I. బహుళైచ్ఛిక ప్రశ్నలు
కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.
1. చట్టాలను అమలుపరిచే ప్రభుత్వ శాఖ.
A) శాసన నిర్మాణ శాఖ
B) కార్యనిర్వాహక శాఖ
C) న్యాయశాఖ
D) పార్లమెంట్
జవాబు:
B) కార్యనిర్వాహక శాఖ
2. ఈ విధమైన ప్రభుత్వంలో పాలకులు వంశ పారంపర్యంగా వస్తారు.
A) ప్రత్యక్ష ప్రజాస్వామ్యం
B) పరోక్ష ప్రజాస్వామ్యం
C) రాచరికం
D) పైవన్నీ
జవాబు:
C) రాచరికం
3. కిందివానిలో రాచరిక (ప్రభుత్వం) అమలులో ఉంది.
A) భారత్
B) అమెరికా
C) యునైటెడ్ కింగ్డమ్
D) కెనడా
జవాబు:
C) యునైటెడ్ కింగ్డమ్
4. క్రిందివానిలో అధ్యక్ష తరహా ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉంది.
A) భారత్
B) అమెరికా
C) బ్రిటన్
D) కెనడా
జవాబు:
B) అమెరికా
5. ఈ ప్రభుత్వంలో ఓటర్లు తమ ప్రతినిధులను ఎన్నికలు ప్రక్రియ ద్వారా ఎన్నుకుంటారు.
A) ప్రత్యక్ష ప్రజాస్వామ్యం
B) పరోక్ష ప్రజాస్వామ్యం
C) రాచరికం
D) పైవన్నీ
జవాబు:
B) పరోక్ష ప్రజాస్వామ్యం
6. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అమలులో ఉన్న దేశం
A) భారత్
B) అమెరికా
C) బ్రిటన్
D) స్విట్జర్లాండ్
జవాబు:
D) స్విట్జర్లాండ్
7. భారత రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ ప్రకారం వయోజన ఓటు హక్కు లభిస్తుంది.
A) 236
B) 326
C) 623
D) 263
జవాబు:
B) 326
8. ఒక దేశం యొక్క చట్టాలు మరియు మౌలిక సూత్రాలను కలిగి ఉన్న పత్రం.
A) ప్రభుత్వం
B) పార్లమెంట్
C) రాజ్యాంగం
D) శాసనము
జవాబు:
C) రాజ్యాంగం
9. వయోజనులు అంటే………. సం||రాలు నిండినవారు.
A) 18
B) 17
C) 19
D) 21
జవాబు:
A) 18
10. ఎన్నికైన ప్రతినిధులు సమావేశాల ద్వారా ……….. పక్షాన నిర్ణయాలు తీసుకుంటారు.
A) ప్రభుత్వ
B) ప్రజల
C) నాయకుల
D) రాజుల
జవాబు:
B) ప్రజల
11. ఒక్క ఓటు ఎక్కువ రావడాన్ని ………. మెజారిటీ అంటారు.
A) అధిక
B) అత్యధిక
C) సాధారణ
D) సమాన
జవాబు:
C) సాధారణ
12. ఎన్నికైన ప్రతినిధులు సాధారణంగా ………. సం||రాలు ప్రతినిధిగా ఉంటారు.
A) 6
B) 4
C) 3
D) 5
జవాబు:
D) 5
13. రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా పోయినపుడు ………. రాజ్యాంగం ప్రకారం ప్రతినిధులను అనర్హులుగా ప్రకటించే అవకాశముంది.
A) న్యాయస్థానాలు
B) ప్రజలు
C) ఓటర్లు
D) ప్రభుత్వం
జవాబు:
A) న్యాయస్థానాలు
14. ఓటు వేసేటప్పుడు ……….. ప్రలోభాలకు లోను కాకుండా ఓటు వేయాలి.
A) భయంగా
B) నిర్భయంగా
C) నిర్లక్ష్యంగా
D) ఆలోచించకుండా
జవాబు:
B) నిర్భయంగా
15. కులం, మతం కూడా ………… సమయంలో ప్రజలమీద ఎక్కువ ప్రభావం చూపుతుంది.
A) సమావేశాల
B) యుద్ధ
C) ఎన్నికల
D) ప్రమాణస్వీకార
జవాబు:
C) ఎన్నికల
16. ………. అంటే మనం ఉన్న ప్రాంతంలో మనకోసం పనిచేసేది.
A) రాష్ట్రం
B) కేంద్రం
C) అంతర్జాతీయం
D) స్థానికంగా
జవాబు:
D) స్థానికంగా
17. ప్రజల అవసరాలను తీరుసూ. ప్రజలనూ రకసూ, ప్రజా వివాదాలను పరిష్కరించేది
A) ప్రభుత్వం
B) సామాజిక భద్రత
C) పెట్టుబడిదారులు
D) ప్రయివేటు వ్యక్తులు
జవాబు:
A) ప్రభుత్వం
18. ఈ సమాజంలో అందరూ ఆమోదించే విధంగా ఒక సామాన్య పరిష్కారంగానీ, ప్రవర్తనా నియమావళి గానీ రూపొందించడం సాధ్యం కాదు
A) ఒక తెగ ప్రజలు నివసించేది
B) ఒకే మతం ప్రజలు నివసించేది
C) ఒకే కులం ప్రజలు నివసించేది
D) అనేక కులాలు, మతాలు, తెగలు కలిసి బహు ముఖంగా నివసించేది
జవాబు:
D) అనేక కులాలు, మతాలు, తెగలు కలిసి బహు ముఖంగా నివసించేది
19. రాజరికంలో వీరు అనుకున్నదే చట్టం, వారు చెప్పిందే న్యాయం.
A) చక్రవర్తులు
B) రాజులు
C) రాణులు
D) పై వారందరూ
జవాబు:
D) పై వారందరూ
20. ప్రాచీన కాలంలో ఎక్కువ మంది రాజులు రాజ్యపరిపాలన కంటే దీనికే ఎక్కువ సమయాన్ని వెచ్చించేవారు.
A) రాజ్య విస్తరణ
B) న్యాయ విచారణ
C) కవులకు
D) కళాకారులకు
జవాబు:
A) రాజ్య విస్తరణ
21. రాజు లేక రాణి కొన్ని సమయాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరులను సంప్రదించినప్పటికీ తుది నిర్ణయం వీరిదే.
A) ప్రజలది
B) రాజు లేక రాణిది
C) మంత్రులది
D) న్యాయస్థానాలది.
జవాబు:
B) రాజు లేక రాణిది
22. విభిన్న ప్రజల విభిన్న అభిప్రాయాలను ఇముడ్చుకుంటూ సమాజంలో అన్యాయం, అణచివేతకు పాల్పడే శక్తులను నియంత్రించగలిగే ప్రభుత్వమే
A) ప్రజాస్వామ్యం
B) రాజరికం
C) గణతంత్రం
D) కులీన పాలన
జవాబు:
A) ప్రజాస్వామ్యం
23. “ప్రజల యొక్క ప్రజల చేత, ప్రజల కోసం నడిచే ప్రభుత్వం” ప్రజాస్వామ్యం అన్నది
A) జార్జి వాషింగ్టన్
B) అబ్రహాం లింకన్
C) థామస్ హాబ్స్
D) బెంథామ్
జవాబు:
B) అబ్రహాం లింకన్
24. ప్రస్తుత రోజుల్లో అమలులో ఉన్న ప్రజాస్వామ్యం
A) ప్రత్యక్ష ప్రజాస్వామ్యం
B) పరోక్ష ప్రజాస్వామ్యం
C) ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం
D) B, C లు
జవాబు:
D) B, C లు
25. వయోజనులు అనగా
A) 15 సం||రాలు నిండినవారు
B) 18 సం||రాలు నిండినవారు
C) 21 సం||రాలు నిండినవారు
D) 25 సం||రాలు నిండినవారు
జవాబు:
B) 18 సం||రాలు నిండినవారు
26. ఎన్నికల ముందు వివిధ అభ్యర్థులు లేదా పార్టీలు తాము ఎన్నికైతే చేపట్టబోయే కార్యక్రమాల జాబితాను ఓటర్ల ముందు ఉంచగా, ఆ జాబితాను ఈ విధంగా పిలుస్తారు.
A) మానిఫెస్టో
B) మాక్ లిస్ట్
C) ఓటర్ల జాబితా
D) చిత్తు ప్రతి
జవాబు:
A) మానిఫెస్టో
27. ప్రజా ప్రతినిధులు ఎంత కాలం ప్రతినిధిగా ఉంటారు?
A) నిర్ణీత కాలం
B) ఎంత కాలమైనా
C) పరిధి లేదు
D) ఏదీకాదు
జవాబు:
A) నిర్ణీత కాలం
28. భారతదేశంలో ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి?
A) 2
B) 3
C) 4
D) 5
జవాబు:
D) 5
29. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ప్రతినిధులకు ఉండవలసిన మెజారిటీ
A) నిర్ణీత మెజారిటీ
B) సాధారణ మెజారిటీ
C) నిర్దేశింపబడిన మెజారిటీ
D) పైవన్నీ
జవాబు:
B) సాధారణ మెజారిటీ
30. ఒక గ్రామ పంచాయతిలో 20 మంది వార్డు సభ్యులు ఉంటే మెజారిటీ సాధించటానికి కావాల్సిన సభ్యుల సంఖ్య
A) 9
B) 10
C) 11
D) 12
జవాబు:
C) 11
31. ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల మీద నియంత్రణ చేయడానికి ఉన్నది
A) రాజ్యాంగ చట్టంలో కొన్ని నిబంధనలను పొందుపరచుట
B) వారసత్వ చట్టాన్ని అమలుచేయుట
C) ఏ విధమైన నిబంధనలు లేవు
D) వారు ‘చట్టానికి అతీతులు
జవాబు:
A) రాజ్యాంగ చట్టంలో కొన్ని నిబంధనలను పొందుపరచుట
32. ప్రజాస్వామ్యంలో ప్రజలు చేయవలసినది
A) ప్రజలు, అధికారులు ప్రతి ఒక్కరూ కొంచెం సమయం వెచ్చించి ప్రజావసరాలను అర్థం చేసుకోవాలి
B) ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిపట్ల వాళ్లకి అవగాహన ఉండాలి
C) ఓటు వేసేటప్పుడు నిర్భయంగా, ప్రలోభాలకు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
33. కొన్ని సందర్భాలలో ప్రజల మీద ఎక్కువ ప్రభావం చూపుతున్న అంశాలు
A) కులం
B) మతం
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
C) పై రెండూ
34. ప్రభుత్వం మనదేశంలో ఎన్ని స్థాయిలలో పనిచేస్తుంది?
A) 2
B) 3
C) 4
D) 5
జవాబు:
B) 3
35. మనం ఉన్న ప్రాంతంలో మనకోసం పనిచేసేది
A) కేంద్ర ప్రభుత్వం
B) రాష్ట్ర ప్రభుత్వం
C) స్థానిక ప్రభుత్వం
D) ఏదీకాదు
జవాబు:
C) స్థానిక ప్రభుత్వం
36. రాష్ట్రానికి మొతంగా పనిచేసేది
A) కేంద్రం ప్రభుత్వం
B) రాష్ట్ర ప్రభుత్వం
C) స్థానిక ప్రభుత్వం
D) ఏదీకాదు
జవాబు:
B) రాష్ట్ర ప్రభుత్వం
37. జాతీయ స్థాయిలో ఉన్న ప్రభుత్వం, దేశం మొత్తానికి బాధ్యత వహించేది
A) కేంద్ర ప్రభుత్వం
B) రాష్ట్ర ప్రభుత్వం
C) స్థానిక ప్రభుత్వం
D) పైవన్నీ
జవాబు:
A) కేంద్ర ప్రభుత్వం
II. ఖాళీలను పూరించుట
కింది ఖాళీలను పూరింపుము
1. ఒక దేశాన్ని లేదా రాష్ట్రాన్ని నియంత్రిస్తూ, వాటి కొరకు నిర్ణయాలను తీసుకునే ప్రజల సమూహాన్ని …….. అంటారు.
2. చట్టాలను వ్యాఖ్యానించే ప్రభుత్వ శాఖ ………….
3. చట్టాలను చేసే ప్రభుత్వ శాఖ …………
4. భారతదేశంలో శాసననిర్మాణ శాఖ ……………
5. భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం ………….
6. ప్రజలచే నడుపుతున్న ప్రభుత్వం …………..
7. ………… ప్రజాస్వామ్యంలో ప్రజలు నేరుగా నిర్ణయం తీసుకోవడంలో పాల్గొంటారు.
8. ప్రాతినిధ్య సూత్రంతోపాటు, ప్రజాస్వామ్యంలో ప్రధాన సూత్రాలలో ……… పాలన ఒకటి.
9. రాష్ట్ర స్థాయిలో పనిచేసే ప్రభుత్వం ……….
10. ……… వ్యవస్థలో శాసన నిర్మాణశాఖ నుండి కార్యనిర్వాహక శాఖ ఏర్పడుతుంది.
జవాబు:
- ప్రభుత్వం
- న్యాయశాఖ
- శాసన నిర్మాణ శాఖ
- పార్లమెంట్
- సుప్రీంకోర్టు
- ప్రజాస్వామ్యం
- ప్రత్యక్ష
- మెజారిటీ
- రాష్ట్ర ప్రభుత్వం
- పార్లమెంటరీ
III. జతపరుచుట
కింది వానిని జతపరుచుము.
1.
Group – A | Group – B |
i) ప్రత్యక్ష ప్రజాస్వామ్యం | a) స్విట్జర్లాండ్ |
ii) అధ్యక్ష తరహా ప్రభుత్వం | b) అమెరికా |
iii) పార్లమెంటరీ ప్రభుత్వం | c) భారత్ |
iv) రాచరిక ప్రభుత్వం | d) బ్రూనై |
v) ప్రజాస్వామ్య జన్మ స్థలం | e) గ్రీసు |
జవాబు:
Group – A | Group – B |
i) ప్రత్యక్ష ప్రజాస్వామ్యం | a) స్విట్జర్లాండ్ |
ii) అధ్యక్ష తరహా ప్రభుత్వం | b) అమెరికా |
iii) పార్లమెంటరీ ప్రభుత్వం | c) భారత్ |
iv) రాచరిక ప్రభుత్వం | d) బ్రూనై |
v) ప్రజాస్వామ్య జన్మ స్థలం | e) గ్రీసు |
0 Comments