3వ తరగతి తెలుగు
పాఠ్యాంశం ప్రక్రియ ఇతివృత్తం
1. తెలుగు తల్లి గేయం దేశభక్తి
2.మర్యాద చేద్దాం కథ హాస్యం
3.మంచి బాలుడు గేయకథ సహానుభూతి
4.నా బాల్యం ఆత్మకథ కళలు
5.పొడుపు –విడుపు సంభాషణ భాషాభిరుచి
6.మేమే మేకపిల్ల కధ పరస్పర సహకారం
7.పద్య రత్నాలు పద్యాలు నైతిక విలువలు
8.మా ఊరి ఏరు గేయం ప్రకృతి వర్ణన
9.తొలి పండుగ కధనం సంస్కృతి సంప్రదాయాలు
తెలుగు తల్లి
- తెలుగు తల్లి పాఠ్యాంశ ప్రక్రియ – గేయం
- ఇతివృత్తం — దేశభక్తి పెంచడం
- తెలుగు తల్లి పాఠం రచయిత — శ్రీరంగం శ్రీనివాసరావు
- శ్రీరంగం శ్రీనివాసరావు జననం – 1910 ఎపియల్ 14
- మరణం – 1983 జూన్ 15
- శ్రీరంగం శ్రీనివాసరావును శ్రీ శ్రీ అంటారు
- శ్రీ శ్రీ మహాకవి, అభ్యుదయ యుగకర్త, కథకులు, నాటకకర్త, విమర్శకులు, అనువాదకులు
- తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన – మహా ప్రస్థానం
- మహా ప్రస్థానం రచయిత — శ్రీ శ్రీ
- శ్రీ శ్రీ ఇతర రచనలు – 1. మరోప్రస్థానం 2. ఖడ్గ సృష్టి
- శ్రీ శ్రీ స్వీయ చరిత్ర – అనంతం
పదాలు — అర్థాలు
కల్పవల్లి = కోరినకోర్కెలు తీర్లేది | అనుంగు = పియమైన |
సుదూరం = చాలాదూరం | చనవోయ్ = వెళ్లవోయి |
తెనుంగు = తెలుగు | చంద్రశాల = చలువరాతి మేడ |
నవయుగం = కొత్తకాలం | కనవోయి = చూడవోయి |
రేడు = రాజు | నిచ్హయంగా = నమ్మకంగా ,దృఢంగా |
- తల్లిభారతి వందనము అనే గేయంను ఎవరు రచించారు. – దాశరధీ కృష్ణమాచార్య
- దాశరధీ కృష్ణమాచార్య జననం — 1925 జులై 22
- మరణం – 1987 నవంబర్ 5
- నిజాం నిరంకుశత్యం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి – దాశరధి కృష్ణమాచార్య
- నిజాం రాచరికం నుండి తెలంగాణాను విమోచనకు మేలు కొల్పిన వారు – దాశరధి కృష్ణమాచార్య
- పద్యాన్ని, పాటని సమానంగా నిర్వహించిన కవి – దాశరధి కృష్ణమాచార్య
- దాశరధి కృష్ణమాచార్య ఇతర రచనలు – 1. అగ్నిధార
2.రుద్రవీణ
3.మహంద్రోదయం
4.తిమిరంతో సమరం
- దాశరధి కృష్ణమాచార్య స్వీయ చరిత్ర – యాత్రా స్కృతి
- దాశరధి కృష్ణమాచార్య ఆంధ్ర ప్రదేశ్ ఆస్థాన కవిగా పనిచేశారు
- ఐక మత్యం అనే ఈ మాసపు కధకు ఆధారం — లియోటాల్ స్టాయ్
- లియో టాల్ స్పాయ్ జననం – 1828 సెప్టెంబర్ 9
- మరణం – 1910 నవంబర్ 20
- లియో టాల్ స్ట్పాయ్ రష్యన్ కథకులు, నవలాకారుడు
- లియో టాల్ స్టాయ్ రచించిన నవలలు – 1.సమరం — శాంతి 2.అన్నా కెరెనినా
- రామాపురం గ్రామం లో రైతుకు ముగ్గురు కొడుకులు ఉండేవారు.
మర్యాద చేద్దాం
- మర్యాద చేద్దాం పాఠ్యాంశ ప్రక్రియ – కథ
- ఇతివృత్తం — హాస్యం
- కళింగ రాజ్యంలో పరమానందయ్య అనే పండితుండేవాడు.
- ఆయనకు 12 మంది శిష్యులు.
- పరమానందయ్య గారు భార్యతో కలసి గుడికి వెళ్ళిన సందర్భంలో ఇంటికి వచ్చిన ఆయన స్నేహితుడు – పేరయ్య
- పరమానందయ్య శిష్యులు చేసే పనులు కోపంతో పాటు నవ్వు తెప్పిస్తుంటాయి
- పేరయ్య తమ గురువు గారిని ఒరేయ్ అని పిలుస్తూ రావడంతో శిష్యులు పేరయ్యని బంధించారు
- పరమానందయ్య పేరయ్య కూతురి పెళ్ళికి పొరుగూరు వెళ్లారు.
- అప్పుడు వచ్చిన దొంగలకు శిష్యులు పూజలు చేశారు. ఆ పూజలలో వచ్చిన పొగను చూసి దారిన పోతున్న రాజభటులు గురువు గారిల్లు కాలిపోతున్నదిరా అంటూ లోపలికి వచ్చారు
- మర్యాద చేద్దాం అనే పాఠం ఎచట నుండి గ్రహించారు – పరమానందయ్య కథ.
పదాలు — అర్భాలు
అఘాయిత్యం = చేయకూడని పని
బావురమను = బోరున ఏడవడం
అతిధులు = అనుకోకుండా ఇంటికి వచ్చేవారు
అలికిడి = శబ్దం
కుమ్మరిచడం = ఒక్కసారిగా పోయటం
ఘనంగా = గొప్పగా
సన్మానించడం = గౌరవించడం
- రేలారేలా………రేలారేలారే అనే ఈ మాసపు పాట ఎచట నుండి గ్రహించారు – జానపద గేయం
- జింక అనే ఈ మాసపు కధ ఎచట నుండి గ్రహించారు – ఈసప్ కధలు
- జింక నీళ్ళు తాగడానికి సెలయేటికి వెళ్ళి సెలయేటిలో తన కొమ్ములు చూసి మురిసిపోయింది .
- తరువాత తన కాళ్ళు చీపురు పుల్లల్లా ఉన్నాయి అని బాధపడింది.
- జింక సింహం బారి నుండి తప్పించుకుని పారిపోతుంటే కొమ్ముల వలన పొదలలో చిక్కుకు పోయింది. కానీ కాళ్ళ వలన తప్పెంచుకోగలిగింది .
- ఈసప్ కథలు గ్రీకు పురాణ కధలు
- ఈసప్ కధలు 2500 సంవత్సరాల కాలం నాటివి .
- ఈసప్ కధలు ప్రపంచంలోని అన్నీ భాషలలోకి అనువదించబడ్డాయి .
మంచి బాలుడు
- మంచి బాలుడు పాఠ్యాంశ ప్రక్రియ – గేయ కథ.
- పాఠ్యాంశ ఇతివృత్తం – సహానుభూతి
- మంచి బాలుడు పాఠ్యాంశ రచయిత — ఆలూరి బైరాగి
- ఆలూరి బైరాగి జననం – 1925 నవంబర్ 5
- మరణం — 1978 సెప్టెంబర్ 9
- 20వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవులలో ఆలూరి బైరాగి ఒకరు .
- మానవుడి అస్తిత్వ వేదనను కవిత్వంగా వెలువరించిన కవి – ఆలూరి బైరాగి
- ఆలూరి బైరాగి రచనలు – 1.చీకటి మేడలు
2.నూతిలో గొంతుకలు
3.ఆగమ గీతి
4.దివ్యభవనం
- ఆలూరి బైరాగి బాలల కోసం చక్కటి గేయ కథలు రచించారు
- ఆలూరి బైరాగి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది
పదాలు — అర్థాలు
జడిసి = భయపడి
వడి = వేగం
ముదుసలి = ముసలి
కొనిపోవు = తీసుకునిపోవు
మనము = మనస్సు
దుర్చలులు = బలం లేనివారు
మనుజుడు = మనిషి
మనుగడ = జీవితం
వాక్యాంత బిందువు (.) :- వాక్యం చివరన ఉంటుంది.
- దీనిని ఆంగ్లంలో పుల్ స్టాప్ అంటారు .
- దీనిని పూర్ణ విరామ బిందువు అంటారు
- పుల్ స్టాప్ అనగా వాక్యం అక్కడికి పూర్తయింది అని అర్ధం.
స్వల్బ్పవిరామ బిందువు (,) ;- వాక్యాలు చదివేటపుడు కొన్ని చోట్ల ఆపి ఆపి చదువుతాం , ఇలా ఆపి చదవడంను స్వల్ప విరామం అంటారు.
- దీనిని ఆంగ్లంలో కామా (,) అంటారు
- కలపండి చేయి చేయి కలపండి అనే ఈ మాసపు పాట ఎవరు రచించారు – దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి
- దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి జననం – 1897 నవంబర్ 1.
- మరణం — 1980 ఫిబ్రవరి 24.
- ఆధునిక తెలుగు కవిత్వంలో భావకవిత్వ యుగానికి తలుపులు తెరిచింది – దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి
- దేవులపల్లి అచ్చమైన తెలుగు కవి
- దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి కవిత్వ లక్షణాలు – 1. అక్షర రమ్యత
2. భావనా సౌకుమార్యం
3. శబ్ద సంస్కారం
- దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి కవిత్వాన్ని ఇక్షు సముద్రంలో పోల్చింది – శ్రీ శ్రీ
- దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి ఇతర రచనలు — 1. కృష్ణ పక్షము
2.ఊర్వశి
3.ప్రవాసము
- దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి అందుకున్న పురస్కారం – పద్మ భూషణ్
- బావిలో నీళ్ళు అనే ఈ ఈ మాసపు కధ ఎచట నుండి గ్రహించారు — అక్టర్ –జీర్టల్ కథలు .
- అక్షర్ ఆస్తానంలో మంత్రి — జీర్లర్
- జమీందారు రైతుకు బావి అమ్మాడు. రైతు బావిలో నీళ్ళు తోడుకునేటప్పుడు జమీందార్ అడ్డుపడి బావి అమ్మాను. కానీ నీళ్ళు కాదు అన్నాడు
- బీర్బల్ పరిష్కారం చూపిస్తూ, బావి రైతుకీ అమ్మావు కాబట్టి బావిలో ఉన్న నీళ్ళు మొత్తం తోడి తీసుకుని పోవాలని చెప్పారు.
నా బాల్యం
- నా బాల్యం పాఠ్యాంశ ప్రక్రియ — ఆత్మకధ
- ఇతివృత్తం — కళలు గురించి తెలపడం
- నా బాల్యం ఎవరి ఆత్మకధ — షేక్ నాజర్
- పోన్నెకల్లు తూర్పువీధిలో సాయిబుల పందిరి గుంజ కూడా పాట పాడుతుంది అంటారు.
- షేక్ నాజర్ ఆ పందిరి గుంజ కింద పుట్టాడు .
- షేక్ నాజర్ పుట్టగానే ఆయన గారపాడు తాతగారు ఏమని పిలిచారు – అబ్బుల్ అజీజ్
- నాజర్ వాళ్ళ నాన్నకు ఆ పేరు నచ్చలేదు – నాజర్ అని పిలిచారు
- నాజర్ ను గారపాడు మామలు, అత్తలూ అబ్బుల్ అజీజ్ అనిపిలిచారు
- పోన్నెకల్లు పెద్దనాన్నలు, చిన్నాన్నలు నాజర్ అని పిలిచారు
- నాజర్ వాళ్ళ ఇంటికి వచ్చి నాజర్ ను తనతో పంపితే చదువు, సంగీతం నేర్పించి గొప్పవాడ్ని చేస్తాను అని చెప్పింది – హార్మోనిస్ట్ ఖాదర్
- నాజర్ పాఠశాల వార్షికోత్సవంలో ఆడిన నాటిక – ద్రోణ విజయం
- ఈ నాటకంలో ద్రోణాచార్య పాత్ర నాజర్ వేశాడు
- షేక్ నాజర్ నటనకు మెచ్లి పంతులుగారు పెన్సిల్, పుస్తకం, 5 రూపాయిలు బహుమతిగా ఇచ్చారు.
- షేక్ నాజర్ గుంటూరు జిల్లా పోన్నెకల్లు గ్రామంలో 1920 ఫిభ్రవరి 5న జన్మించారు
- మరణం — 1997 ఫిభ్రవరి 21
- షేక్ నాజర్ నాన్న – షేక్ మస్తాన్
- తల్లి – బీనాబి
- షేక్ నాజర్ నేర్చుకున్న జానపద కళారూపం — బుర్ర కథ
- బుర్ర కధ ప్రకీయకు నాజర్ కొత్త మెరుగులు దిద్దాడు
- సమకాలీన అంశాలు జతచేసి నాజర్ రూపొందించిన బుర్ర కధలు – పల్నాటి యుద్దం, వీరాభిమన్యు , బాబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు
- షేక్ నాజర్ కు భారత ప్రభుత్వం 1986 లో పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది
పదాలు — అర్థాలు
ఆరుగాలం = ఏడాది అంతా
గుంజ = రాట, నిట్టాడి స్తంభం
పామరులు = చదువు కోనివారు
- నా బాల్యం పాఠ్యాంశ రచయిత — అంగడాల రమణమూర్తి
- షేక్ నాజర్ తన జీవిత కధను తానే చెప్పుకున్నట్లు అక్షరీ కరించింది – అంగడాల రమణ మూర్తి
- ఇలాంటి ఆత్మకధకు పెట్టిన పేరు – పింజారి
- కొండపల్లి బొమ్మలు ఏనుగు అంబారీ ,దశావతారాలు, తాటిచెట్టు వంటి రూపాలలో ఉంటాయి
- కొండపల్లి బొమ్మలు ఏ కర్రతో చేస్తారు – పొణికి కర్ర
- “కొండపల్లి బొమ్మలు చేసేవారి పూర్వీకులు ఏ రాష్ట్రం నుండి వచ్చారు – రాజస్థాన్
- ప్రస్తుతం వీరు కృష్ణా జిల్లా కొండపల్లిలో స్థిరపడిపోయారు
- ప్రశ్నార్ధక వాక్యాలు :- వాక్యాలు చివర (? ) గుర్తు ఉన్న వాక్యాలు.
- ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఏమిటి, ఎలా, ఎవరు ఇలాంటి పదాలను ప్రశ్నార్ధక పదాలు అంటారు
- Ex:- బాబూ ! నీ పేరేమిటి ?
నీవు ఏ తరగతి చదువుతున్నావు ?
- ఆశ్చర్యార్థకం:- ఆశ్చర్యాన్ని తెలిపేది (!)
- (!) దీనినే ఆశ్ష్వర్యార్థకం అంటారు .
- బంగారు పాపాయి అనే ఈ మాసపు పాట ఎవరు రచించారు – మంచాళ జగన్నాధరావు
- మంచాళ జగన్నాధరావు జననం — 1921
- మరణం — 1985
- మంచాళ జగన్నాధరావు కవి, సంగీత విద్వాంసులు
- ప్రసిద్ధ వాగ్గేయ కారులు కృతులకు స్వర రచన చేసింది – మంచాళ జగన్నాధరావు.
- బంగారు మొలక కధలో రాజు, ముసలివాడిని మామిడి మొక్క గురించి అడిగాడు
- రాజు తాత చెప్పిన సమాధానం విని తాతకు 25 బంగారు నాణేలు ఇచ్చాడు.
పొడుపు — విడుపు
- పొడుపు — విడుపు పాఠ్యాంశ ప్రక్రియ – సంభాషణ
- పొడుపు — విడుపు పాఠ్యాంశ ఇతివృత్తం — భాషాభిరుచి పెంచడం
- పొడుపు — విడుపు పాఠ్యాంశ రచయిత — చింతా దీక్షితులు
- చింతా దీక్షితులు జననం – 1891 ఆగష్టు 25
- మరణం — 1960 ఆగష్టు 25
- చింతా దీక్షితులు కవి, కధకులు , విద్యావేత్త
- తెలుగులో బాలసాహిత్యానికి తొలితరం మార్గదర్శకులలో ముఖ్యులు
- గిరిజనుల గురించి, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత — చింతా దీక్షితులు
- చింతా దీక్షితులు రచనలు – 1. ఏకాదశి 2.శబరి 3.వటీరావు కధలు 4. లక్కపిడతలు
- చింతా దీక్షితులు అనేక జానపద గేయాలు సేకరించారు
- వేసవి సెలవులలో గిరి, సూరి వాళ్ళ మామయ్య గారి ఊరు వెళ్లారు
- గిరి, సూరి రోజంతా సీతి, వెంకిలతో తోటలో సరదాగా గడిపారు
- మామయ్య కుర్లీలో కూర్తొని దిన పత్రిక చదువుతున్నాడు
- సూరి అన్నయ్య గిరి చందమామ కధల పుస్తకం చదువుతున్నాడు
- సూరి, సీతి , వెంకీ నడవలోని మంచం మీద పడుకున్నారు
- తీసే కొద్ది పెరిగేది – గొయ్య
- వెండి గొలుసు వెయ్యడమే గాని తియ్యడం లేదు – ముగ్గులు
- నూరు చిలకలకు ఒకటే ముక్క — పళ్ల గుత్తి
- పచ్చ చొక్కావాడు చొక్కావిప్పుకుని నూతిలో పడ్డాడు – అరటికాయ
- ఇంట్లోకలి- రోకలి, ఒంట్లో కలి – ఆకలి
- తెల్లని పొలంలో నల్లని విత్తనాలు చేత్తో చల్లుతారు నోటితో ఏరుతారు — పుస్తకం
- చెయ్యని కుండ, పొయ్యని నీళ్ళు, వేయని సున్నం, తియ్యగ నుండు – కొబ్బరి కాయ
- పైనొక పలక, కిందొక పలక , పలకల నడుమ మెలికల గిలక — నాలుక
- అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు . కొమ్మ కొమ్మకు, కోటిపువ్వులు. పువ్వుల్లో రెండే కాయలు – ఆకాశం, నక్షత్రలు, సూర్యుడు, చందురుడు
- కింది ఆధారాలను బట్టి “లు “ తో అంతమయ్యే పదాలు రాయండి.
1. వినడానికి ఉపయోగపడేవి – చెవులు
2. నిద్రలో వచ్చేవి – కలలు
3. వేసవిలో వచ్చేవి – సెలవులు
4. పక్షులకు ఉండేవి – రెక్కలు
5. పిల్లలకు ఇష్టమైనది – ఆటలు
- నామవాచకాలు:- మనుషుల పేర్లు, వస్తువుల పేర్లు, పక్షుల పేర్లను తెలిపే పదాలను నామవాచకాలు అంటారు.
- ఉదా:- శీను, గణపతి, పెన్ను, పుస్తకం, చిలుక, పావురం
- చందమామ అనే ఈ మాసపు పాట ఎవరు రచించారు
- నండూరి రామమోహన రావు జననం – 1927 april 24
- మరణం — 2011 సెప్టెంబర్ 2
- నండూరి రామమోహన రావు కవి, అనువాదకులు, గొప్ప భావుకులు
- నండూరి రామమోహన రావు రచించిన బాల గేయాల సంపుటి – హరివిల్లు
- నండూరి రామమోహన రావు ఏ రచనల ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సులభశైలిలో పాఠకులకు పరిచయం చేశారు – నరావతారం, విశ్వరూపం
- నండూరి రామమోహన రావు ఇతర రచనలు – 1. విశ్వదర్శనం 2. అక్షరయాత్ర
- మార్క్ ట్వెయిన్ రచించిన రచనలు – 1. టామ్ సాయర్ 2. హకర్ బెరిఫిన్
- మార్క్ ట్వెయిన్ రచనలను నండూరి రామమోహన రావు అనువాదం చేశారు
- వికటకవి అనే ఈ మాసపు కధను ఎచట నుండి గ్రహించారు — తెనాలి రామకృష్ణ కధలు
- కృష్ణాతీరంలో గార్ల పాడు గ్రామంలో రామయ్య మంత్రీ , లక్షమ్మ దంపతులకు రామకృష్ణుడు అనే కుమారుడున్నాడు.
- రామకృషుడు నాన్న చిన్నతనంలో మరణిచడం వలన అతని మేనమామ ఇంటి వద రామకృష్ణుడు పెరిగాడు
- సాధువు చెప్పిన మంత్రంతో రామకృషుడు కాళికాదేవి గుడిలో పూజ చేశాడు
- క్రాళిగా దేవి ప్రత్యక్షమై, ఒక చేతిలో పాలు, ఒక చేతిలో పెరుగును ఇచ్చి ఇలా చెప్పింది. పాలు తాగితే గొప్ప పండితుడవుతావు. పెరుగు తాగితే ఐశ్వర్యవంతుడవుతావు
- రామకృష్ణుడు అమ్మవారిని మాయ చేసి రెండూ కలిపి తాగాడు
- అమ్మవారి దయతో రామకృష్ణుడు వికట కవి అయ్యాడు
- రామకృష్ణుడు శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో చేరాడు
- రామకృష్ణుడు అష్టగిగ్గజ కవులలో ఒకడు.
మేమే మేకపిల్ల
- మేమే మేకపిల్ల పాఠ్యాంశ ప్రక్రియ – కథ
- మేమే మేకపిల్ల పాఠ్యాంశ ఇతివృత్తం – పరస్పర సహకారం
- ఒక ఊరిలో మేకకు 4 పిల్లలు. 4వ పిల్లపేరు మేమే
- మేమేకు తొందరెక్కువ . మాట వినదు
- మేమే ఒకరోజు అమ్మమాట వినకుండా డిల్లీ రాజును చూడడానికి వెళ్లింది
- మేమేకు దారిలో ఒక ఏరు అడ్డువచ్చింది . దానికి అడ్డంగా ఏరుపై ఒక కొమ్మపడి ఉంది.
- మేమేకు ఏరు తరువాత దారిలో మంట కనిపించింది
- మేమేకు ఏరు, మంట తరువాత దారిలో చెట్టు కనిపించింది. చెట్టు చుట్టూ ముళ్ళకంచే . చెట్టు మీదుగా వచ్చే గాలికి కంచె అడ్డం. గాలి మేమేని సహాయం అడిగింది
- మేమేను డిల్లీలో రాజుగారి వంటవాడు పట్టుకున్నాడు.
- మేమే నీళ్ళు, మంట, గాలి ని వరుసగా సహాయం అడిగింది
- గాలి మేకకు సహాయం చేసింది
పదాలు — అర్జాలు
వాలకం = తీరు
బుది = ఆలోచన
అదృశ్యం = మాయం
గందరగోళం = తికమక
తిన్నగా = నేరుగా
మరగడం = కాగడం
కాగు = పెద్దబిందే
- మేమే మేకపిల్ల పాఠం చందమామ కధల నుండి గ్రహించారు.
- 1949 లో బాపట్ల కు చెందిన గ. శకుంతల చందమామ కధను రచించారు
- భ్రమక పదాలు :- ఎటునుండి చదివినా ఒకేలా ఉండే పదాలను భ్రమక పదాలు అంటారు.
- ఉదా:- వికటకవి, జలజ, మిసిమి, ముత్యము, కిటికి.
- సర్వనామాలు:- నామవాచకాలకు బదులుగా వాడే పదాలను సర్వనామాలు అంటారు.
- ఉదా:- అతడు, ఆమె, అది, మేము, నేను, వారు
- తెలుగు తోట అనే ఈ మాసపు పాటను ఎవరు రచించారు – కందుకూరి రామభధ్రరావు
- కందుకూరి రామభథ్రరావు జననం — 1905 జనవరి 31
- కందుకూరి రామభథ్రరావు మరణం — 1976 అక్టోబర్ 8
- కందుకూరి రామభథ్రరావు కవి, విద్యావేత్త
- కందుకూరి రామభథ్రరావు ఇతర రచనలు — 1. లేమొగ్గ 2. తరంగిణి 3. గేయ మంజరీ
- మేకపోతు గాంభీర్యం అనే కధలో ఒకమేక మందనుండి తప్పించుకుని గుహలోకి వెళ్లింది
- ఆ గుహ సింహం నివసించే గుహ . రాతిరి మిలమిలా మెరుస్తున్న మేకపోతు కళ్ళు చూసి సింహం భయపడింది
- మేకపోతు గాంభీర్యంగా నేను ఇప్పటికీ 99 సింహలను చంపాను. 100 సింహలను చంపితే నా వ్రతం పూర్తవుతుంది అని సింహం మీద దూకబోయింది
పద్యరత్నాలు
- పద్యరత్నాలు పాఠ్యాంశ ప్రక్రియ – పద్యాలు
- ఇతివృత్తం — వైతిక విలువలు
- అనగననగ రాగ మతిశయిల్లుచు నుండు పద్యం ఏ శతకం నుండి గ్రహించారు – వేమన
- బహుళ కావ్యములను పరికింపగా వచ్చు అనే పద్యం ఏ శతకం నుండి గ్రహించారు – వేమన
- చదువు చదవకున్న సౌఖ్యంబు నుండదు అనే పద్యం ఏ శతకం నుండి గ్రహించారు – వేమన
- ఐకమత్యమొక్క టావశ్వకంబెప్పు నుండదు అనే పద్యం ఏ శతకం నుండి గ్రహించారు – వేమన
- కమలములు నీటబాసిన అనే పద్యం ఏ శతకం నుండి గ్రహించారు – సుమతి
- లావుగల నాని కంటెను అనే పద్యం ఏ శతకం నుండి గ్రహించారు – సుమతీ శతకం
- కలిమిగల లోభి కన్నను అనే పద్యం ఏ శతకం నుండి గ్రహించారు – గువ్వల చెన్న శతకం
- దేశసేవ కంటే దేవ తార్దన లేదు అనే పద్యం ఏ శతకం నుండి గ్రహించారు — తెలుగు బాల శతకం
- సంపదులు లేనపుడిచ్చకములాడి అనే పద్యం ఏ శతకం నుండి గ్రహించారు – దువ్వూరి రామిరెడ్డి
పదాలు — అరాలు
అనగననగ = పాడగాపాడగా
నెలవు = చోటు
అతిశయిల్లు = అభివృద్ధి చెందు
సుమతీ = మంచి బుద్ది కలవాడు
వేము = వేప
లావు = బలం, శక్తి
సాధనము = అభ్యాసం
మహి = భూమి
సమకూరు = నెరవేరు
భావింపగ = ఆలోచింపగ
ధర = భూమి
గజము = ఏనుగు
బహుళ = అనేక
గ్రావము = కొండ
పరికించు = పరిశీలించు
మానటివాడు = ఏనుగును నడిపేవాడు
శబ్ద చయము =పదాలసమూహం
కలిమి = సంపద
సహనము = ఓర్పు
లోభి = పిసినారి
అబ్బు =అలవాటగు
విలసితంగా = చక్కగా
సౌఖ్యం = సుఖం
వితరణి = దాత
సరసుడు – మంచిని గ్రహించుగలవాడు
చలిచెలము = మంచి నీటి గుంట
మర్మము =సారం, భావం, రహస్యం
కులనిధి = ఎక్కువ నీరు గలది
ఆవశ్యకం = అవసరం
అంబోధి = సముధ్రం
బలిమి = బలం
ఇచ్చకములు = పియమైన మాటలు
కమలాప్తుడు =సూర్యుడు
ఆప్తవరులు = హితులు
రశ్మి = కిరణము
కాంచు = చూచు
సోకి = తగిలి
చెలిమి కాండ్రు = స్నేహితులు
- వేమన 17,18 శతాబ్దాల మధ్య కాలంవాడు
- వేమన ఏ జిల్లాకు చెందిన వాడు – కడప
- అనంతపురం జిల్లాలోని కదిరి ప్రాంతంలోని కటారుపల్లే లో వేమన సమాధి కలదు
- సమతీ శతక రచయిత — బద్దెన
- బద్దెన శతాబ్దం – 13వ శతాబ్దం
- గువ్వల చెన్నడు 17, 18 శతాబ్దం వాడు
- గువ్వల చెన్నడు కడప జిల్లా రాయచోటి ప్రాంతానికి చెందినవాడు
- తెలుగు బాల శతక రచయిత — జంద్యాల పాపయ్య శాస్త్రి
- జంద్యాల పాపయ్య శాస్త్రి జననం – 1912 ఆగష్ట్ 4
- మరణం – 1992 జూన్ 12
- జంద్యాల పాపయ్య శాస్త్రి రచనలు — 1. విజయశ్రీ 2. ఉదయశ్రీ 3. కరుణశ్రీ
- జంద్యాల పాపయ్య శాస్త్రి గుంటూరు జిల్లాలోని పెదనంది పాడు మండలం కొమ్మూరు గ్రామంలో జన్మించారు
- దువ్వూరి రామిరెడ్డి నెల్లూరి జిల్లాకు చెందినవారు
- దువ్వూరి రామిరెడ్డి జననం –1895 నవంబర్ 9
- మరణం – 1947 సెప్టెంబర్ 11
- దువ్వూరి రామిరెడ్డి ఇతర రచనలు 1. కృషి వలుడు 2.జలదాంగన 3.గులాబీతోట 4.పానశాల
- తెలుగులో మొదటి కవయితిరి = తాళ్ళపాక తిమ్మక్క
- తాళ్ళపాక తిమ్మక్క అసలు పేరు = తాళ్ళపాక తిరుమలమ్మ
- తాళ్ళపాక తిరుమలమ్మ తాళ్ళపాక అన్నమాచార్యులు భార్య
- తాళ్ళపాక తిమ్మక్క రచించిన కావ్యం — సుభద్ర కళ్యాణం
క్రియా పదాలు :- పనులను తెలియచేయు పదాలను క్రియా పదాలు అంటారు.
Ex: చేశాడు, తిన్నారు, కొసింది, చూసింది, వెళతాడు, వస్తాడు, చెప్పాడు.
- అందమైన పాట అనే ఈ మాసపు పాట ఎవరు రచించారు – 6.౪ సుబ్రహ్మణ్యం
- G.V సుబ్రహ్మణ్యం జననం — 1935 సెప్టెంబర్ 1
- G.V సుబ్రహ్మణ్యం మరణం — 2006 ఆగష్టు 15
- G.V సుబ్రహ్మణ్యం విద్యాంసులు , విమర్శకులు.
- G.V సుబ్రహ్మణ్యం తెలుగులో నవ్య సంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ చేపట్టారు
- G.V సుబ్రహ్మణ్యం రచనలు – 1.వీరరసము. 2.రసోల్లాసము 3.సాహిత్య చరిత్రలో చర్చ నీయాంశాలు
- దిలీపుని కధ అనే ఈ మాసపు కధ ఎచట నుండి గ్రహించారు – పురాణ కథ
- దిలీప మహరాజు భార్య పేరు – సుదక్షిణాదేవి
- వీరికి సంతానం లేదు
- సంతానం లేని బాధను గురువైన వశిష్టునికి చెప్పారు
- గురువు వారికి నందిని అనే ఆవును చూపించి దానికి సేవచేయమన్నారు
- సింహానికి దొరికిన నందినిని కాపాడడానికి దిలీపుడు తననే ఆహరంగా స్వీకరించమని సింహన్ని కోరాడు
- దిలీపునికి జన్మించిన కుమారుడు – రఘు మహరాజు
- రఘువంశం వాడే శ్రీరాముడు.
మా ఊరిఏరు
- మా ఊరిపేరు పాఠ్యాంశ ప్రక్రియ – గేయం
- ఇతివృత్తం – ప్రకృతి వర్ణన
- మా ఊరిఏరు పాఠ్యాంశ రచయిత — మధురాంతకం రాజారాం
- మధు రాంతకం రాజారాం జననం – 1930 అక్టోబర్ 5
- మరణం — 1999 april 1
- మధు రాంతకం రాజారాం సుప్రసిద్ద కధకులు
- రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400 పైగా కథలు రాసింది – మధురాంతకం రాజారాం
- రాజారాం మానవ సంబంధాలలోని సున్నిత పార్స్వాలను చిత్రించారు
- రాజారాం ఉత్తమ ఉపాధ్యాయులు
- మధురాంతకం రాజారాం కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం పొందారు
పదాలు — అర్థాలు
ముచ్చటగా = చక్కగా
పారు = ప్రవహించు
గుండ్లు = గుద్రని రాళ్ళు
పొదరింపు = దట్టమైన పొదలు
సుగంధము = మంచి వాసన
రోదలు = శబ్దాలు
వినువీధి = ఆకాశం
పొంగు = ప్రవాహం పెరుగు
ఇసుక తిన్నెలు = ఇసుక మేటలు
కొరత = తక్కువ
ఉద్యానవనం = పూలతోట
ఏరు = నది
- కృష్ణానది పడమటి కనుమలలోని మహాబలేశ్వరంలో పుట్టింది .
- కృష్ణానది 1400 km దూరం ప్రయాణం చేస్తుంది .
- శ్రీశైలం, నాగార్జున సాగర్ వద్ద కృష్ణానది మీద ఆనకట్ట కట్టారు .
- కృష్ణానది హంసలదీవి వద్ద పాయలుగా చీలి బంగాళాఖాతంలో కలుస్తుంది .
- పంట చేలు అనే ఈ మాసపు పాట ఎవరు రచించారు – పాల గుమ్మి విశ్వనాధం .
- పాలగుమ్మి విశ్వనాధం జననం — 1919 జూన్ 1
- మరణం — 2012 అక్టోబర్ 25
- పాలగుమ్మి విశ్వనాధం ఆకాశవానిలో పని చేశారు
- లలిత సంగీతానికి ప్రచారం కల్పించారు
- పాలగుమ్మి విశ్వనాధం వేలాది పాటలకు సంగీతం కూర్చారు ,గీతకర్త
- బుద్దిబలం అనే ఈ మాసపు కధ ఎచట నుండి గ్రహించారు – పంచతంత్ర కథలు .
- అడవిలో భాసురకం అనే సింహం ఉండేది.
- సింహానికి ఆహరంగా ఒక రోజు కుందేలు వంతు వచ్చింది.
- కుందేలు సింహంతో దారిలో నాతో పాటు వస్తున్న మరో ౩ కుందేళ్ళను వేరొక సింహం చంపి తానే అడవికి రాజు అన్నది అని చెప్పింది
- బాసురకం కు కుందేలు బావిలో ఉన్న సింహం ను చూపించింది .
తొలి పండుగ
- తొలి పండుగ పాఠ్యాంశ ప్రక్రియ – కధనం
- ఇతివృత్తం — సంస్కృతి, సంప్రదాయాలు
- మాధవరం గ్రామంలో వేపచెట్టు. అది ఆటస్థలం , రచ్చబండ
- రవి అంటే పిల్లలందరికి ఇష్టం. పాటలు బాగా పాడతాడు . నడవలేడు
- రవివాళ్ళ అక్క లత
- సెలవు కావడంతో ఆనంద్, శామ్యూల్ వేపచెట్టు కింద చేరారు.
- వసంత బుతువు కావడంతో వేపపూత రాలి నేలంతా తెల్లగా పరచుకుని ఉంది. మామిడి చెట్టుకు గుత్తులు, గుత్తులుగా కాయలు వేలాడతున్నాయి.
- పిల్లలందరూ ఉగాది పచ్చడి తిన్నారు
- పొలంలో పని పూర్తి చేసి చెట్టు కింద చేరింది – రంగయ్య తాత
- రంగయ్య తాత ఉగాది పండుగ గురించి పిల్లలకు తెలిపాడు
- ఉగాది తెలుగువారి తొలి పండుగ
- ఉగాదిని సంవత్సరాది, యుగాది అని పిలుస్తారు
- ఉగాది పచ్చడిలో ఆరు రుచులుంటాయి — చేదు, వగరు, పులుపు, తీపి, ఉప్పు, కారం
- రామాలయం వద్ద లైటింగ్, దండలు కడుతుంది – కరీముల్లా
- పంతులుగారు పంచాంగ శ్రవణం చెపుతారని పిల్లలలో చెప్పింది – కరీం మామ
- ఉగాది పండుగను చైత్ర శుద్ద పాడ్యమి నాడున జరుపుకుంటారు.
- ఉగాది పచ్చడి కష్టసుఖాల కలయికకు ప్రతీక
- తిధి, వార, నక్షత్ర, యోగ, కరణముల ను తెలిపే గ్రంధాన్ని పంచాంగం అంటారు.
- తెలుగు సంవత్సరాలు మొత్తం 60 — 1. ప్రభవ 2. విభవ 3. శుక్ష 58. రక్తాక్షి 59. కొధన 60. అక్షయ
- తెలుగు నెలలు 12. 1. చైత్రము 2. వైశాఖం 3. జ్యేష్టము 4. ఆషాడం
5.శ్రావణం 6.బాధ్రపదం 7.ఆశ్వయుజం 8.కార్తీకం
9మార్గశిరం 10.పుష్యము 11.:మాఘము 12.ఫాల్గుణం
- అందాల తోటలో అనే ఈ మాసపు పాట రచించింది ఎవరు – కస్తూరి నరసింహమూర్తి
- పాపాయి సిరులు అనే గేయ సంపుటి రచించింది – కస్తూరి నరసింహమూర్తి
- అందాలతోటలో పాట ఎచట నుండి గ్రహించారు – పాపాయి సిరులు
- నక్కయుక్తి అనే మాసపు కధ ఎచట నుండి గ్రహించారు – జానపద కథ
- నదీతీరంలో నక్కబావ నది ఎలా దాటాలో తెలియక విచారంగా ఉంది
- నదిలో మొసలితో నక్క మాట్లాడుతూ తనకోక సందేహం వచ్చిందని అడవిలో నక్కలు ఎక్కువ ఉన్నాయా! నదిలో మొసళ్ళు ఎక్కువ ఉన్నాయో అని అడిగింది
- మొసలి తామే ఎక్కువ ఉన్నామని వాళ్ళ వారందరినీ పిలిచి వరుసలో నిలబెట్టింది
- నక్క లెక్క పెడతానంటూ వాటి పైన దాటుకుని అవతలి ఒడ్డుకు చేరింది
- నక్క యుక్తి అనే కధ ఎవరు రచించారు – జంద్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి
- జంద్యాల సుబ్రహ్మణ్య శాస్త్రీ జననం – 1892
- మరణం — 1980
- జంద్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గద్వాల సంస్థాన కవి
- అవధాన విద్యలో నిష్ణాతుడు . సహస్రవధాని .
- జంద్యాల సుబ్రహ్మణ్య శాస్త్రీ రచనలు – 1. ఆంధ్రుల చరిత్ర 2. ఆంధ్ర సాస్రజ్యం
3.రత్నలక్ష్మి శతపత్రము 4. కేనో పనిషత్తు .
0 Comments