Ticker

6/recent/ticker-posts

APTET 2022 Special - Class 4 Telugu Complete Notes


పాఠ్యాంశం ప్రక్రియ ఇతివృత్తం

1.గాంధీ మహాత్తుడు గేయం మహనీయుల చరిత్ర

2.గోపాల్‌ తెలివి కధ సమయస్ఫూర్తి

3.దేశమును పేమించుమన్నా గేయం దేశభక్తి

4.పరివర్తన కథ పిల్లల స్వభావం

5.సత్యమహిమ గేయకధ నైతికవిలువలు

6.ముగ్గులో సంక్రాంతి వ్యాసం సంస్కృతి సంప్రదాయాలు

7.పద్య రత్నాలు పద్యం నైతిక విలువలు

8.బారిష్టర్‌ పార్వతీశం కధనం హాస్యం

9.రాజు – కవి పద్యకధ సామాజిక అంశం

గాంధీ మహత్ముడు

  • గాంధీ మహత్ముడు పాఠ్యాంశ ప్రకీయ – గేయం
  • గాంధీ మహత్ముడు పాఠ్యాంశ ఇతివృత్తం – మహనీయుల చరిత్ర తెలపడం.
  • గాంధీ మహత్ముడు పాఠ్యాంశ రచయిత — బసవరాజు అప్పారావు.
  • బసవరాజు అప్పారావు జననం – 1894 డిసెంబర్‌ 13
  • మరణం — 1933 జూన్‌ 10
  • బసవరాజు అప్పారావు గారు భావకవి, గీతకర్త
  • బసవరాజు అప్పారావు గీతాలు ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయి.
  • బసవరాజు అప్పారావు గారి గీతాలు ఏ పేరుతో సంపుటంగా వెలువడ్డాయి – బసవరాజు అప్పారావు గేయాలు
  • స్వరాజ్యం అనగా అర్థం = సొంత పాలన
  • ప్రణవం అనగా అర్ధం = ఓంకారం
  • మోక్షం అనగా అర్దం = విడుపు లేదా విముక్తి
  • కంపించుట అనగా అర్థం = నణకడం.
  • స్వప్తి అనగా అర్థం = శుభం
  • జగత్తు అనగా అర్ధం = ప్రపంచం
  • కరములు అనగా అర్ధం = చేతులు.
  • తేనెల తేటల మాటలతో అనే ఈ మాసపు పాట ఎవరు రచించారు – ఇంద్రగంటి శ్రీకాంత శర్మ
  • ఇంద్రగంటి శ్రీకాంత శర్మ జననం – 1944 మే 29
  • మరణం — 2019 జూలై 25
  • ఇంద్రగంటి శ్రీకాంత శర్మ కవి, కథకులు, విమర్శకులు.
  • తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి – ఇంద్రగంటి శ్రీకాంత శర్మ
  • ఇంద్రగంటి శ్రీకాంత శర్మ రచించిన కవితా సంపుటి – అనుభూతి గీతాలు
  • ఇంద్రగంటి లలిత గీతాలు రచించారు. ఆకాశవాణిలో పనిచేశారు.
  • తెలివైన దుప్పి అనే కధ ఏ కధల నుండి గ్రహించారు – జాతక కధలు.
  • తాలివైన దుప్పి కధలో అడవిలో దుప్పిగా జన్మించింది – బోధి సత్వు

గోపాల్‌ తెలివి

  • గోపాల్‌ తెలివి పాఠ్యాంశ ప్రకీయ — కథ.
  • గోపాల్‌ తెలివి పాఠ్యాంశ ఇతివృత్తం – సమయస్ఫూర్తి.
  • ఢిల్లీ సుల్తాన్‌ తన సామంతులందరినీ పిలిచి రెండు ప్రశ్నలు వేస్తాను సమాధానాలు చెప్పగలరా అని అడిగాడు.
  • మొదటి ప్రశ్న – భూమి పొడుగు ఎంత ? వెడల్పు ఎంత?
  • మొదటి ప్రశ్న తరువాత సామంతులంతా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.
  • రెండవ ప్రశ్న – ఆకాశంలో ఎన్ని నక్షతాలున్నాయి.
  • ర0డవ ప్రశ్న తరువాత సామంతుల ముఖాలు పాలిపోయాయి.
  • సుల్తాను సామంతులలో ఉన్న మాళ్యారాజు పేరు – జయచందృడు
  • జయచందుని ఆస్థాన విదూషకుని పేరు – గోపాల్‌
  • జయచందుడు గోపాల్‌ ని ఢిల్లీ సుల్తాన్‌ వద్దకు పంపించాడు.
  • గోపాల్‌ కు ఢిల్లీ సుల్తాన్‌ తాను అడిగిన రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సంవత్సరం గడువు ఇచ్చాడు.
  • మొదటి ప్రశ్నకు సమాధానంగా గోపాల్‌ సంవత్సరం తరువాత 16 బండ్ల నిండా దారపు ఉండలు చూపించాడు.
  • 16 బండ్ల లోని 8 బండ్ల దారంలో భూమి అడ్డం పొడవును కొలిచానని చెప్పాడు.
  • రెండవ ప్రశ్నకు సమాధానంగా పాతిక గొరెలు చూపించి ఒక్కో గొర్రె వెంట్రుక ఒక్కో నక్షత్రనికి సమానం అని చెప్పాడు.
  • సుల్తాన్‌ గోపాల్‌ సమాధానాలు విని నవ్వి సన్మానించి పంపాడు
  • దర్భారు అనగా అర్ధం – రాజ్యసభ
  • విదూషకుడు అనగా అర్థం – హస్యగాడు
  • చూడగంటి అనే ఈ మాసపు పాట ఎవరు రచించారు. – తాళ్ళపాక అన్నమయ్య
  • చూడగంటి పాట తాళం – ఖండ
  • చూడగంటి పాట రాగం – బృందావని
  • తాళ్ళపాక అన్నమయ్య జననం – 1408 మే 9
  • మరణం — 1503 పిభ్రవరి 23
  • తాళ్ళపాక అన్నమయ్యను పద కవితా పితామహులు అంటారు.
  • అన్నమయ్య 32 వేల సంకీర్తనలు రాశాడు.
  • అన్నమయ్య వేంకటేశ్వర స్వామి కేంద్రంగా విశిష్ట సాహిత్యాన్ని , సంగీత సంస్కృతిని నిర్మించాడు
  • తాళ్ళపాక అన్నమయ్య కవిత్వంలో పొంగి పోర్లివి – తేట తెలుగు పలుకుబడి, దేశీ పద సంపద, వాడుకభాషలోని అపురూప మాధురి
  • విందు అనే కధ రచయిత — సోడుం రామ్మోహన్‌
  • సోడుం రామ్మోహన్‌ జననం – 1939 మార్చ్ 2
  • మరణం – 2008 నవంబర్‌ 12
  • సోడుం రామ్మోహన్‌ పతికా రచయిత.
  • పలు రచనలు, అనువాదాలు చేశారు.
  • నిఘుంటు నిర్మాణం కూడా చేశారు.
  • సోడుం రామ్మోహన్‌ రెండు దశాబ్దాలు పాటు విశాలాంధ్ర పతికలో ఒక దశాబ్దం పాటు ఉదయం పతికలో పనిచేశారు.
  • విందు అనే కధలో ఒకరోజు సూర్యుడు , చందుడు, వాయువు విందుకెళ్తారు.
  • సూర్యుడు, చంద్రుడు, వాయువు వాళ్ళ తల్లిపేరు – నక్షత్రం.
  • విందులో తల్లిని ఒక్కసారి కూడా గుర్తు చేసుకోకుండా వడ్డించిందల్లా కడుపు నిండా మెక్కింది – సూర్యుడు, వాయువు
  • కడుపే కైలాసంగా భావించి భోజనం చేసింది – సూర్యుడు, వాయువు.
  • చంద్రుడు తన ముందుంచిన రుచికర పదార్థాలలో కొన్ని తల్లికోసం జాగ్రత్తగా మూట కట్టుకున్నాడు
  • అర్థ రాతీరి దాటాక ఇంటికి వెళ్ళిన పిల్లలను నాకోసం ఏమి తెచ్చారు నాయనా అని వాళ్ళ అమ్మ నక్షత్రం అడిగింది.
  • సూర్యుడు “అమ్మా! నీ కోసం నేనేమీ తేలేదమ్మ ! వాళ్ళు పెట్టింది స్నేహితులతో ఆస్వాదించానే తప్ప నువ్వు గుర్తుకు రాలేదమ్మ “ అన్నాడు.
  • సూర్యుడు మాటలకు వాళ్ళ అమ్మ గుండె కలుక్కుమంది.
  • వాయువు ” నేను కూడా నీ కోసం ఏమీ తేలేదమ్మ నేను సుష్టిగా భోజనం చేయడానికి వెళ్ళాను గాని. నీకోసం ఏదో ఒకటి తేవాలనుకోలేదు” అన్నాడు.
  • వాయువు మాటలకు తల్లి హృదయం మరితం గాయపడింది.
  • చంద్రుడు “అమ్మ నువ్వొక పళ్ళెం తీసుకురా ! నీకోసం అత్యంత రుచికరమైన పదార్ధాలు తెచ్చాను. నేను విందులో ఏ పదార్ధం తింటున్నా నువ్వే గుర్తుకు వచ్చావు అన్నాడు.

దేశమును పేమించుమన్నా

  • పాఠ్యాంశ ప్రక్రియ – గేయం
  • ఇతివృత్తం — దేశభక్తి పెంపోోందించడం
  •  పాఠ్యాంశ రచయిత — గురజాడ వెంకట అప్పారావు
  • గురజాడ వెంకట అప్పారావు జననం — 1869 సెప్టెంబర్‌ 21
  • గురజాడ వెంకట అప్పారావు మరణం — 1915 నవంబర్‌ 30
  • ఆధునిక తెలుగు కవిత్వానికి, సాహిత్యానికి మార్గదర్శకులు — గురజాడ అప్పారావు
  • గురజాడ అప్పారావు గారు యుగకర్త, కవి, కథకులు, నాటకకర్త, చరిత్ర కారులు, శాసన పరిశోధకులు, భాషావేత్త .
  • తెలుగు సాహిత్యంలో వాడుకభాష ప్రవేశపెట్టి చిరస్మరణీయమైన రచనలు చేసింది – గురజాడ అప్పారావు.
  • ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్ట రచన – కన్యాశుల్కం .
  •  కన్యాశుల్కం రచయిత — గురజాడ అప్పారావు

పదాలు — అర్థాలు

బట్టి = ఏమీలేని

కద్దు = కలదు,ఉన్నది.

  • శివాజీ నాన్న – శంభోజీ
  • శంభోజీ ఒక రోజున శివాజీని బీజాపూర్‌ సుల్తాన్‌ దగ్గరకు తీసుకు వెళ్ళాడు.
  • సుల్తాన్‌ కు ఎలావందనం చేయాలో శంభోజీ శివాజీకి తర్ఫీదు ఇచ్చాడు.
  • శివాజీ తన మనస్సులో తాను * విదేశీయునికి శిరస్సు వంచను” అని అనుకున్నాడు
  • శివాజీ నమస్కారం చేయకపోయేసరికి బీజాపూర్‌ సుల్తాన్‌ కు కోపం వచ్చింది.
  • సుల్తాన్‌ కు “ చిన్నపిల్లవాడు ఇంకా మర్యాదలు తెలియనివాడు” అని శివాజీ గురించి సర్ది చెప్పింది ______________ మురారీపంతులు
  • గేయం ఆధారంగా జతపరచండి ?

తిండి కలిగితె (ఆ) (అ) చెప్పుకోకోయ్‌

జట్టిమాటలు (ఉ) (ఆ) కండకలదోయ్‌

జట్టిగొప్పలు (అ) (ఇ తోడుపడవోయ్‌

పొరుగువారికి (ఇ (ఈ) పట్టుకుని

చెట్టాపట్టాల్‌ (ఈ) (ఉ) కట్టి పెట్టాయ్‌

ఏకవచనపదాలు — బహునచనపదాలు

మాట – మాటలు

బండి – బండ్లు

జాతి – జాతులు

చిత్రం – చిత్రాలు

మతం – మతాలు

లాభం – లాభాలు

నాయకుడు – నాయకులు

  • విశాఖపట్టణంలో బస చేయడానికి అనువైన ప్రదేశం ఏది ?
  • ఈ గుర్తు (?) వాక్యంలో ఉంది కదా. ఈ గుర్తును (?) ప్రశ్నార్థక చిహ్నం అంటారు.
  • ఎప్పుడు, ఎక్కడ, ఏ, ఏది, ఎటువైపు వంటి ప్రశ్నార్ధ్థక పదాలు, ప్రశ్నార్ధ్థక గుర్తు గల వాక్యాలను ప్రశ్నార్ధ్థక వాక్యాలు అంటారు.
  • తెలుగు తల్లి అనే ఈ మాసపు పాట ఎవరు రచించారు – పిల్లల మరి వెంకట హనుమంతరావు
  • పిల్లల మరి వెంకట హనుమంతరావు జననం – 1921మే 7
  • మరణం – 1989 సెప్టెంబర్‌ 13
  • పిల్లలమరి గారు సాహిత్య వ్యాసాలు, కధలు, ఏకాంకికలు, ఖండ కావ్యాలు రచించారు.
  • ఫెల్లల మరి గారు విమర్శకుడు, కవి
  • ఫెల్లల మరి వెంకట హనుమంతరావు రచనలు 1. సాహిత్య సంపద

2. ఆంధ్ర భ్యదయం

3. కాపు పాటలు

  • కందిరీగ కిటుకు అనే ఈ మాసపు కథ ఎవరు రచించారు – రావూరి బరధ్వాజ
  • రావూరి భరద్వాజ జననం – 1927 జూలై 5
  • మరణం – 2013 అక్టోబర్‌ 18
  • రావూరి భరద్వాజ గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు.
  • రావూరి భరద్వాజ రాసిన తొలి కధ — విమల.
  • రావూరి భరద్వాజ మొత్తం 37 కధా సంపుటాలు రచించారు .
  • రావూరి రచించిన కధా సంపుటాలకు ఉదాహరణ — అపరిచితులు, కథధాసాగరం
  • రావూరి భరద్వాజ 43 పిల్లల కధలు రచించారు.
  • రావూరి భరద్వాజ రచించిన పిల్లల కధలకు ఉదాహరణ — ఉడతమ్మ ఉపదేశం, కీలుగుర్రం
  • రావూరి భరద్వాజ రాసిన నవలలకు ఉదాహరణ — కరిమింగిన వెలగపండు, జలప్రళయం
  • రావూరి భరద్వాజ రచించిన ఏన వలకు జ్ఞానపీర్‌ పురస్కారం లభించింది — పాకుడురాళ్ళు
  • రావూరి భరద్వాజ పొందిన పురస్కారాలు —

1. కళాప్రపూర

2. కేంద్ర సాహిత్య అకాడమీ

3. సోవియట్‌ భూమి నెహురూ పురస్కారం

4. రాజాలక్ష్మి ఫౌండేషన్‌ అవార్డు

5. గోపి చంద్‌ జాతీయ పురస్కారం

6. కళారత్న (ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం )

7. లోక్‌ నాయక్‌ ఫాండేషన్‌ పురస్కారం

  • కందిరీగ కిటుకు కధలో అడవికి రాజు – సింహం
  • సింహం చాలా మంచిది
  • తనను చూసి జంతువులు భయపడడం సింహనికి ఇష్టం లేదు.
  • అడవిలో ఏనుగు ఉండేది
  • ఏనుగు తెలివైనది. కానీ గుణం మంచిది కాదు. మరొకరు సుఖంగా ఉండడం, హాయిగా నవ్వుకోవడం ఏనుగుకు గిట్టదు.
  • ఏనుగు సింహంతో స్నేహం చేసి సింహంను తన చెప్పు చేతులలో పెట్టుకుంది.
  • ఏనుగుకు బుద్ది చెప్పడానికి కందిరీగ ఏనుగు చెవిలో దూరి బుద్ది చెప్పింది.

పరివర్తన

  • పరివర్తన పాఠ్యాంశ ప్రక్రియ – కథ
  • పరివర్తన పాఠ్యాంశ ఇతివృత్తం — పిల్లల స్వభావం తెలపడం
  • పరివర్తన పాఠ్యాంశ రచయిత — వెంకట పార్వతీశకవులు
  • వెంకట పార్వతీశ కవులు – 2 (ఇద్దరు)
  • 1. బాలాంత్రపు వెంకట్రావు .
  • 2. పిలేటి పార్వతీశం
  • బాలాంత్రపు వెంకట్రవు జననం — 1882
  • మరణం — 1955
  • త్రల్లిదండులు — సూరమ్మ , వెంకట నరసింహం
  • బాలాంత్రపు వెంకట్రవు తూర్పుగోదావరి జిల్లా మల్లాము లో జన్మించారు
  • ఓలేటి పార్వతీశం జననం – 1880
  • మరణం — 1970
  • ఓలేటి పార్వతీశం తల్లిదండులు — వెంకమ్మ, అచ్యుతరామయ్య
  • ఓలేటి పార్వతీశం తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో జన్మించారు.
  • పరివర్తన పాఠ్యాంశంలో అబ్బాయి పేరు – రాము
  • రాముకు ఆటలంటే ఇష్టం . బద్దకం ఎక్కువ . చదువంటే శ్రద్ద తక్కువ
  • బాబూ రాము చుట్టు ప్రక్కల పిల్లలు అందరూ బడికి వెల్లుతున్నారు. నువ్వుకుడా త్వరగా తయారయ్యి బడికి వెళ్ళు అని అన్నది – రాము వాళ్ళ అమ్మ
  • రాము బడికి వెళ్లకుండా మామిడి తోటలోకి వెళ్ళాడు.
  • రాము మొదట కాకిని ఆడుకుందామా అని అడిగాడు.
  • రానున్నది వానాకాలం . నాకు గూడు లేదు. పుల్లలు తెచ్చుకుని గూడు కట్టుకుంటున్నాను అని కాకి ఎగిరిపోయింది.
  • కాకి తరువాత రాము తేనె టీగలను ఆడుకుందామా అని అడిగాడు
  • నాకు అంత తీరిక లేదు బాబు. పూల నుండి తేనెను సేకరిస్తున్నాను. పూలు తొందరగా వాడి పోతాయి . నాకు చాలా పని ఉంది అంది – తేనెటీగ .
  • తేనెటీగ తరువాత రాము చీమల వద్దకు వెళ్ళి ఆడుకుందామా అని అడిగాడు.
  • బాబూ ఇది నేను గింజలు సేకరించుకునేకాలం. ఇప్పుడు గింజలు సేకరించుకోకపోతే వానాకాలంలో ఏమితింటాం . ఇప్పుడు కష్టపడి గింజలు సేకరించుకుంటే అప్పుడు సుఖంగా ఉండవచ్చు. అంది – చీమ
  • రాములో పరివర్తన వచ్చి బడికి వెళ్లిపోయాడు.

పదాలు — అర్థాలు

పరివర్తన = మార్పు

చిందరవందర = క్రమ పద్దతిలో లేకపోవడం

ఆహ్లాదం = సంతోషం 

చిన్నబుచ్చుకును = నిరాశపడు

  • క్రాకిమాటలు విని రాము చిన్నబుచ్లుకున్నాడు.
  • తేనెటీగలు మాట విని రాము దిగులుపడ్డాడు.
  • కింది పదాలు చదివి జతపరచండి ?

గలగల (ఆ) (అ) వానచినుకులు

చకచ (ఉ) (ఆ) సెలయేరు

పకపక (ఈ) (ఇ) ఏడవడం

వలవల (ఇ) (ఈ) నవ్వడం

టపటప (అ) (ఉ) నడవడం

  • కింది పదాలు చదివి వేరుగా ఉన్నవాటి కింద గీత గియండి ?

1. కాకి, కోయిల, పాము, పిచ్చుక

2. బొద్దింక, చీమ, ఈగ, ఏనుగు

3. కుక్క, పిల్లి, దోమ, గేదె

4. గులాబీ, టమాట, బెండకాయ, పొట్లకాయ

  • “పడవ నడపవోయి” అనే ఈ మాసపు పాట ఎవరు రచించారు – వింజ మూరి శివరామారావు
  • వింజమూరి శివరామారావు జననం — 1908
  • మరణం — 1982
  • వింజమూరి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం దగ్గర చంద్రపాలెం గ్రామంలో జన్మించారు.
  • వింజమూరి శివరామారావు కవి, రచయిత, ఆకాశవాణి కళాకారులు.
  • వింజమూరి శివరామారావు రచనలు — 1. గోర్కీ కథలు 2. కల్పివల్లి
  • వింజమూరి శివరామారావు ఖండ కావ్య సంపుటి – 1. గోర్కీ కధలు 2. కల్పవల్లి
  • ఉపాయం అనే కధ మహాభారతం అనే ఇతిహాసం నుండి గ్రహించబడింది
  • కౌరవులు, పాండవులు ఏ వంశానికి చెందిన వారు – భరతవంశం
  • కౌరవులు, పాండవులు బంతి ఆట ఆడుతున్నప్పుడు భీముడు బంతిని తన్నితే బంతి వెళ్ళి బావిలో పడింది.
  • దారిలో వెలుతున్న దోణా చార్యుడు బాణాల సహాయంతో బంతిని తీశారు.
  • దొణాచార్యుని ఉద్దేశించి “ మీ వంటి గొప్పవారు మా చిరంజీవులకు తారసపడడం మా పూర్వ జన్మ సుకృతం. ఈ పిల్లలు మా మనుమలు. వీరిని మీ శిష్యులుగా స్వీకరించి విలువిద్య నేర్పండి అన్నది ఎవరు — భీష్ముడు.
  • దొణుడు అంగీకరించగానే పరుగున వచ్చి దొణునికి పాదాభివందనం చేసింది – అర్జునుడు.

సత్యమహిమ

  • సత్యమహిమ పాఠ్యాంశ ప్రకీయ – గేయకథ
  • సత్యమహిమ పాఠ్యాంశ ఇతివృత్తం — నైతిక విలువలు పెంపోందించడం
  • సత్యమహిమ పాఠ్యాంశ రచయిత — అవధాని రమేష్‌
  • అవధాని రమేష్‌ శతాబ్దం – 20వ శాతాబ్దం
  • సత్యమహిమ అనే గేయ కథ ఎచట నుండి గ్రహించబడింది — గుజ్జనగూళ్లు
  • గుజ్జన గూళ్ళు అనునది ఎవరి రచన — అవధాని రమేష్‌
  • అవధాని రమేష్‌ ఆంధ్ర రాష్ట్రం లోని కర్నూలు జిల్లా అవుకు ఆగ్రహారంలో జన్మించారు.
  • అవధాని రమేష్‌ తల్లిదండులు — సావిత్రమ్మ, సుబ్రమణ్య శాస్త్రి
  • అవధాని రమేష్‌ గారి రచనలు — 1. కాసులపేరు

2.ప్రతీకారం

3.మూడు మంచి కథలు

పదాలు — అర్థాలు

మహిమ = గొప్పతనం

అకలంక = మచ్చలేని, చెడ్డగుణాలు, లేనట్టి

చరితుండు = చరిత్ర గలవాడు.

సత్యవ్రతండు = సత్యమును మాత్రమే మాట్లాడేవాడు

నిత్యంబు = ఎల్లప్పుడు

గతి = జీవితం నడిచేవిధానం

తెన్నులుచూసి = ఎదురు చూసి

మోము = ముఖం

తత్తరం = గాబరా

ఆర్తి = దుఃఖం

కని = చూసి

దీనత = దారిద్ర్యం 

మిరు మిట్లు = మెరుగులు

తిలకించి = చూసి

మది = మనస్సు

మొగంబు = ముఖం

మిసిమి = నూతనకాంతి

వన్నె = అందం, రంగు

చెన్ను = అందం

  • కింది ఆధారాలతో కొత్త పదాన్ని కనుక్కోండి

క్షీరాన్నం = పాయసం

ఒక శరీరభాగం = పాదము

ఒక పక్షి = పావురము

పుణ్యము కానిది = పాపము

రాయి = పొషాణము

పక్క భాగం = పార్వ్వము

బెల్లంతో చేసేది = పాయసం

కియా పదాలు :- పనులు జరగడాన్ని తెలియ చేయు పదాలను క్రియా పదాలు అంటారు

Ex:- వెళ్తారు, కోశారు, తెచ్చారు, ఇచ్చారు.

  • కింది వాక్యాలలో కియా పదాలు గుర్తించి గీత గియండి.

1. మానాన్న బొమ్మలు కొన్నాడు.

2. అత్త ఉత్తరు రాసింది.

3. ప్రవల్లిక నాట్యం చేసింది

4. తరుణ్‌ చిత్రం గీశాడు.

5. పిల్లలందరూ ఆటలు ఆడారు

6. మురళి పాటలు పాడాడు.

  • కన్నడ గేయం అని ఇవ్వబడిన ఈ మాసపు గేయం ఎచట నుండి గ్రహించబడింది – NCERT పాఠ్యపుస్తకం
  • ఏ కాలుది నేరం ? అని ఇవ్వబడిన ఈ మాసపు కథ ఎచట నుండి గ్రహించారు – మర్యాద రామన్న కథలు
  • మర్యాద రామన్న వద్దకు నలుగురు అన్నదమ్ములొచ్చారు.
  • పెద్దవారు ముగ్గురు ఫిర్యాదులు. చిన్నవాడు ముద్దాయి.
  • పెద్దవాడు వారు చేస్తున్న దూది వ్యాపారం గురించి రామన్నకు తెలిపాడు.
  • నలుగురు అన్నదమ్ములు దూది కొట్టంలో ఎలుకల బాధ తప్పడం కోసం ఒక పిల్లిని పెంచుకొనుచూ, పెల్లి 4 కాళ్ళను నలుగురు పంచుకుని ఎవరి కాలును వారు జాగ్రత్తగా చూసుకుంటున్నారు.
  • నాల్గవవాడు తీసుకున్న కాలుకి గాయం అవడం వలన నూనె గుడ్డలు చుట్టాడు.
  • పెల్లి దీపం వద్ద వెళ్ళడం వలన నూనెగుడ్డ అంటుకుని పిల్లి వలన దూది కోట్టెం తగలబడి పోయింది.
  • అందువలన 4వ వాడు ముద్దాయి అని పెద్దవాడు చెప్పాడు.
  • పిల్లి 3 కాళ్లతో పరిగెత్తి దూది కొట్టంలోకి వెళ్లింది కావున. ఆ ౩ కాళ్ళు పంచుకున్న మీ ముగ్గురే ముద్దాయిలు. మీరే 4వ వాడికి నష్టపరిహరం చెల్లించాలి అని మర్యాద రామన్న తీర్పు ఇచ్చాడు.

ముగ్గులో సంత్రాంతి

  • ముగ్గులో సంక్రాంతి పాఠ్యాంశ ప్రక్రియ – వ్యాసం
  • పాఠ్యాంశ ఇతివృత్తం – సంస్కృతి, సంప్రదాయాలు
  • ఈ పాఠంలో అనూష వాళ్ళ తమ్ముడు ఆదిత్య కలసి వాళ్ళ అత్తమ్మ ముగ్గుల పోటీలో వేసే ముగ్గును చూడడానికి వెళ్లారు.
  • అత్తమ్మను ముగ్గుల పోటీ వద్ద చూసి అదిగో అత్తమ్మ అన్నాడు – ఆదిత్య.
  • అత్తమ్మ ఒకే ముగ్గులో భోగిమంట, గంగిరెద్దులు, గాలిపటాలు భలేగా వేశావే అంది అనూష.
  • భోగిరాజు సాయంత్రం రేగుపళ్లు, శెనగలు, చెరకుముక్కలు, చిల్లర డబ్బులు, బంతిపూ ల రేకులు కలిపి భోగిపళ్లు పోస్తారు.
  • సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించడాన్ని ధనూస్వక్రమనం అంటారు. దీనిని ధనుర్మాసం అని కూడా అంటారు.
  • పశువులను పూజించే పండుగ – కనుమ
  • దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి ప్రయాణ సూచికగా రథంలో సూర్యుడ్ని నిలిపి రధం ముగ్గువేస్తారు.
  • సంక్రాంతి పండుగరోజు అనేక పందాలుతో పాటు బొమ్మల కొలువు పెడతారు.

పదాలు — అర్భాలు

పద్మం = తామరపువ్వు

ధనస్సు = విల్లు 

రాశి = నక్షత్రాల గుంపు

కలశం = చిన్నకుండ లేదా చెంబు

ఆయనం = గమనం

  • ముస్లింలు జరుపుకునే పండగలలో పవిత్ర పండగ — రంజాన్‌
  • దీనిని ఈద్‌ అని, ఈద్‌ ఉల్‌ ఫితర్‌ అంటారు.
  • రంజాన్‌ పండుగ ఇస్తాం క్యాలండర్‌ ప్రకారం రంజాన్‌ నెల మొదటి రోజు పారంభం అవుతుంది .
  • ఈరోజు రాతిరి చంద్రదర్శనం కాగానే మసీదులలో చేయు ప్రత్యేక పార్ధనలు – తరావీ నమాజ్‌
  • రంజాన్‌ నెల అంతా ఉపవాసం చేస్తారు.
  • తెల్లవారు జామున 4 గంటలకే నిద్రలేస్తారు.
  • సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందే భోజనం చేయడాన్ని ఏమని పిలుస్తారు – సహరి 
  • పగలంతా ఉపవాసం చేస్తారు.
  • సూర్యాస్తమయం తర్వాత ఉపవాస దీక్ష విరమిస్తారు. దీనిని ఇఫ్తార్‌ అంటారు.
  • ముస్లింలు సంవత్సరానికి ఒకసారి వారి ఆదాయం, సంపదపై ఒకలెక్క ప్రకారం పేదలకు చేయు దానధర్మాలను ఏమంటారు — జకాత్‌.
  • రంజాన్‌ నెల చివరిరోజు చంద్ర దర్శనంతో షవ్వాల్‌ నెల పారంభం అవుతుంది.
  • తరువాత రోజు పెద్ద ఎత్తున ఈద్‌ పండుగ జరుపుకుంటారు
  • ఈద్‌ గాహ్‌ కి వెళ్ళి సామూహిక పార్థనలు చేస్తారు.
  • ఇంటిల్లి పాదీ ఆరోజు ఉదయం సేమ్యా పాయసం సేవిస్తారు.

తమాషా పదాలు.:-

  • మట్టి అనగా అర్ధం మన్ను
  • మట్టి మనుషులు అర్ధం= శ్రామికులు, శ్రమజీవులు.
  • మట్టిలో కలసిపోవడం = మరణించడం
  • మట్టి పాలైన = వృధా అయిన
  • మన్ను తిన్న పాములాగ = కదలక, మెదలక
  • నోట్లో మట్టికొట్టథం = అన్యాయం చేయడం
  • తల అనగా అర్ధం – శిరస్సు , శిరము
  • తలవంపులు అనగా అర్ధం = పేరు పొగట్టడం
  • తలసరి అనగా అర్ధం = ఒక్కొక్కరి
  • తలపండిన అనగా అర్ధం = అనుభవం కలిగిన
  • తలలో నాలుక అనగా అర్థం = అందరికీ గుర్తుండడం
  • తలదూర్హడం = సంబంధం లేని విషయాలలో కలుగచేసుకోవడం.

విశేషణాలు :- ఒక వాక్యంలో నామవాచకం రంగు, రుచి, స్థితి మొదలైన గుణాలను తెలియచేయు పదాలు.

  • వాక్యంలో విశేషణం సాధారణంగా నామవాచకానికి ముందు వస్తుంది.
  • నామవాచకం గుణాలు తెలిపే పదాలు — విశేషణాలు.
  • Ex. అందమైన, పచ్చని, తియ్యని, కమ్మని.
  • కింది వాక్యాలు చదివి విశేషణ పదాలు కింద గీత గదియండి?

1. ఏనుగు పెద్ద జంతువు

2. నిమృ్మకాయకు పుల్లని రుచి ఉంటుంది.

3. పుస్తకానికి అందమైన అట్టవేశారు.

4. పచ్చని గోరింటాకు ఎర్రగా పండుతుంది

5. కాచిన పాలు తాగాలి.

  • గొబ్బిళ్ళ పాట అనే ఈ మాసపు పాట ఎచట నుండి గ్రహించబడింది – సంప్రదాయ జానపద గేయాలు
  • గొబ్బియళ్ళు గొబ్బ్జియళ్ళు స్ట
  • గొబ్బియళ్ళు చందమామ ఓ చందమామ.
  • నకలీ కన్ను అనే ఈ మాసపు కధ ఎచట నుండి గ్రహించారు — నసీరుద్దీన్‌ కథలు.
  • ధనికుడి లోభం, దరిద్రుడి దానం అనునది – సామెత
  • మౌల్వీనసీరుద్దీన్‌ ఒక ధనుకుడిని కలిశాడు. ఆయన లోభి
  • ఆ ధనికుడి కళ్ళలో ఒకటి నకిలీది.
  • నసీరుద్దీన్‌ ను ధనికుడుతో ఇలా అన్నాడు … నా కళ్ళలో ఏది నకలీ కన్నో కనుక్కుంటే చందా ఇస్తాను అన్నాడు.
  • మౌల్వి ఎడమకన్ను నకిలీదని చెప్పాడు
  • నసీరుద్దీన్‌ ఎలా చెప్పావని అడిగితే. : మీ అసలు కన్నుకు దయా, జాలి ,కరుణా ఉండవు కదా. అందుకే అది రాయిలా కనిపించింది. ఎడమ కంట్లో కొంచెం దయా, పేమ కనిపించాయి అని చెప్పాడు.

పద్యరత్నాలు

  • పాఠ్యాంశ ప్రకియ – పద్యం
  • ఇతివృత్తం — నైతిక విలువలు
  • ధనము కూడ బెట్టి దానంబు సేయక …. అనే పద్యం ఎవరు రచించారు
  • వేమన శతకం రచయిత — వేమన
  • పుత్రా తృాహము తండ్రికి ….. అనే పద్యం ఎవరు రచించారు – బద్దెన
  • సుమతీ శతకం రచయిత — బద్దెన
  • పరుల కొరకే నదులు ప్రవహించు , గోవులు – అనే పద్యం ఏ శతకం నుండి గ్రహించారు – తెలుగు బాల శతకం
  • తెలుగు బాల శతకం రచయిత — జంద్యాల పాపయ్య శాస్త్రి
  • మొదలు చూసిన కడుగొప్ప పిదప కుజచ…. అనే పద్యం ఎవరు రచించారు – ఏనుగు లక్ష్మణ కవి
  • సుభాషిత రత్నావళి రచయిత — ఏనుగు లక్ష్మణ కవి
  • ఎంత చెలిమి యున్న ఎగతాళి చేయకు – అనే పద్యం ఏ శతకం నుండి గ్రహించారు — తెలుగు పూల శతకం
  • తెలుగు పూల శతకం రచయిత — నార్ల చిరంజీవి
  • మతములెన్ని యున్న మానవత్వముక్కటే – అనే పద్యం ఎవరు రచించారు — నార్ల వెంకటేశ్వరరావు
  • బ్రతుకవచ్చు గాక బహు బంధనములైన — అనే పద్యం ఎవరు రచించారు – పోతన
  • పూజకన్నా నెంచ బుద్ది ప్రధానంబు — అనే పద్యం ఏ శతకం నుండి గ్రహించారు – వేమన

పదాలు — అర్ధాలు

లెస్స = మిక్కిలి ఎక్కువగా

తెరువరి = బాటసారి

పుత్రొ త్సాహము = కొడుకు పుట్టిన సంతోషం

జనులు = ప్రజలు

కనుగొని = గుర్తించి

పరులు = ఇతరులు

పరహితము = ఇతరులకు మేలు 

పరమార్ధము = నిజమైన ప్రయోజనం 

నిగ్రహించు = ఎదిరించు 

కురచ = పొట్టి 

ఆది = మొదలు 

తనరు = వర్ధులు 

దినపూర్వ = ఉదయకాలం 

ఛాయ = నీడ 

కుజన = చెడ్డవారు 

సజ్జనలు = మంచివారు 

మైత్రి = స్నేహం 

చెలిమి = స్నేహం 

సరసం = ఇష్టం 

విరసం = అయిష్టం 

బంధనములు = కట్లు 

లేమి = పేదరికం 

జీవధనం = ప్రాణం 

మానధనులు = మానమే ధనంగాకలవారు 

బుద్ది = ఆలోచన 

ప్రధానము = ముఖ్యం 

దృడం = గట్టిది 

  • కింది తమాషా వాక్యాలు చదివి, జవాబు రాయండి !

1. వడన తినే వడ- దవడ

2. రోజాలను పెట్టుకునే రోజాలు- సరోజ (అమ్మాయి)

3. జనాలు తినే జనం- భోజనం

4. ఖండాలు, దేశాలు లేని పటం- కపటం

5. పేమను పంచే కారం- మమకారం

6. తాగలేని పాలు – పాపాలు

భూతకాలం:- జరిగిపోయిన పనిని తెలియచేయు కాలం

Ex:- పాడింది, వెళ్లాము

వర్తమాన కాలం :- జరుగుతున్న పనిని తలియచేయు కాలాలను వర్తమాన కాలం అంటారు

Ex:- ఆడుతున్నాడు, ఎక్కుతూ ఉంది

భవిష్యత్‌ కాలం : జరగబోయే పనిని తలియచేయు కాలాన్ని భవిష్యత్‌ కాలం అంటారు.

Ex:- తెస్తాడు, వెళతాడు

  • కింది వాక్యాలు చదివి అవి ఏ కాలంలో ఉన్నాయో రాయండి ?

1. జోసఫ్‌ రేపు విశాఖపట్టానికి వెళ్ళాడు భవిష్యత్‌ కాలం

2. రమణి సినిమా చూసింది భూతకాలం

3. హర్షిత పాఠం చదువుతున్నది వర్తమాన కాలం

4. ఖాదర్‌ కథ రాశాడు భూతకాలం

5. మణి మేఖల ముగ్గు వేస్తున్నది వర్తమానకాలం

6. రాబర్ట్‌ రేపు ఇంటికి రంగులు వేస్తాడు భవిష్యత్‌ కాలం

  • వీరగంధము తెచ్చినారము

వీరుడెవ్వడో తెల్పుడి అనే ఈ మాసపు గేయం ఎవరు రచించారు — తిపురనేనిరామస్వామి

  • తీపురనేని రామస్వామి జననం – 1887 జనవరి 15
  • మరణం — 1943 జనవరి 16
  • తిపురనేని రామస్వామి హేతువాద రచయిత
  • తిపురనేని రామస్వామి బిరుదు – కవిరాజు
  • తిపురనేని రామస్వామి రచనలు – 1. సూతపురాణం 2. పల్నాటి సారుషం
  • పేను – నల్లీ అనే ఈ మాసపు కథ ఎచట నుండి గ్రహించారు – నీతి చందిక
  • నీతి చందిక రచయిత – పరవస్తు చిన్నయసూరి
  • రాజు గారి మంచంలో పేను నివసించేది
  • ఒకరోజు పేను దగ్గరికి నల్లీ వచ్చింది
  • నల్లికి తనకు రాజుగారి రక్త తాగాలనుంది అని తన కోరికను పేనుతో చెప్పింది
  • పేను రాజుగారిని నల్లీ కుట్టే సమయం, సందర్భం వివరించి చెప్పింది
  • నల్లీ పేను మాట వినకుండా తొందరపడి రాజు గారిని కుట్టడం వలన రాజుగారి సైనికుల చేతిలో పేను చనిపోయింది .నల్లీ త్వరగా పారిపోయింది ..పేను దొరికిపోవడం వలన చనిపోయింది ..

బారిష్టర్‌ పార్వితిశం

  • పాఠ్యాంశ ప్రక్రియ – కధనం
  • పాఠ్యాంశ ఇతివృత్తం – హస్యం
  • పాఠ్యాంశ రచయిత — మొక్కపాటి నరసింహశాస్త్రి
  • మొక్కపాటి నరసింహశాస్త్రి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు
  • తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన హస్య నవల — బారిష్టర్‌ పార్వతీశం
  • మొక్క పాటి నరసింహశాస్త్రి రచనలు – 1.మొక్కుబడి

2 అభ్యుదయం

3.పెద మామయ్య

  • బారిష్టర్‌ పార్వతీశం పేరు – వేమూరి పార్వతీశం
  • నరసాపురం దగ్గర మొగలితురు వీరు కాపుర స్థలం
  • టెయిలర్‌ స్కూలులో 5వ ఫారము వరకూ చదువుకున్నారు
  • స్నేహితుని సలహాతో బారిష్టర్‌ చదువుదామని నిర్ణయించుకున్నాడు
  • తాను వెళుతున్న రైలులో చైన్‌ లాగి సామాను కట్టినందుకు 50 రూపాయిల జరిమానా విధిస్తే, బతిమలాడి తప్పించుకున్నాడు .
  • చెన్న పట్నంలో (మద్రసులో టోపీలు అమ్మేవారి దగ్గర ఖర్జుర పాకులతో అల్లిన ఆడవారు పెట్టుకునే పెద్ద టోపీ కొన్నాడు
  • తూత్తుకుడిలో రైలు ఆగింది. అక్కడ కొలంబోవెళ్లే ప్టీమరు ఎక్కాడు .
  • కొలంబో నుండి మార్చేల్స్‌ వెళ్ళే స్టీమర్‌ ఎక్కాడు .

పదాలు — అర్ధాలు

ఐదవ ఫారము = 10వ తరగతి

హితోపదేశం = మేలు చేసే మాట

బారిష్టర్‌ = ఇంగ్లాండ్‌ లో న్యాయశాస్త్రం చదువుకున్న వారు

దంతధావనము = పళ్ళు తోముకోవడం

కచ్చికలు = కాల్లిన పిడకలు

అంగవస్తం = తువ్వాలు

చాదు = పిండితో తయారు చేసిన బొట్టు

దొర = తెల్లజాతి పురుషుడు

దొరసాని = తెల్లజాతిస్త్రీ 

స్టీమరు = ఆవిరితో నడిచే పెద్దనావ

  • గుర్రనికి సుడులు కావాలి. గాడిదకు అవసరంలేదు. గుర్రన్ని కోనాలి. గాడిదను కోనక్క ర్లేదు . గుర్రనికి జీను కావాలి గాడిదకు అక్కరలేదు. ఆశ్వానికి సంరక్షణకావాలి.గార్థభానికి అవసరం లేదు. హయానికి గుగ్గిళ్ళ దాణా పెట్టాలి. గాడిదకు ఇవి అనవసరం అందుకే నేను గాడిదను అధిరోహిస్తాను అని అన్నది – చిలకమర్తి రాసిన గణపతి నవలలో గణపతి
  • ఆశ్వానికి పర్యాయ పదాలు – గుర్రం, హయం
  • గాడిదకు మరొక పేరు – గార్థభం
  • రోహిణి కార్తెలో ఎండకు రోళ్ళు పగులుతాయి
  • నక్షత్రలు మొత్తం – 27
1.అశ్వని4.రోహిణి7.పునర్వసు10ముఖ13.హస్త16. విశాఖ19. మూల22. శ్రవణం25.పూర్వ బాధ్ర
2.భరణీ5.మృగశిర8. పుష్య11. పుబ్బ14.చిత్త17. అనూరాధ20.పూర్వాషాడ23.ధనిష్టం26.ఉత్తరాబాధ్ర
3.కృత్తిక6.ఆరుద్ర9.ఆన్లేష12. ఉత్తర15.స్వాతి18.జ్యేష్ట21.ఉత్తరాషాడ24. శతభిషం27.రేవతి
  • పూర్ణిమనాడు ఏ నక్షత్రం ఉంటే ఆనెలకు ఆపేరు పెట్టారు.
  • అశ్వని అంటే ఆశ్వయుజ మాసం
  • కృత్తిక అంటే కార్తీక మాసం
  • రాశులు, నక్షత్రలన్నీ చంద్రమానం మీద ఆధారపడి ఉంటాయి .
  • సూర్యుడు ఏ నక్షత్రనికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ కార్తే పేరు పెట్టారు.
  • సంవత్సరానికి 27 కార్తెలు
  • అశ్విని కురిస్తే అంతానష్టం .
  • భరణిలో చల్లిన నువ్వు చేను కాయకు బరిగెడు గింజట .
  • కియా పదాలు వాక్యంలో వాడినపుడు అవి రెండు రకాలుగా పనిచేస్తాయి 1.వాక్యాన్ని పూర్తి చేయడం చేయకపోవడం
  • వాక్యాన్ని పూర్తి చేయగలిగిన కీయాలను సమాపక కీయలు అంటారు
  • సమాపక కియా వాక్యాలు :- 1. రవి ఇంటిపని చేశారు.

2. పెల్లలు నడుస్తునారు .

3. లత పరీక్ష రాస్తుంది .

  • వాక్యాన్ని పూర్తి చేయలేని క్రియాలను అసమాపక కియలు అంటారు
  • అసమాపక కియా వాక్యాలు 1. రవి ఇంటిపని చేసి…..

2. పిల్లలు నడుస్తూ … 

3. లతా పరీక్షలు రాసి…

  • ఏరువాక పాట అనే ఈ మాసపు పాట ఎవరు రచించారు – బిరుదురాజు రామరాజు
  • బిరుదు రాజు రామరాజు జననం — 1925 april 16
  • మరణం — 2010 ఫిభ్రవరి 8
  • బిరుదు రాజు రామరాజు వరంగల్‌ జిల్లా దేవనూరు గానంలో జన్మించారు.
  • తెలుగు జానపద గేయ సాహిత్యం పై మొట్టమొదటగా పరిశోధన చేసింది – బిరుదురాజు రామరాజు
  • బిరుదు రాజు రచనలు — 1. తెలుగు జానపద రామాయణం

2.తెలుగు సాహితోద్దారకులు

అత్యాశ అనే ఈ మాసపు కథను ఎచట నుండి గ్రహించారు – పంచతంత్ర కథలు

ఒక అడవిలో జిత్తులమారి నక్క ఉంది.

రెక్కాడితే గాని డొక్కాడదు అనే బాధ నక్కలకు ఉండదు.

వేటగాడు వేటాడి చంపిన లేడిని భుజాన వేసుకుని వస్తుండగా పందిని చూశాడు

సూకరం అనగా అర్థం – పంది

వేటగాడు కొట్టిన బాణం పందిని గాయంచేసింది

పంది వేటగాడి మీద దాసిచేసి చంపింది

ఈ పెనుగులాటతో ఒక పాము చచ్చింది

పాము, లేడి, వేటగాడు, పంది మాంసాన్ని ఒకేసారి చూసిన నక్క వీటిని ఎప్పుడైనా తినవచ్చు గాని ముందుగా నరాలతో తయారు చూసిన

వింటి నారిని తింటాను అనుకుని దానిని దొరికింది

విల్లు దెబ్బకు నక్క చనిపోయింది

రాజు — కవి

  • రాజు – కవి పాఠ్యాంశ ప్రక్రియ — పద్య కధ
  • పాఠ్యాంశ ఇతివృత్తం – సామాజిక అంశం
  • రాజు – కవి పాఠ్యాంశ రచయిత — గుర్రం జాషువా
  • మరణం — 1971 జులై 24
  • జాషువా కవిత్వ లక్షణాలు – 1. ప్రశస్తమైన పద్య శిల్పం

2. సులలితమైన ధార

3. దళితుల పట్ల అపారమైన పేమ

4. సామాజిక అసమానతల పట్ల ఆగ్రహం

గుర్రం జాషువా గుంటారు జిల్లా వినుకోండలో జన్మించారు

గుర్రం జాషువా బిరుదులు – 1.నవయుగ కవి చక్రవర్తి 2. కళా ప్రపూర్ణ

గుర్రం జాషువా రచనలు – 1.ఫిరదౌసి  2.గబ్బిలము  3.క్రీస్తు చరిత్ర

రాజు- కవి పాఠంలో రవి వాళ్ళ తాతయ్య వద్దకు వచ్చి రాజు, కవి వీరిలో ఎవరు గొప్పవారు తెలుసుకుని రమ్మన్నారు మా మాష్టారు అన్నాడు.

రాజు – కవి కధ తాతయ్య చెప్పాడు

రాజు – చనిపోయాక ప్రజలందరూ “అయ్యో ! చుక్క రాలింది అన్నారు.

కవిగారు మరణించిన తర్వాత కవిగారు ఆకాశంలో ధృవ తారలా ప్రకాశిస్తున్నారు అన్నారు.

రాజు గారి గుర్తుగా రాజ్యమంతటా విగ్రహలు పెట్టారు. కొంత కాలానికి రాజుగారిని మరచిపోయారు .

కవి రాసిన రచనలు, పద్యాలు పాడుకుంటూ కవిని ఎప్పటికీ మరచి పోలేదు.

పదాలు — అర్ధాలు

సౌధం = బంధం 

ప్రబలడం = ఎక్కువ కావడం 

సుకవి = మంచి కవి

రాజదండం = రాజ శాసనం 

రుచిమయం = కాంతితో నిండినది 

గండ వితతిమయం = రాళతో నిండినది 

ఆత్మ గౌరవ కాములు = తమ గౌరవాన్ని కోరుకునేవారు 

ప్రస్తుతింతురు = పొగుడుతారు 

సుధ = అమృతం 

ఇహం = ఇలోకం

వరం = పరలోకం 

గగనం = ఆకాశం 

  • గజనీమహ్మద్‌ ఆస్థానంలో మహాకవి — ఫిరదౌసి
  • ఫిరదౌసిని పిలిచి గజనీ మహ్మద్‌ తన విజయ యాత్రలను గ్రంధంగా రచిస్తే పద్యానికి ఒక బంగారు నాణెం ఇస్తానన్నాడు.
  • 30 సంత్సరాలు ఫిరదౌసి శ్రమించి రాజుగారి గురించి రచించిన గ్రంధం — షానామా
  • షానామాలో గల పద్యాల సంఖ్య – 60 వేలు
  • రాజు గారు బంగారు నాణేలు బదులు వెండి నాణేలు ఇచ్చాడు.
  • అప్పుడు కవి రాజు గారిని నిందిస్తూ పద్యాలు రాశాడు.
  • రాజు తప్పు గ్రహించి బంగారు నాణేలు పంపాడు.
  • కింది పదాలు ఆధారంగా చివర “లం” వచ్చే పదాలు రాయండి!

1. రాసే సాధనం – కలం

2. నీరు – జలం

3. నాగలి– హలం

4. రంధ్రం – బిలం

5. సమయం – కాలం

6. శక్తి- బలం

  • కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి ?

1. ఇల్లు – నివాసం, గృహం

2. ధనం — డబ్బు, విత్తము

3. ప్రపంచం — జగత్తు ,విశ్వము

4. తార -నక్షత్రం ,చుక్క

5. కత్తి– ఖడ్గం ,కరనాలం

  • వెయ్యెళ్ళ కవినోయ్‌ అనే ఈ మాసపు పాట ఎవరు రచించారు – అడవి బాపిరాజు
  • అడవి బాపిరాజు జననం — 1887 జనవరి 15
  • మరణం — 1943 జనవరి 16
  • అడవి బాపిరాజు కవి, నవలాకారుడు, కథకుడు, చిత్రకారుడు
  • అడవి బాపిరాజు రచనలు – 1. నారాయణరావు

2. హిమబిందు

3. గొనగన్నారెడ్డి

4. శశికళ

5. గంగిరెద్దు

  • దెబ్బకు దెబ్బ అనే ఈ మాసపు కధ ఎచట నుండి గ్రహించారు – నీతికధలు
  • ఒక రైతు కట్టెలు కొట్టుకుని జీవించే వాడు.
  • ఒక వ్యాపారి రైతు వద్ద కట్టెల బండి 20 రూపాయిలకు కొని కట్టెలతో పాటు బండి కూడా లాక్కొన్నాడు
  • రైతువాళ్ళ కూతురు వ్యాపారి వద్దకు ఎండుకట్టెలుమోపు తీసుకు వెళ్లింది
  • ఎండు కట్టెలమోపు రెండు గుప్పిళ్ళ బియ్యంకు వ్యాపారికి అమ్మింది
  • బియ్యంతో పాటు గుప్పిళ్ళ కూడా కోసి ఇవ్వాలి అని అడిగి వ్యాపారికి బుద్ది చెప్పింది.

Post a Comment

0 Comments