Ticker

6/recent/ticker-posts

6th Class Social Bits 1st Lesson సౌర కుటుంబంలో మన భూమి

I. బహుళైచ్ఛిక ప్రశ్నలు

1. సూర్యుడు, చంద్రుడు, రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులన్నింటినీ ఇలా అంటారు.
A) నక్షత్రాలు
B) ఉల్కలు
C) నక్షత్ర రాశులు
D) ఖగోళ వస్తువులు
జవాబు:
D) ఖగోళ వస్తువులు

2. సొంతంగా, వేడి, కాంతిని కలిగి ఉండే ఖగోళ వస్తువులు.
A) నక్షత్రం
B) గ్రహం
C) ఉల్క
D) పైవన్నీ
జవాబు:
A) నక్షత్రం

3. సొంతంగా వేడిని, కాంతిని కలిగి ఉండని ఖగోళ వస్తువులు.
A)గ్రహాలు
B) ఉపగ్రహాలు
C) ఉల్కలు, తోక చుక్కలు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

4. ఏడు నక్షత్రాల సమూహాన్ని ఇలా అంటారు.
A) ఉర్సామేజర్
B) బిగ్ బేర్
C) సప్తర్షి
D) ధృవ నక్షత్రం
జవాబు:
C) సప్తర్షి

5. ఉత్తర దిక్కులు స్థిరంగా ఉండే ఉత్తర నక్షత్రం
A) ధృవ నక్షత్రం
B) సప్తర్షి
C) ఉర్సామేజర్
D) బిగ్ బేర్
జవాబు:
A) ధృవ నక్షత్రం

6. భూమి ఎక్కడి నుండి వేడి, కాంతిని పొందుతుంది?
A) చంద్రుని నుండి
B) సూర్యుని నుండి
C) స్వతహాగా కల్గి ఉంది
D) తోక చుక్కల నుండి
జవాబు:
B) సూర్యుని నుండి

7. సౌర కుటుంబంలోని సభ్యుడు కానిది.
A) సూర్యుడు
B) ఎనిమిది గ్రహాలు, ఉపగ్రహాలు
C) ఉల్కలు, గ్రహశకలాలు
D) పాలపుంత
జవాబు:
D) పాలపుంత

8. సూర్యుని ఉపరితలంపై దాదాపు ఇన్ని డిగ్రీలసెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది.
A) 1,00,000°C
B) 6000°C
C) 16000°C
D) 26,000°C
జవాబు:
B) 6000°C

9. భూమి కంటె సూర్యుడు ఎన్ని రెట్లు పెద్ద
A) 13 లక్షలు
B)3 లక్షలు
C) 23 లక్షలు
D) 15 కోట్లు
జవాబు:
A) 13 లక్షలు

10. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే స్థిర మార్గాన్ని ఇలా పిలుస్తారు.
A) సౌర కుటుంబం
B) కక్ష్య
C) గెలాక్సీ
D) పరిభ్రమణం
జవాబు:
B) కక్ష్య

11. క్రింది వానిలో అంతర గ్రహం కానిది.
A) బుధుడు
B) శుక్రుడు
C) భూమిం
D) గురుడు
జవాబు:
D) గురుడు

12. క్రింది వానిలో బాహ్యగ్రహం కానిది.
A) శని
B) ఇంద్రుడు
C) అంగారకుడు
D)వరుణుడు
జవాబు:
C) అంగారకుడు

13. మనం నివసిస్తున్న భూమి సూర్యుని నుండి ఎన్నవది? పరిమాణంలో ఎన్నవది? వరుసగా
A) 5, 3
B) 3, 5
C) 3, 4
D) 4, 3
జవాబు:
B) 3, 5

14. జీవులు జీవించడానికి అత్యంత అనుకూలమైన
A) బుధుడు
B) భూమి
C) అంగారకుడు
D) చంద్రుడు
జవాబు:
B) భూమి

15. సూర్యుని కాంతి భూమిని చేరుకోవడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది?
A) 8 ని||లు
B) 18 ని||లు
C) 28 ని॥లు
D) 13 ని॥లు
జవాబు:
A) 8 ని||లు

16. వాతావరణంలో ఆక్సిజన్ శాతం
A) 78%
B) 21%
C) 11%
D) 12%
జవాబు:
B) 21%

17. ఉపగ్రహాలు లేని గ్రహాలు
A) బుధుడు, శుక్రుడు
B) బుధుడు, భూమి
C) శుక్రుడు, భూమి
D) బృహస్పతి, శని
జవాబు:
A) బుధుడు, శుక్రుడు

18. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి ఎన్ని రోజులు పడుతుంది?
A) 365 రోజులు
B) 24 గంటలు
C) 27 రోజులు
D) 14 రోజులు
జవాబు:
C) 27 రోజులు

19. చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి
A) రాకేష్ శర్మ
B) కల్పనా చావ్లా
C) నీల్ ఆర్మ్ స్ట్రాంగ్
D) యురిగగారిన్
జవాబు:
C) నీల్ ఆర్మ్ స్ట్రాంగ్

20. గ్రహశకలాలు ఈ రెండు గ్రహాల మధ్య ఉన్నాయి.
A) అంగారకుడు, బృహస్పతి
B) భూమి, అంగారకుడు
C) బృహస్పతి, శని
D) బుధుడు, శుక్రుడు
జవాబు:
A) అంగారకుడు, బృహస్పతి

21. హేలీ తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది?
A) 76 సంవత్సరాలు
B) 78 సంవత్సరాలు
C) 74 సంవత్సరాలు
D) 72 సంవత్సరాలు
జవాబు:
A) 76 సంవత్సరాలు

22. భారతదేశంలో అంతరిక్షంలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టు సంస్థ
A) ISRO
B) NASA
C) SHAR
D) పైవన్నీ
జవాబు:
A) ISRO

23. అత్యధికంగా ఉపగ్రహాలు కల్గి ఉన్న గ్రహం
A) ఇంద్రుడు
B) వరుణుడు
C) శని
D) బృహస్పతి
జవాబు:
D) బృహస్పతి

24. అత్యధిక పరిభ్రమణ కాలం కల్గిన గ్రహం
A) బుధుడు
B) ఇంద్రుడు
C) వరుణుడు
D) గురుడు
జవాబు:
C) వరుణుడు

25. అత్యల్ప భ్రమణ కాలం కల్గిన గ్రహం
A) భూమి
B) గురుడు
C) శని
D)వరుణుడు
జవాబు:
B) గురుడు

26. ఒకే భ్రమణ కాలం కల్గియున్న రెండు గ్రహాలు
A) భూమి, అంగారకుడు
B) అంగారకుడు, గురుడు
C) బుధుడు, శుక్రుడు
D) బుధుడు, భూమి
జవాబు:
A) భూమి, అంగారకుడు

II. ఖాళీలను పూరించుట కింది ఖాళీలను పూరింపుము.

1. మన సౌర కుటుంబంలో మొత్తం ……….. గ్రహాలు కలవు.
2. భూమికి కల ఏకైక సహజ ఉపగ్రహం …………
3. భూమి నుండి సూర్యుని దూరం సుమారు … కి.మీ.
4. గ్రహాలలో పెద్ద గ్రహం ………..
5. గ్రహాలలో చిన్న గ్రహం ………………
6. నీలిగ్రహం …………
7. వరుణ గ్రహం ………..
8. కాంతి సెకనుకు …. కి.మీ॥ వేగంతో ప్రయాణిస్తుంది.
9. భూమిచుట్టూ విస్తరించి ఉన్న గాలిపొరను ……..
10. భూమిపై, నీటిలో, గాలిలో గల అన్ని రకాల జీవులను కలిపి ………. ఆవరణం అంటారు. ,
11. చంద్రుని వ్యాపం, భూమి వ్యాసంలో………. వంతు మాత్రమే.
12. భూమి నుంచి చంద్రుడు దూరం, సుమారు ……… కి.మీ.
13. చంద్రునిపై మానవుడు అడుగిడిన రోజు ……
14. ISROని విస్తరింపుము ……………
15. SHARని విస్తరింపుము ……………
16. SDSC ని విస్తరింపుము ………………..
17. MOM ని విస్తరింపుము ……….. అంటారు.
18. హేలి తోకచుక్కను మనం ……….. సంవత్సరంలో చూడవచ్చు.
జవాబు:

  1. 8
  2. చంద్రుడు
  3. 15 కోట్లు
  4. బృహస్పతి
  5. బుధుడు
  6. భూమి
  7. అంగారకుడు
  8. 3,00,000
  9. వాతావరణం
  10. జీవా
  11. నాల్గవ
  12. 3,84,000
  13. జూలై 21, 1969
  14. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ
  15. శ్రీహరికోట హై అల్టిట్యుడ్ రేంజ్
  16. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్
  17. మార్స్ ఆర్బిటర్ మిషన్
  18. 2061

III. జతపరుచుట

కింది వానిని జతపరుచుము.

Group-AGroup-B
i) సూర్యుడుa) నీలిగ్రహం
ii) చంద్రుడుb) అంతర గ్రహాలు
ii) భూమిc) భూమి నుండి 3,84,000 కి.మీ.ల దూరం
iv) శని మరియు వరుణుడు (యురేనస్)d) భూమి నుండి 150 మిలియన్ కి.మీ.ల దూరం
v) బుధుడు మరియు శుక్రుడుe) బాహ్యగ్రహాలు

జవాబు:

Group-AGroup-B
i) సూర్యుడుd) భూమి నుండి 150 మిలియన్ కి.మీ.ల దూరం
ii) చంద్రుడుc) భూమి నుండి 3,84,000 కి.మీ.ల దూరం
iii) భూమిa) నీలిగ్రహం
iv) శని మరియు వరుణుడు (యురేనస్)e) బాహ్యగ్రహాలు
v) బుధుడు మరియు శుక్రుడుb) అంతర గ్రహాలు

Post a Comment

0 Comments