Ticker

6/recent/ticker-posts

6th Class Social Bits 10th Lesson స్థానిక స్వపరిపాలన

I. బహుళైచ్ఛిక ప్రశ్నలు

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

1. గ్రామ పంచాయితీ సభ్యులను, సర్పంచను వీరు ఎన్నుకుంటారు.
A) గ్రామ ప్రజలు
B) గ్రామ ఓటర్లు
C)మండల సభ్యులు
D) వార్డులోని ప్రజలు
జవాబు:
B) గ్రామ ఓటర్లు

2. ఓటర్ల జాబితాలో పేరు నమోదు కావాలంటే ఇన్ని సం||రాలు నిండి ఉండాలి.
A) 18
B) 21
C) 15
D) 25
జవాబు:
A) 18

3. గ్రామ పంచాయితీలో పోటీ చేయడానికి అర్హత కల్గిన వయస్సు ఇన్ని సం||రాలు నిండి ఉండాలి.
A) 18
B) 21
C) 15
D) 25
జవాబు:
B) 21

4. గ్రామానికి ప్రథమ పౌరుడు/పౌరురాలు
A) వార్డుమెంబర్
B) సర్పంచ్
C) గ్రామకార్యదర్శి
D) పైవన్నీ
జవాబు:
B) సర్పంచ్

5. పార్లమెంట్ స్థానిక సంస్థలలో మహిళలకు ఇంత రిజర్వేషన్ కల్పించింది.
A) 2/3 వంతు
B) 1/3 వంతు
C) 1/4 వంతు
D) 1/6 వంతు
జవాబు:
B) 1/3 వంతు

6. గ్రామ పంచాయితీ ఎన్నికలు ఇన్ని సం||రాలకు ఒకసారి జరుగుతాయి.
A) 2
B) 3
C) 5
D) 6
జవాబు:
C) 5

7. ప్రతి వార్డులోని వ్యక్తి గ్రామ పంచాయితీ ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వేస్తాడు?
A) 1
B) 2
C) 3
D) 4
జవాబు:
B) 2

8. ప్రజాస్వామ్య బద్ధంగా పాలన నిర్వహించడానికిగాను వీటిని ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసింది.
A) గ్రామసభ
B) గ్రామ సంఘం
C) గ్రామ కంఠం
D) పైవన్నీ
జవాబు:
A) గ్రామసభ

9. గ్రామసభలో వీరికి సభ్యత్వం ఉంటుంది.
A) గ్రామంలోని ఓటర్లు అందరికి
B) గ్రామపంచాయితీ సభ్యులకు
C) గ్రామంలోని పెద్దలకు
D) మండల పరిషత్ సభ్యులకు
జవాబు:
A) గ్రామంలోని ఓటర్లు అందరికి

10. ప్రతి గ్రామాన్ని ఈ విధంగా విభజిస్తారు.
A) వీధులుగా
B) వారులుగా
C) డివిజన్లగా
D) కౌన్సిల్‌ గా
జవాబు:
B) వారులుగా

11. ప్రతి గ్రామ పంచాయితీకి జనాభాను బట్టి ఉండవలసిన కనిష్ట – గరిష్ట సభ్యుల సంఖ్య
A) 5-10
B) 5-20
C) 5-21
D) 5-25
జవాబు:
C) 5-21

12. గ్రామ పంచాయితీకి వచ్చే ఆదాయ వ్యయాలకు బాధ్యత వహించేది.
A) సర్పంచ్
B) ఉపసర్పంచ్
C) పంచాయితీ సభ్యులు
D) పైవారందరూ
జవాబు:
A) సర్పంచ్

13. ఉప సర్పంచ్ ను ఎన్నుకునేవారు.
A) గ్రామ సభ సభ్యులు,
B) గ్రామ పంచాయితీ సభ్యులు
C) సర్పంచ్
D) గ్రామ ఓటర్లు
జవాబు:
B) గ్రామ పంచాయితీ సభ్యులు

14. మండల పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గ సభ్యులను (MPTCS) ఎన్నుకునేది.
A) మండల పరిషత్ ఛైర్మన్
B) సరుండ్లు
C) గ్రామంలోని ఓటర్లు
D) పైవారందరూ
జవాబు:
C) గ్రామంలోని ఓటర్లు

15. జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గ సభ్యులను (ZPTCS) ఎన్నకునేది.
A) MPTC లు
B) సర్పండ్లు
C)మండలంలోని ఓటర్లు
D) పైవారందరూ
జవాబు:
C)మండలంలోని ఓటర్లు

16. నగరాలలో, పట్టణాలలో ఉన్న స్థానిక పాలనా వ్యవస్థను ఇలా పిలుస్తారు.
A) పంచాయితీ వ్యవస్థ
B) పురపాలక వ్యవస్థ
C) జిల్లా పరిషత్తు
D) పైవన్నీ
జవాబు:
B) పురపాలక వ్యవస్థ

17. జనాభా ప్రాతిపదికన మనకు ఉన్న పురపాలక సంస్థలు ఇన్ని రకాలు.
A) 2
B) 3
C) 4
D) 5
జవాబు:
B) 3

18. నగర పంచాయితీలో ఉండే జనాభా
A) 20,000-40,000
B) 20,000-30,000
C) 20,000-50,000
D) 25,000-50,000
జవాబు:
A) 20,000-40,000

19. మున్సిపల్ కౌన్సిల్ (పురపాలక సంఘం) నందు ఉండు జనాభా.
A) 20,000-40,000
B) 40,000-3,00,000
C) 3,00,000 పైన
D) ఏదీకాదు
జవాబు:
B) 40,000-3,00,000

20. గుంటూరు పట్టణ జనాభా 5 లక్షలు, అయినా ఈ పట్టణం ఏ పాలన వ్యవస్థ కిందకు వస్తుంది?
A) నగర పంచాయితీ
B) పురపాలక సంఘం
C) కార్పోరేషన్
D)మహానగరం
జవాబు:
C) కార్పోరేషన్

21. పురపాలక సంఘంలో వార్డు సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించేది.
A) కౌన్సిలర్
B) కార్పో రేటర్
C) ఛైర్మన్
D) మేయర్
జవాబు:
A) కౌన్సిలర్

22. కార్పోరేషన్ అధ్యక్షుడు
A) సర్పంచ్
B) కార్పోరేటర్
C) ఛైర్మన్
D) మేయర్
జవాబు:
D) మేయర్

23. పురపాలక సంఘానికి అధ్యక్షుడు.
A) సర్పంచ్
B) కార్పోరేటర్
C) చైర్మన్
D) కౌన్సిలర్
జవాబు:
C) చైర్మన్

24. పురపాలక సంఘంలో వార్డు ప్రతినిధులను, నగర పాలక సంస్థలో వార్డు ప్రతినిధులను ఈ విధంగా పిలుస్తారు.
A) కార్పో రేటర్, కౌన్సిలర్
B) కౌన్సిలర్, కార్పోరేటర్
C) చైర్మన్, కార్పోరేటర్
D) చైర్మన్, మేయర్
జవాబు:
B) కౌన్సిలర్, కార్పోరేటర్

25. భారత రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ స్థానిక స్వపరి పాలనను సూచిస్తుంది.
A) 40
B) 45
C) 50
D) 73
జవాబు:
A) 40

26. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేసారు.
A) 40
B) 73
C) 74
D) 75
జవాబు:
B) 73

27. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా పట్టణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనను ఏర్పాటుచేసారు.
A) 40
B) 73
C) 74
D) 75
జవాబు:
C) 74

28. ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ రాజ్ చట్టం చేసిన సం||
A) 1992
B) 1993
C) 1994
D) 1995
జవాబు:
C) 1994

29. స్థానిక స్వపరిపాలనను అమలు చేసిన మొదటి రాష్ట్రం
A) ఆంధ్రప్రదేశ్
B) గుజరాత్
C)మహారాష్ట్ర
D) రాజస్థాన్
జవాబు:
D) రాజస్థాన్

30. మన ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీల్లో మహిళలకు ఎంతశాతం రిజర్వేషన్లు కల్పించారు?
A) 33%
B) 40%
C) 50%
D) 45%
జవాబు:
C) 50%

31. ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభించిన తేది
A) అక్టోబర్ 2, 2018
B) అక్టోబర్ 2, 2019
C) అక్టోబర్ 2, 2020
D) అక్టోబర్ 2, 2017
జవాబు:
B) అక్టోబర్ 2, 2019

32. ప్రతిగ్రామ సచివాలయంలో ఇంతమంది గ్రామ నిర్వహకులు (ఉద్యోగులు) ఉంటారు.
A) 9
B) 10
C) 11
D) 12
జవాబు:
C) 11

33. ఆంధ్రప్రదేశ్ లోని మొదటి పురపాలక సంఘం
A) విశాఖపట్నం
B) మచిలీపట్నం
C) ఇబ్రహీంపట్నం
D) భీమునిపట్నం
జవాబు:
D) భీమునిపట్నం

34. సినిమా టికెట్ల మీద పన్ను విధించునది.
A)మండల పరిషత్
B) జిల్లా పరిషత్
C) పురపాలక సంఘం
D) పైవన్నీ
జవాబు:
C) పురపాలక సంఘం

35. మండల పరిషత్, జిల్లా పరిషత్ లో ‘నియమించ’బడే సభ్యులను ఇలా అంటారు.
A) MPTC, ZPTC లు
B) కో ఆప్టెడ్ సభ్యులు
C) ఎన్నుకోబడిన సభ్యులు
D) ఏదీకాదు
జవాబు:
B) కో ఆప్టెడ్ సభ్యులు

36. మున్సిపల్ కార్పోరేషన్ జనాభా.
A) 3 లక్షలు పైన
B) 3 లక్షల లోపు
C) 2 లక్షల పైన
D) 2 లక్షల లోపు
జవాబు:
B) 3 లక్షల లోపు

37. పురపాలక సంఘం విధించే పన్ను/లు.
A) నీటిపన్ను
B) దుకాణాలపై పన్ను
C) సినిమా టికెట్లపై పన్ను
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

38. క్రిందివానిలో ప్రజా సౌకర్యం.
A) వీధి దీపాలు
B) మురుగు నీటి డ్రైనేజి
C) ఉద్యానవనం
D) సినిమాహాలు
జవాబు:
D) సినిమాహాలు

II. ఖాళీలను పూరించుట

కింది ఖాళీలను పూరింపుము

1. ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ చట్టం 1994, గ్రామీణ ప్రాంతాల్లో ………. అంచెల స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేసింది.
2. 73, 74వ రాజ్యాంగ సవరణలు ………. సం||లో చేసారు.
3. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక స్వపరిపాలనను ………. సం||లో అమలుచేసారు.
4. స్థానిక స్వపరిపాలన అనేది ………. నాయకుని అభిప్రాయాలకు అనుగుణంగా రాజ్యాంగంలో చేర్చబడింది.
5. గ్రామసభకు ……….. అధ్యక్షత వహిస్తాడు.
6. సర్పంచ్ లేనపుడు ……………….. ఆ బాధ్యతలు నిర్వహిస్తాడు.
7. BLO…… ను విస్తరింపుము.
8. ప్రతి ……. మందికి ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేయబడింది.
9. MPTC ని విస్తరింపుము ………….
10. ZPTC ని విస్తరింపుము …………
11. NAC ని విస్తరింపుము ………..
12. మేయర్ ను ……… పద్ధతి ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారు.
13. భీమిలి పురపాలక సంఘంను ……. సం||లో స్థాపించారు.
14. 2011లో 150వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న పురపాలక సంఘం ………
15. గ్రామాన్ని ………. గా విభజిస్తారు.
16. మున్సిపల్ కార్పోరేషన్లో ఎన్నుకోబడిన సభ్యులను ……… అంటారు.
జవాబు:

  1. 3
  2. 1992
  3. 1959
  4. మహాత్మాగాంధీజీ
  5. సర్పంచ్
  6. ఉపసర్పంచ్
  7. బూత్ స్థాయి అధికారి
  8. 2000
  9. మండల పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గం
  10. జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గం
  11. నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్
  12. పరోక్ష
  13. 1861
  14. భీమిలి
  15. వార్డులు
  16. కార్పోరేటర్లు

III. జతపరుచుట

కింది వానిని జతపరుచుము.
1)

Group – AGroup – B
i) గ్రామ పంచాయితీa) కార్పోరేటర్లు
ii) మండల పరిషత్b) కౌన్సిలర్లు
iii) జిల్లా పరిషత్c) ZPTC లు
iv). పురపాలక సంఘంd) MPTC లు
v) మున్సిపల్ కార్పోరేషన్e) వార్డు సభ్యులు

జవాబు:

Group – AGroup – B
i) గ్రామ పంచాయితీe) వార్డు సభ్యులు
ii) మండల పరిషత్d) MPTC లు
iii) జిల్లా పరిషత్c) ZPTC లు
iv). పురపాలక సంఘంb) కౌన్సిలర్లు
v) మున్సిపల్ కార్పోరేషన్a) కార్పోరేటర్లు

2)

Group – AGroup – B
i) 1992a) రాజ్యాంగ సవరణలు
ii) 1994b) మూడు అంచెల స్థానిక స్వపరిపాలన
iii) 1959c) స్థానిక స్వపరిపాలన అమలు
iv) 1861d) మొదటి పురపాలక సంఘం ఏర్పాటు
v) 2019e) గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు

జవాబు:

Group – AGroup – B
i) 1992a) రాజ్యాంగ సవరణలు
ii) 1994b) మూడు అంచెల స్థానిక స్వపరిపాలన
iii) 1959c) స్థానిక స్వపరిపాలన అమలు
iv) 1861d) మొదటి పురపాలక సంఘం ఏర్పాటు
v) 2019e) గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు

3)

Group – AGroup – B
i) మేయర్a) మున్సిపల్ కార్పోరేషన్
ii) ఛైర్మన్b) పురపాలక సంఘం
iii) సర్పంచ్c) గ్రామ పంచాయితీ
iv) వార్డు మెంబర్d) వార్డులు

జవాబు:

Group – AGroup – B
i) మేయర్a) మున్సిపల్ కార్పోరేషన్
ii) ఛైర్మన్b) పురపాలక సంఘం
iii) సర్పంచ్c) గ్రామ పంచాయితీ
iv) వార్డు మెంబర్d) వార్డులు

Post a Comment

0 Comments