Ticker

6/recent/ticker-posts

6th Class Social Bits 8th Lesson రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

I. బహుళైచ్ఛిక ప్రశ్నలు

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

1. సువిశాలమైన రాజ్యాలను ఇలా అంటారు.
A) సామ్రాజ్యాలు
B) జనపదాలు
C) మహాజనపదాలు
D) రాజ్యాలు
జవాబు:
A) సామ్రాజ్యాలు

2. చంద్రగుప్త మౌర్యుని ప్రధానమంత్రి
A) కౌటిల్యుడు
B) చాణక్యుడు
C) విష్ణుగుప్తుడు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

3. కౌటిల్యుడు రచించిన గ్రంథం
A) అర్థశాస్త్రం
B) ఇండికా
C) మాళవికాగ్ని మిత్రము
D) చరక సంహిత
జవాబు:
A) అర్థశాస్త్రం

4. చంద్ర గుప్త మౌర్యుని కొలువులోని గ్రీకు రాయబారి .
A) కౌటిల్యుడు
B) మెగస్తనీస్
C) అరిస్టాటిల్
D) అలెగ్జాండర్
జవాబు:
B) మెగస్తనీస్

5. మెగస్తనీస్ రచించిన గ్రంథం
A) అర్థశాస్త్రం
B) ఇండికా
C) ఎక్స్ప్లోరేషన్
D) ఏదీకాదు
జవాబు:
B) ఇండికా

6. మౌర్యులలో ప్రసిద్ధిచెందిన పాలకుడు
A) బిందుసారుడు
B) చంద్రగుప్తుడు
C) సముద్రగుప్తుడు
D) అశోకుడు
జవాబు:
D) అశోకుడు

7. తీర రాష్ట్రమైన నేటి ఒడిషా పాత పేరు
A) అంగ
B) వంగ
C) కళింగ
D) చంప
జవాబు:
C) కళింగ

8. ప్రపంచ చరిత్రలో యుద్ధంలో విజయాన్ని పొంది, యుద్దాలకు స్వస్తి పలికిన ఒకే ఒక రాజు.
A) అలెగ్జాండర్
B) అశోకుడు
C) అక్బర్
D) నెపోలియన్
జవాబు:
B) అశోకుడు

9. ధమ్మ అనే ప్రాకృత పదానికి సంస్కృతంలో సమాన పదం
A) సత్యం
B) ధర్మం
C) శాంతి
D) ప్రేమ
జవాబు:
B) ధర్మం

10. శాతవాహన రాజులలో గొప్పవాడు.
A) యజ్ఞశ్రీ శాతకర్ణి
B) వాశిష్ఠ పుత్ర పులోమాని
C) గౌతమీ పుత్ర శాతకర్ణి
D) ఏదీకాదు
జవాబు:
C) గౌతమీ పుత్ర శాతకర్ణి

11. మనుషులకే కాక జంతువులకు కూడా వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసినవారు.
A) అశోకుడు
B) గౌతమీపుత్ర శాతకర్ణి
C) రెండవ పులకేశి
D) సముద్ర గుప్తుడు
జవాబు:
A) అశోకుడు

12. రామాయణంలోని రాముని వంశానికి చెందిన వారమని వీరు చెప్పుకున్నారు.
A) శాతవాహనులు
B) ఇక్ష్వాకులు
C) విష్ణుకుండినులు
D) చాళుక్యులు
జవాబు:
B) ఇక్ష్వాకులు

13. శాసనాల ద్వారా వర్తమానాన్ని (సందేశాన్ని) ప్రజలకు చేరవేసిన మొట్టమొదటిరాజు
A) కనిష్కుడు
B) సముద్రగుప్తుడు
C) రెండవ పులకేశి
D) అశోకుడు
జవాబు:
D) అశోకుడు

14. ఈ నంబరు రాతి శాసనంలో అశోకుడు కళింగ యుద్ధం గురించి ప్రస్తావించడం జరిగింది.
A) 11వ
B) 12వ
C) 13వ
D) 14వ
జవాబు:
C) 13వ

15. అశోకుని శాసనాలు ఎక్కువగా ఈ లిపిలో ఉన్నాయి.
A) ప్రాకృతి
B) క్యూనిఫారం
C) హీరోగ్లిఫిక్
D) పైవన్నీ
జవాబు:
A) ప్రాకృతి

16. భారతదేశ జాతీయ చిహ్నం నాలుగు సింహాల గుర్తు అశోకుని ఈ శిలా స్తంభంలోనిది.
A) సాంచీ
B) సారనాథ్
C) అమరావతి
D) అజంతా
జవాబు:
B) సారనాథ్

17. జాతీయ చిహ్నంలోని “సత్యం జయిస్తుంది” అనే వాక్యం ఈ ఉపనిషత్ లోనిది
A) మండూ కోపనిషత్
B) కఠోపనిషత్
C) ఈశావ్యాపనిషత్
D) పైవన్నీ
జవాబు:
A) మండూ కోపనిషత్

18. దక్షిణాదిలోని 12 మంది రాజులను ఓడించి తన అధీనంలోకి తెచ్చుకున్న గుప్త రాజు
A) చంద్రగుప్తుడు
B) అశోకుడు
C) సముద్రగుప్తుడు
D) రెండవ చంద్రగుప్తుడు
జవాబు:
C) సముద్రగుప్తుడు

19. ఈ గుప్తరాజు కొలువులో తొమ్మిది మంది గొప్ప పండితులైన “నవరత్నాలు” కలరు.
A) సముద్రగుప్తుడు
B) చంద్రగుప్తుడు
C) రెండవ చంద్రగుప్తుడు
D) అశోకుడు
జవాబు:
C) రెండవ చంద్రగుప్తుడు

20. నవరత్నా లలో ప్రసిద్ధ కవి.
A) కాళిదాసు
B) ఆచార్య నాగార్జునుడు
C) ధన్వంతరి
D) ఆర్యభట్ట
జవాబు:
A) కాళిదాసు

21. గుప్తుల కాలంలోని వాస్తు శిల్ప కళా నైపుణ్యానికి ప్రసిద్ధి చెందిన రాతిగుహలు
A) అజంతా
B) ఎల్లోరా
C) A & B
D) కార్లీ
జవాబు:
C) A & B

22. భారతదేశంలోని మొట్టమొదటి ఉపగ్రహం
A) వరాహమిహిర
B) ఆర్యభట్ట
C) బ్రహ్మగుప్త
D) నాగార్జున
జవాబు:
B) ఆర్యభట్ట

23. గాయపడిన ముక్కులకు ప్లాస్టిక్ సర్జరీ చేసిన మొట్టమొదటి భారతీయ శస్త్ర చికిత్స నిపుణుడు
A) చరకుడు
B) సుశ్రుతుడు
C) ధన్వంతరీ
D) నాగార్జునుడు
జవాబు:
B) సుశ్రుతుడు

24. భారతదేశ చరిత్రలో వీరి కాలాన్ని స్వర్ణయుగం అని చెబుతారు.
A) మౌర్యుల
B) గుప్తుల
C) శాతవాహనుల
D) పల్లవుల
జవాబు:
B) గుప్తుల

25. వీరి దండయాత్రల వలన భారతదేశంలో గుప్త సామ్రాజ్యం అంతరించింది.
A) హూణుల
B) గ్రీకుల
C) పల్లవుల
D) తురుష్కుల
జవాబు:
A) హూణుల

26. శాతవాహనుల రాజధాని నగరం :
A) బాదామి
B) ధాన్య కటకం
C)పాటలీపుత్రం
D) విజయపురి
జవాబు:
B) ధాన్య కటకం

27. ‘త్రిసముద్రదీశ్వర’ అనే బిరుదు కల్గిన రాజు
A) యజ్ఞశ్రీ శాతకర్రీ
B) గౌతమీ పుత్ర శాతకర్రీ
C) సముద్రగుప్తుడు
D) రెండవ పులకేశి
జవాబు:
B) గౌతమీ పుత్ర శాతకర్రీ

28. ఈ రాజుల కాలంలో ‘ఓద’ నాణెలు ప్రసిద్ది చెందినవి.
A) శాతవాహనులు
B) చాళుక్యులు
C) పల్లవులు
D) ఇక్ష్వాకులు
జవాబు:
A) శాతవాహనులు

29. ఆచార్య నాగార్జునుడు వీరి కాలంలో నివసించారు.
A) శాతవాహనులు
B) చాళుక్యులు
C) పల్లవులు
D) ఇక్ష్వాకులు
జవాబు:
A) శాతవాహనులు

30. ఇక్ష్వాకుల రాజధాని ఈ నది ఒడ్డున కలదు.
A) గోదావరి
B) నర్మదా
C) కృష్ణా
D) పెన్నా
జవాబు:
C) కృష్ణా

31. పల్లవుల రాజధాని నగరం
A) విజయపురి
B) బాదామి
C) ధాన్యాకటకం
D) కాంచీపురం
జవాబు:
D) కాంచీపురం

32. పంచ పాండవ రథాలు (ఏకశిలా రథాలు) ఇతని కాలంలో నిర్మించారు.
A) మొదటి మహేంద్ర వర్మ
B) మొదటి నరసింహ వర్మ
C) రెండవ నరసింహ వర్మ
D) రెండవ మహేంద్ర వర్మ
జవాబు:
B) మొదటి నరసింహ వర్మ

33. కాంచీపురంలోని ప్రసిద్ధ కైలాసనాథ దేవాలయం ఈ వాస్తు శిల్పకళారీతికి ఉదాహరణ.
A) మహేంద్రుని రీతి
B) మహామల్లుని కళారీతి
C) రాజసింహుని కళారీతి
D) ఏదీకాదు
జవాబు:
C) రాజసింహుని కళారీతి

34. చాళుక్య రాజులలో ప్రసిద్ధి చెందిన రాజు
A) మహేంద్ర వర్మ
B) రెండవ పులకేశి
C) సముద్రగుప్తుడు
D) గౌతమీ పుత్ర శాతకర్ణీ
జవాబు:
B) రెండవ పులకేశి

35. నర్మదా నది ఒడ్డున జరిగిన యుద్ధంలో హర్ష చక్రవర్తి, రెండవ పులకేశిని ఓడించాడు. ఈ విజయాన్ని ఈ శాసనంలో పేర్కొనబడింది.
A) 13వ స్తంభ శాసనం
B) ఐహోలు శాసనం
C) మ్యాకధోని శాసనం
D) సాంచీ స్తంభ శాసనం
జవాబు:
B) ఐహోలు శాసనం

36. చాళుక్యుల కాలంలో అభివృద్ధి చెందిన నూతన వాస్తు శిల్ప కళారీతి.
A) నగారా
B) ద్రవిడ
C) వేశారా
D) మహామల్ల రీతి
జవాబు:
C) వేశారా

37. ఈ పల్లవ రాజు రెండవ పులకేశి యుద్ధంలో ఓడించి కావేరి నదిని దాటి వెళ్ళాడు.
A) మొదటి మహేంద్ర వర్మ
B) మొదటి నరసింహ వర్మ
C) రెండవ మహేంద్ర వర్మ
D) రెండవ నరసింహ వర్మ
జవాబు:
A) మొదటి మహేంద్ర వర్మ

38. పట్టడగల్ లోని సంగమేశ్వర దేవాలయము ఈ నిర్మాణ శైలిలో ఉంది.
A) నగారా
B) ద్రవిడన్
C) వెశారా
D) రాజసింహరీతి
జవాబు:
B) ద్రవిడన్

39. ఐహోలు శాసనాన్ని తయారు చేసినవారు
A) రవికీర్తి
B) సుప్తి కీర్తి
C) చంద్రకీర్తి
D) మహా కీర్తి
జవాబు:
A) రవికీర్తి

40. చాళుక్యుల రాజధాని అయిన ‘బాదామి’ ప్రస్తుతం ఈ రాష్ట్రంలో కలదు.
A) తమిళనాడు
B) మహారాష్ట్ర
C) కేరళ
D) కర్ణాటక
జవాబు:
D) కర్ణాటక

41. శాతవాహనులు ఈ దేశంతో మంచి వ్యాపార సంబంధాలు కలవు.
A) గ్రీకు
B) రోమ్
C) పర్షియన్
D) చైనా
జవాబు:
B) రోమ్

42. మహాబలిపురంలోని ఏకశిలా నిర్మాణాలు వీరి కాలంలోనివి.
A) చాళుక్యులు
B) పల్లవులు
C) గుప్తులు
D) శాతవాహనులు
జవాబు:
B) పల్లవులు

43. ప్రసిద్ధి చెందిన నాగార్జున కొండ మరియు అమరావతి బౌద్ధ క్షేత్రాలు వీరి కాలం నాటివి.
A) చాళుక్యులు
B) పల్లవులు
C) గుప్తులు
D) శాతవాహనులు
జవాబు:
D) శాతవాహనులు

44. క్రింది చిత్రంలో బౌద్ధ స్థూపం ఈ నగరంలోనిది.

A) విజయపురి
B) అమరావతి
C) భట్టిప్రోలు
D) పట్టడగల్
జవాబు:
A) విజయపురి

II. ఖాళీలను పూరించుట

కింది ఖాళీలను పూరింపుము.

1. షోడశ మహా జనపదాలలో ……… శక్తివంతమైన రాజ్యాంగ ఆవిర్భవించింది.
2. మెగస్తనీస్ ఒక ……… రాయబారి.
3. మౌర్యులు ………. అనే నగరం నుండి పరిపాలన చేశారు.
4. …………. తర్వాత మగధ రాజ్యా నికి అశోకుడు రాజైనాడు.
5. కళింగ రాజ్యం భారతదేశానికి …….. తీరంలో గల రాజ్యం.
6. అశోకుడు అహింసను ప్రబోధించే …….. మతం పట్ల ఆకర్షితుడయ్యా డు.
7. భారత జాతీయ చిహ్నంను ……. తేదీని అధికారికంగా గుర్తించారు.
8. అపజయమే ఎరుగని గుప్తరాజు ……….
9. …… శాస్త్రవేత్తలు ‘సున్న’ భావనను అభివృద్ధి చేశారు.
10. గుప్తుల కాలంలోని ఆల్గారిథమ్స్ ను నేడు …… ప్రోగ్రామ్స్ లో ఉపయోగిస్తున్నారు.
11. పౌర సంవత్సరాన్ని దాదాపు ఖచ్చితంగా లెక్కించ గల్గిన (గుప్త) ఖగోళ శాస్త్రవేత్త ………….
12. ఆర్యభట్ట ఉపగ్రహంను ……… సం||లో అంతరిక్షంలో ప్రయోగించారు.
13. ………. కాలంలోని వైద్యులు విరిగిపోయిన ఎముకలను సరిచేసి ఆపరేషన్లు కూడా చేసేవారు.
14. వ్యాధి కంటే ………. కి గల మూల కారణాన్ని నిర్మూలించాలని వైద్యులు భావించరు.
15. భూమికి సూర్యునికీ మధ్య ……….. అడ్డు వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయని భావించారు.
16. శాతవాహనులు దాదాపు …………… సం||రాలు పరిపాలించారు.
17. పల్లవులు క్రీ.శ. ………. నుండి ………. సం||రాల మధ్య దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారు.
18. ….. నగరంలో అయిదు రాతిరథాలు నిర్మించారు.
19. పాపనాథ ఆలయం ……. నిర్మాణ శైలిలో ఉన్నది.
20. చాళుక్య రాజుల పరిపాలనా కాలం ………
జవాబు:

  1. మగధ
  2. గ్రీకు
  3. పాటలీపుత్ర
  4. బిందుసారుని
  5. తూర్పు
  6. బౌద్ధ
  7. 1950, జనవరి 26
  8. సముద్రగుప్తుడు
  9. భారతీయ
  10. కంప్యూటర్
  11. బ్రహ్మగుప్తుడు
  12. 1975
  13. గుప్తుల
  14. వ్యాధి
  15. చంద్రుడు
  16. 300
  17. 300, 900
  18. మహాబలిపురం
  19. నగారా
  20. క్రీ.శ. 600-1200

III. జతపరుచుట

కింది వానిని జతపరుచుము.
1.

Group-AGroup – B
i) మౌర్యులుa) విజయపురి
ii) శాతవాహనులుb) బాదామి
iii) పల్లవులుc) కాంచీపురం
iv) చాళుక్యులుd) ధాన్యకటకం
v) ఇక్ష్వాకులుe) పాటలీపుత్ర

జవాబు:

Group-AGroup – B
i) మౌర్యులుe) పాటలీపుత్ర
ii) శాతవాహనులుd) ధాన్యకటకం
iii) పల్లవులుc) కాంచీపురం
iv) చాళుక్యులుb) బాదామి
v) ఇక్ష్వాకులుa) విజయపురి

2.

Group-AGroup- B
i) ధన్వంతరిa) ఆయుర్వేద వైద్యము
ii) క్షేపకుడుb) జ్యోతిష్య శాస్త్రవేత్త
iii) వరహమిహురుడుc) ఖగోళ శాస్త్రవేత్త
iv) కాళిదాసుd) సంస్కృత కవి
v) సుశ్రుతుడుe) శస్త్ర చికిత్స నిపుణుడు

జవాబు:

Group-AGroup- B
i) ధన్వంతరిa) ఆయుర్వేద వైద్యము
ii) క్షేపకుడుb) జ్యోతిష్య శాస్త్రవేత్త
iii) వరహమిహురుడుc) ఖగోళ శాస్త్రవేత్త
iv) కాళిదాసుd) సంస్కృత కవి
v) సుశ్రుతుడుe) శస్త్ర చికిత్స నిపుణుడు

జవాబు:
i) – c, ii) – a, iii) – b, iv) – d

Post a Comment

0 Comments