాజనపదం : పెద్ద పెద్ద జనపదాలను మహాజనపదాలు అంటారు.
→ దాసులు : యుద్ధంలో బందీలైనవారు నాడు రైతులకు అమ్మబడేవారు. వారిని బానిసలని, దాసులని అంటారు.
→ భర్తుకా : ఇంటిలోనూ, పొలంలోనూ కూలి తీసుకుని పనిచేసేవారు.
→ గృహపతి : (గహపతి) వ్యవసాయం చేసే భూయజమానిని గృహపతి అంటారు.
→ గణతంత్ర రాజ్యం : ఎన్నుకోబడిన వ్యక్తి పరిపాలించే రాజ్యం.
→ ఉపనిషత్తులు : ‘వచ్చి చేరువగా కూర్చోవడం’ అని అర్థం. ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల మధ్య సంభాషణలు.
→ సాలివారు : బట్టలు మరియు దుప్పట్లు నేసే పనివారు
→ కమ్మరి : ఇనుప వస్తువులను తయారు చేసేవారు.
→ కుమ్మరి : కుండలు తయారు. చేసేవారు.
→ పెయింటెడ్ గ్రేవేర్ : నాటి కుమ్మరులు మట్టితో తయారు చేసిన ప్రత్యేక కుండలు, పాత్రలు
→ ఆవిర్భావం : గృహపతుల నుండి రాజు పన్ను రూపంలో వసూలు చేసే పంట భాగం (1/6 వంతు)
→ గాంధార శిల్పకళ : గాంధార శిల్పకళ తక్షశిల చుట్టూ ఉన్న ప్రాంతంలో అభివృద్ధి చేయబడింది. ఇది గ్రీకు కళతో ప్రభావితమైనది.
→ మగధ రాజ్యం : గంగానదికి ఇరువైపుల విస్తరించిన రాజ్యం . అన్ని జనపనదాలలో శక్తివంతమైన రాజ్యం.
0 Comments