Ticker

6/recent/ticker-posts

AP DSC Best Notes Class 8 Social | History Lesson 1 to 4 | DSC Final touch

 8వ తరగతి – సోషల్ – చరిత్ర

AP DSC Best Notes Class 8 Social | History Lesson 1 to 4 | DSC Final touch


1. ఎలా, ఎప్పుడు – ఎక్కడ

గత పరిస్థితులు తెలుసుకోవడం చరిత్ర

1782 – జేమ్స్ రెన్నల్ : మొదటి పటపు ముఖ చిత్రం

మొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ (1773), చివరి వైశ్రాయ్ మౌంట్ బాటన్ 

1922 – మొదటి టీ ప్రకటన – లిప్టన్

విక్టోరియా మహారాణి 3వ కుమారుడు బిరుదు – డ్యూక్ ఆఫ్ కాటన్

బ్రిటిష్ ఇండియా చరిత్ర (3 సంపుటాల పుస్తకం) రచించింది – జేమ్స్ మిల్ స్కాటిష్ ఆర్ధిక వేత్త - 1817లో

చరిత్రను హిందూ, ముస్లిం, బ్రిటిష్ యుగాలుగా విభజన

బ్రిటిష్ పాలన భారత్ ని నాగరికం చేయగలదని మిల్ భావన

మిల్ ప్రకారం బ్రిటిష్ పాలన నాగరికత, ప్రగతికి చిహ్నం

విజ్ఞాన శాస్త్రం, హేతువాదం, ప్రజాసౌమ్యం, స్వేచ్చ, సమానత్వం లతో కూడినది ఆధునిక యుగం అని పశ్చిమ దేశాల భావన

మధ్య యుగం ఆధునిక లక్షణాలు లేని సమాజం

ఒక దేశం మరో దేశాన్ని ఆక్రమించుట ద్వారా ఆ దేశంలో రాజకీయ, ఆర్ధిక, సాంఘిక, సాంస్కృతిక మార్పులు వస్తాయి. దీనిని వలసవాదం అంటారు

చరిత్ర రచనకి ముఖ్య ఆధారం – బ్రిటిష్ అధికారిక రికార్డులు 

జాతీయ అభిలేఖాగారం – 1921 లో ఏర్పాటు

 

2. వాణిజ్య స్థావరాల నుండి సామ్రాజ్య స్థాపన వరకు కంపెనీ అధికార స్థాపన

శక్తివంతమైన మొఘల్ పాలకులలో ఔరంగజేబు చివరివాడు. 1707 లో అతను మరణించాడు

తర్వాత సుబేదార్లు, పెద్ద పెద్ద జమీందార్లు అధికారం దృడపర్చుకోవడానికి ప్రాంతీయ రాజ్యాలు ఏర్పాటు చేయడం ప్రారంభించారు

18వ శతాబ్ద చివర రాజకీయ తెరపై ఆవిర్భవించిన అతి శక్తివంతమైన నూతన అధికార వ్యవస్థ ఆంగ్లేయులు

 

1857 ప్రజా తిరుగుబాటు జరిగినప్పుడు మొఘల్ పాలకుడు బహదూర్ షా జాఫర్

బహదూర్ షా జాఫర్ మరియు అతని కుమారులు కెప్టెన్ హడ్సన్ చే నిర్భందించబడ్డారు

వాణిజ్యం – ఒక వర్తక సంస్థ ప్రధానంగా వస్తువులు తక్కువ ధరకి కొని ఎక్కువకి అమ్మడం ద్వారా లాభం పొందడం

 

1600 సంవత్సరంలో తూర్పు దేశాలతో వర్తకం చేయడానికి పూర్తి హక్కు తమకి మంజూరు చేసినట్లు ఇంగ్లాండ్ పరిపాలకురాలు క్వీన్ ఎలిజబెత్ – 1 నుండి ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక పట్టా (ఛార్టర్) పొందింది. దీని అర్ధం మరే ఇతర సంస్థ ఈస్ట్ ఇండియా కంపెనీకి పోటీ పడకూడదు

ఆంగ్లేయుల ఓడలు ఆఫ్రికా పశ్చిమ తీరంలోని గుడ్ హోప్ అగ్రం చుట్టి హిందూమహా సముద్రం దాటి వచ్చే సమయానికి భారత పశ్చిమ తీరంలో పోర్చుగీస్ వారు గోవా కేంద్రంగా వారి ఉనికి చాటుకున్నారు 

భారత్ కి సముద్ర మార్గం కనుగొన్నది – పోర్చుగీస్ నావికుడు వాస్కోడ గామా 1498 లో

భారతదేశంలో తయారయ్యే మేలురకమైన పట్టు, నూలు కి యూరప్ లో మంచి గిరాకీ ఉండేది

మార్కెట్లు కైవసం చేసుకోవాలనే బలమైన కోరిక వర్తక స్థావరాల మధ్య తీవ్ర యుద్ధాలకి దారి తీసింది

ఆంగ్లేయుల మొదటి కర్మాగారం – 1651 హుగ్లీ నది ఒడ్డున స్థాపించబడినది. ఫాక్టర్స్ గా పిలవబడే కంపెనీ వర్తకులకు అది స్థావరంగా ఉండేది

1696 నాటికి నివాస ప్రాంతం చుట్టూ కోట కట్టడం ప్రారంభించారు

మొఘల్ అధికారులకి లంచం ఇచ్చి మూడు గ్రామాలపై జమిందారీ హక్కు పొందింది. అందులో ఒకటి ఇప్పుడు కోల్ కతా గా పిలవబడుతున్న కాలికట్

ఔరంగజేబు సుంకం లేకుండా వ్యాపారం చేసుకునే హక్కుని ధారాధత్తం చేస్తున్నట్లు ఒక ఫర్మానా ఇచ్చేలా ఒప్పించింది

ఫర్మానా – ఒక రాజ శాసనం, రాజాజ్ఞ

18వ శతాబ్ద ఆరంభంలో బెంగాల్ నవాబు, కంపెనీ కి మధ్య వివాదం తీవ్రం అయింది

ముర్షిద్ అలీ ఖాన్ తర్వాత ఆలివర్ధి ఖాన్, తర్వాత సిరాజుద్దౌలా బెంగాల్ నవాబు అయ్యారు

1756 అలీవర్ధి ఖాన్ మరణాంతరం సిరాజుద్దౌలా బెంగాల్ నవాబు అయ్యాడు

30,000 మంది సైనికులతో కాసిం బజార్ లో ఆంగ్లేయుల ఫ్యాక్టరీ మీద దాడి చేసి వారిని నిర్భందించాడు 

1757 లో రాబర్ట్ క్లైవ్ కంపెనీ సైన్యాన్ని సిరాజుద్దౌలా కి వ్యతిరేకంగా ప్లాసీ వైపు నడిపాడు

ప్లాసీ అనే పేరు పలాషి అనే పదానికి ఆంగ్లీకరించబడిన ఉచ్చారణ. హోలీ పండగలో ఉపయోగించే గులాల్ పొడి ఇచ్చే అందమైన ఎరుపు పువ్వులు పూసే పలాస చెట్టు నుండి వచ్చింది

ఈస్ట్ ఇండియా కంపెనీ యాజమానుల సమావేశాలు ఈస్ట్ ఇండియా హౌస్, లీడేన్ హాల్ వీధి, లండన్ లో జరిగేవి

సిరాజుద్దౌలా సైన్యాధిపతి మీర్ జాఫర్ యుద్ధంలో పాలుపంచుకోవడం నవాబు ఓటమికి ఒక కారణం

ఈస్ట్ ఇండియా కంపెనీ భారత్ లో సాధించిన మొదటి ఘన విజయం ప్లాసీ యుద్ధం

ప్లాసీ యుద్ధం తర్వాత రాబర్ట్ క్లైవ్ 1759 జనవరి 7 న విలియం పిట్ కి లేఖ రాశారు

మీర్ జాఫర్ ఎదురు తిరిగినప్పుడు కంపెనీ అతన్ని తొలగించి మీర్ ఖాసిం ని నవాబుని చేసింది. మీర్ ఖాసిం ఫిర్యాదు చేసినపుడు బక్సార్ యుద్ధం (1764) లో అతన్ని ఓడించి మరలా మీర్ జాఫర్ ని నవాబుని చేసింది

మీర్ జాఫర్ 1765 లో మరణించాడు

ఈ కీలుబొమ్మ నవాబులతో పని చేసి వైఫల్యం చెందే కంటే మనంతట మనమే నవాబులు అవ్వాలి అని క్లైవ్ ప్రకటించాడు

1765 లో మొఘల్ చక్రవర్తి కంపెనీని బెంగాల్ ఫ్రా విన్స్ ల దివాన్ గా నియమించాడు. బెంగాల్ ఆదాయ వనరులు వాడడానికి ఈ దివానీ కంపెనీకి అధికారం ఇచ్చింది

 

1743 ఇంగ్లాండ్ నుండి మద్రాస్ వచ్చే నాటికి క్లైవ్ వయసు 18 సంవత్సరాలు

1767 లో దేశం విడిచిపెట్టే నాటికి సంపద విలువ 401,102 పౌండ్లు

1764 లో బెంగాల్ గవర్నర్ గా నియామకం

1772 లో అపరిమిత సంపద కలిగి ఉన్నాడని పార్లమెంటు చేత ప్రతి విచారణ ఎదుర్కొన్నాడు

1774 లో ఆత్మహత్య

 

భారత్ నుండి సంపదతో వెనుదిరిగిన వారు ఆడంబరమైన జీవితం గడిపేవారు. వాళ్ళని నాబాబ్స్ అని పిలిచేవారు

1764 బక్సార్ యుద్ధం తర్వాత కంపెనీ భారతీయ రాజ్యాల్లో రాజ ప్రతినిధులని నియమించింది. వారు కంపెనీకి రాజకీయ, ఆర్ధిక గుత్తేదారులుగా ఉండేవారు

1801 లో రిచర్డ్ వెల్లస్లీ గవర్నర్ జనరల్ గా ఉన్నప్పుడు అవద్ నవాబు సహకార సైన్యం కోసం చెల్లింపు చేయనందున అతని భూభాగంలో సగం ఇవ్వాలని ఒత్తిడి చేసింది

రెసిడెంట్ – దేశానికి ఇతనే నిజమైన రాజు. విధేయత చూపినంతవరకు అన్నీ సవ్యంగా ఉంటాయి – జేమ్స్ మిల్ రెసిడెంట్ ల గురించి చెప్పినది

 

మైసూర్ పాలకులు హైదర్ ఆలీ (1761 – 1782), టిప్పు సుల్తాన్ (1782 – 1799)

మలబార్ తీరంలో కంపెనీ మిరియాలు, ఏలకులు కొనుగోలు చేసేది

1785 లో టిప్పు సుల్తాన్ అతని రాజ్యంలో ఓడరేవుల ద్వారా చందనం, మిరియాలు, ఏలకులు ఎగుమతి నిలిపేసి స్థానిక వ్యాపారులను కంపెనీతో వ్యాపారానికి అనుమతించలేదు

టిప్పు సుల్తాన్ ఫ్రెంచ్ వారితో సత్సంబంధాలు ఉండేవి

మైసూర్ తో బ్రిటిష్ వారికి నాలుగు యుద్ధాలు జరిగాయి – 1767 – 69, 1780 – 84, 1790 – 92, 1799 

చివరి యుద్ధం శ్రీరంగ పట్నం యుద్ధంలో టిప్పు 1799 మే 4 న మరణించాడు

తర్వాత మైసూర్ పూర్వ పాలకులు అయిన వడయార్ ల కింద ఉంచబడింది

 

మరాఠీలతో యుద్ధం

1761 మూడవ పానిపట్ యుద్దంలో మరాఠీల ఓటమి

అనేక రాష్ట్రాలుగా విభజించి సింధియా,హోల్కర్, గైక్వాడ్, భోంస్లే వంటి రాజవంశాలకి చెందిన నాయకుల కింద ఉంచారు

వీరంతా పూణే కేంద్రంగా పని చేసే సమర్ధ సైన్యం గల పీష్వా (ప్రధానమంత్రి) ఆధ్వర్యంలో ఉండేవారు

మహాదీజీ సింధియా, నానా ఫడ్నావిస్ అనేవారు రాజనీతీ కలవారు గా ప్రసిద్ధి చెందారు

మొదటి ఆంగ్లో మరాఠీ యుద్ధం – 1782 సాల్బే ఒప్పందంతో ముగింపు – స్పష్టమైన విజేత లేరు

రెండో ఆంగ్లో మరాఠీ యుద్ధం – 1803 -05 – ఒరిస్సా, ఆగ్రా, యమునా నదికి ఉత్తరాన గల భూభాగాలు, ఢిల్లీ లభించాయి

మూడవ ఆంగ్లో మరాఠీ యుద్ధం – 1817 – 19 – పీష్వాని తొలగించి సమీపంలో బీరుర్ కి భరణం ఇచ్చి పంపారు

 

లార్డ్ హేస్టింగ్స్ (1813 – 23 బెంగాల్ గవర్నర్ జనరల్) ఆధ్వర్యంలో అత్యున్నత హోదా అనే కొత్త విధానం మొదలు అయింది

కిత్తుర్ అనే చిన్న రాష్ట్రం (ప్రస్తుత కర్ణాటక) స్వాధీనం చేసుకోవాలనుకున్నప్పుడు అక్కడ రాణి చెన్నమ్మ ఉద్యమించింది. ఆమెను 1824 లో అరెస్ట్ చేశారు. 1829 లో జైలులో మరణించింది. తర్వాత కిత్తుర్ లో సంగోళికి చెందిన రాయన్న పేద చౌకీదార్ ఉద్యమం కొనసాగించాడు. ఇతన్ని 1830 లో బ్రిటిష్ వారు ఉరి తీశారు

 

1838, 42 మధ్య ఆఫ్ఘనిస్తాన్ లో ధీర్ఘకాలం యుద్ధం చేసి అక్కడ పరోక్షంగా కంపెనీ పాలన స్థాపించారు

1843 – సింధ్ స్వాధీనం

1839 లో రంజిత్ సింగ్ మరణం తర్వాత సిక్కు రాజ్యంతో పోరాటం. 1849 లో పంజాబ్ విలీనం

రాజ్య సంక్రమణ సిద్ధాంతం – 1848 నుండి 1856 వరకు గవర్నర్ గా పని చేసిన లార్డ్ డల్హౌసి కాలంలో ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఏ భారతీయ పాలకుడు అయినా మగ వారసుడు లేకుండా చనిపోతే అతను రాజ్యం కోల్పోతాడు. ఆ రాజ్యం కంపెనీ భాగం అవుతుంది

ఉదా: సతారా 1848, సంబల్ పూర్ 1850, ఉదయ్ పూర్ 1852, నాగ్ పూర్ 1853 ఝాన్సీ 1854, అవద్ 1856

 

కంపెనీ అధికార విస్తరణలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులలో వారన్ హేస్టింగ్స్ ఒకరు. (1773 నుండి 1785 వరకు గవర్నర్ జనరల్)

బెంగాల్, మద్రాస్, బొంబాయ్ అనే మూడు ప్రెసిడెన్సీలు గవర్నర్ పాలనలో ఉండేవి

1772 లో కొత్త న్యాయ విధానం అమలులోకి వచ్చింది

దీని ప్రకారం ప్రతి జిల్లాలో క్రిమినల్ కోర్ట్ (ఫౌజ్ దారి అదాలత్), సివిల్ కోర్ట్ (దివానీ అదాలత్) అనే న్యాయస్థానాలు ఉంటాయి

మౌల్వీలు, హిందూ పండితులు సివిల్ కోర్ట్ లో న్యాయ చట్టాలకు భాష్యం చెప్పేవారు

క్రిమినల్ కోర్టులు క్వాజి, ముఫ్తీ అధీనంలో కలెక్టర్ల పర్యవేక్షణ కింద ఉండేవి

క్వాజి – న్యాయమూర్తి, ముఫ్తీ – క్వాజి ఇచ్చిన తీర్పు వివరించే ముస్లిం మత న్యాయ శాస్త్రవేత్త

అభిశంసన – ఇంగ్లాండ్ హౌస్ ఆఫ్ కామన్స్ లో దుష్ప్రవర్తన గల వ్యక్తిపై హౌస్ ఆఫ్ లార్డ్స్ లో విచారణ చేపట్టడం

వారన్ హేస్టింగ్స్ ఇంగ్లాండ్ తిరిగి వెళ్ళినప్పుడు బెంగాల్ లో దుష్పరిపాలనకి అతన్ని వ్యక్తిగతంగా భాద్యుడిని చేస్తూ ఎడ్మండ్ బార్క్ ఆరోపణ చేశారు. బ్రిటిష్ పార్లమెంటులో 7 సంవత్సరాలు కొనసాగిన అభిశంసన వ్యవహారం

బ్రాహ్మణ పండితులు ధర్మ శాస్త్ర భావనలు అనుసరించి స్థానిక చట్టాలకు విభిన్న భాష్యాలు చెప్పేవారు

1775 లో 11 మంది పండితులను హిందూ న్యాయ స్మృతి తయారుచేయమని అడిగారు. ఎన్.బి.హాల్షెడ్ దీనిని ఆంగ్లంలో అనువదించారు

1778 లో ముస్లిం న్యాయ స్మృతి తయారు చేయబడింది

1773 నాటి రెగ్యులేటింగ్ చట్టం ద్వారా సర్దార్ నిజామత్ అదాలత్ అనే ఒక కొత్త న్యాయస్థానం కలకత్తాలో ఏర్పాటు చేశారు

 

మొఘల్ సైన్యం ప్రధానంగా అశ్విక దళం (సవార్స్) పదాతిదళం (పైదల్ – కాలినడక) సైనికులతో ఉండేది

ఈస్ట్ ఇండియా కంపెనీ తన స్వంత సిపాయి సైన్యం (సిపాహి అంటే సైనికుడు) నియమించుకుంది

1820 నుండి యుద్ధంలో సాంకేతిక మార్పులుకారణంగా పదాతిదళం అవసరం తగ్గింది

పంతొమ్మిదవ శతాబ్ద ప్రారంభంలో బ్రిటిష్ వారు ఏకీకృత సైనిక వ్యవస్థ అభివృద్ధి చేయడం ప్రారంభించారు

 

ధర్మశాస్త్రములు – క్రీస్తు పూర్వం 500 నుండి పాటిస్తున్న సామాజిక నిబంధనలు ప్రవర్తనా నియమావళి సూచించే సంస్కృత గ్రంధాలు

సవార్ – అశ్వికుడు

మస్కట్ – పదాతిదళ సైనికులు ఉపయోగించే బరువైన తుపాకి

మ్యాచ్ లాక్ – తుపాకి పొడి నింపి అగ్గిపుల్లతో వెలిగించే పాతకాలం తుపాకి

 

1857 నాటికి కంపెనీ భారత ఉపఖండంలో దాదాపు 63 శాతం భూభాగం, 78 శాతం జనాభాపై ప్రత్యక్ష పాలన అమలులోకి తెచ్చింది

17వ శతాబ్దంలో డచ్ వాణిజ్య నౌకలు దక్షిణ ఆఫ్రికా చేరుకున్నాయి. తర్వాత బానిస వ్యాపారం ప్రారంభం అయింది

1834 బానిసత్వం అంతం అయ్యేనాటికి ఆఫ్రికా దక్షిణ కొన కేప్ వద్ద 36,774 మంది ప్రైవేట్ యాజమాన్యంలో బానిసలు ఉన్నారు 

3. గ్రామీణ ప్రాంతాల పరిపాలన

1765 ఆగస్టు 12 మొఘల్ చక్రవర్తి ఈస్ట్ ఇండియా కంపెనీకీ బెంగాల్ కి దివాన్ గా నియమించాడు

దివానీ కారణంగా కంపెనీ భూభాగం పై ఆర్ధిక పరిపాలకుడు అయింది

1765 కి ముందు ఇంగ్లాండ్ నుండి బంగారం, వెండి దిగుమతి చేసుకుని భారతీయ వస్తువులు కొనేది

1770 బెంగాల్ లో తీవ్ర కరువు వచ్చింది

1793 శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ప్రవేశపెట్టారు. (అప్పటి గవర్నర్ జనరల్ – చార్లెస్ కారన్ వాలిస్) దీని ప్రకారం రాజులు, తాలూకాదార్లు జమీందార్లుగా గుర్తించబడ్డారు

జమీందార్లను రైతుల నుండి పన్నులు వసూలు చేసి కంపెనీకి చెల్లించమన్నారు. జమీందార్లు చెల్లించవలసిన శిస్తు స్థిరంగా నిర్ణయించారు. భవిష్యత్ లో పెంచడానికి వీలు లేదు

1806 లో హెచ్.టి.కోల్బ్రూక్ బెంగాల్ లో ఉప కౌలు రైతులు దుస్థితి వర్ణించారు

మహాల్ – బ్రిటిష్ రెవెన్యూ రికార్డుల్లో మహల్ అనేది ఒక రెవెన్యూ క్షేత్రం. ఇది ఒక గ్రామం కావచ్చు, కొన్ని గ్రామాల సమూహం కావచ్చు

బెంగాల్ ప్రెసిడెన్స్ లోని వాయువ్య ఫ్రావిన్స్ లో హల్ట్ మెకంజీ ఒక కొత్త విధానం ప్రవేశపెట్టాడు. ఇది 1822 నుండి అమల్లోకి వచ్చింది

శిస్తు శాశ్వతంగా కాకుండా నిర్ధిష్ట కాలానికి సమీక్షించాలి. పన్ను వసూలు భాద్యత గ్రామ పెద్దకి అప్పగించారు

ఇది మహల్వారీ పద్దతిగా ప్రసిద్ది చెందింది

దక్షిణాదిన ఈ కొత్త విధానం రైత్వారీగా పేరు పొందింది

కెప్టెన్ అలెగ్జాండర్ రీడ్ చిన్న స్థాయిలో దీన్ని ప్రవేశపెట్టారు. థామస్ మన్రో దీన్ని అభివృద్ది చేశారు

 

18వ శతాబ్దం చివర కంపెనీ నీలిమందు, నల్లమందు సాగు చేయడానికి ప్రయత్నించింది

ఇతర పంటలు : బెంగాల్ – జనుము, అస్సాం – తేయాకు, యునైటెడ్ ఫ్రావిన్స్ – చెరకు, ప్రస్తుత ఉత్తరప్రదేశ్, పంజాబ్ – గోధుమ, మహారాష్ట్ర పంజాబ్ – పత్తి, మద్రాస్ – వరి

19వ శతాబ్దంలో మోరిస్ ముద్రణలో వాడిన నీలిరంగు భారత్ లో పండిన నీలిమందు మొక్క నుండి తయారయ్యింది

ఆ కాలంలో భారత్ ప్రపంచంలో అతి పెద్ద నీలిమందు సరఫరాదారు.

నీలిరంగు ఇండిగో అనే మొక్క నుండి తయారుచేస్తారు

నీలిమందు మొక్క ఉష్ణ మండల ప్రాంతాల్లో పెరుగుతుంది. 13వ శతాబ్దం నాటికి భారతీయ నీలిమందు ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ లో దుస్తుల తయారీదారుల దుస్తులకి రంగులు అద్దడానికి వాడేవారు

యూరోపియన్ తయారీదారులు నీలం, వైలెట్ రంగుల తయారీకి వోడ్ అనే మొక్క మీద ఆధారపడాల్సి వచ్చింది

వోడ్ మొక్క ఉత్తర ఇటలీ, దక్షిణ ఫ్రాన్స్, ఇంగ్లాండ్, జర్మనీ లలో కొన్ని భాగాలలో పెరిగేది

ఫ్రెంచ్ వారు కరేబియన్ దీవుల్లో, సెయింట్ డొమింగ్ లో, పోర్చుగీస్ వారు బ్రెజిల్ లో ఇంగ్లీష్ వారు జమైకాలో, స్పానిష్ వారు వెనిజులాలో నీలిమందు పండించడం ప్రారంభించారు

ఉత్తర అమెరికాలో చాలా భూభాగాల్లో నీలిమందు తోటల సాగు ప్రారంభించారు

1783 – 89 మధ్య ప్రపంచ నీలిమందు ఉత్పత్తి సగానికి పడిపోయింది

ప్రపంచ మార్కెట్ లో పద్దెనిమదవ శతాబ్ద చివర బెంగాల్ నీలిమందు ఆధిపత్యం చెలాయించింది

1788 – బ్రిటన్ దిగుమతి 30%, 1810 నాటికి 95%

నీలిమందు సాగు రెండు రకాలు – నిజ్, రైతి

నిజ్ విధానంలో తోటల యజమాని నేరుగా తన అధీనంలో ఉన్న భూమిలో సాగు చేసేవాడు

బానిస – వేరొకరి యాజమాన్యంలో ఉన్న వ్యక్తి. బానిసకి స్వేచ్చ లేదు.

భిఘా – భూమి కొలిచే ప్రమాణం.ఎకరంలో 1/3 వంతుగా ప్రామాణీకరించారు

నిజ్ విధానంలో సాగు చేసే భూమి – 25% మిగిలినది రైతి సాగు విధానంలో ఉండేది

 

రైతి పద్దతిలో యజమానులు రైతులను ఒప్పంద పత్రంపై సంతకం చేయమని బలవంతం చేశారు

రైతులు యాజమానుల నుండి తక్కువ వడ్డీకి రుణాలు పొందేవారు

రుణం పొందాలి అనుకున్న రైతులు తమ విస్తీర్ణంలో కనీసం 25% నీలిమందు సాగు చేయాలి

 

రంగు తయారీకి 3 లేదా 4 తొట్టెలు అవసరం

నిటారుగా ఉండే తొట్టి / పులియబెట్టడం – వెచ్చని నీటిలో చాలా గంటలు ఆకులు నానబెడతారు

కొట్టే తొట్టి – ద్రావణం కదిలించడం, కొట్టడం చేస్తారు. ద్రవం నీలిరంగులో మారినప్పుడు సున్నపునీరు కలుపుతారు. క్రమంగా నీలిమందు తొట్టి దిగువ అవక్షేపంగా ఏర్పడేను

ఏర్పాటు చేసిన తొట్టి – నీలిమందు గుజ్జు ఉంచుతారు

తర్వాత గుజ్జు పిండి ఎండబెట్టి అమ్మకానికి పెడతారు

 

1859 మార్చిలో వేలాదిమంది రైతులు నీలిమందు పండించుటకు నిరాకరించారు. తోటల యాజమానుల కోసం పని చేసేవారిని సామాజికంగా బహిస్కరించారు

లాఠియలు – తోట యాజమానుల చేత పోషించబడే లాఠీలు ధరించిన బలమైన వ్యక్తులు

బరాసత్ లో ఉన్నప్పుడు నీలిమందు ఒప్పందాలు అంగీకరించమని ఈడెన్ రైతులను బలవంతం చేయరాదని మెజిస్ట్రేట్ యాస్లే ప్రకటన చేశారు

తిరుగుబాటు తర్వాత బెంగాల్ లో నీలిమందు ఉత్పత్తి పడిపోయింది. తోటల యజమానులు ఇప్పుడు తమ కార్యకలాపాలు బీహార్ కి తరలించారు

19వ శతాబ్దం చివర సింథటిక్ రంగుల ఆవిష్కరణతో వారి వ్యాపారం తీవ్రంగా దెబ్బతింది

1917 గాంధీ బీహార్ సందర్శన నీలిమందు తోటల యాజమానులకి వ్యతిరేకంగా చంపారన్ ఉద్యమానికి నాంది పలికింది

 

4. గిరిజనులు, దికూలు – ఒక స్వర్ణ యుగ వీక్షణ

1895 లో బిర్సా అనే వ్యక్తి జార్ఖండ్ లో ఛోటానాగ్పూర్ ప్రాంత అడవులలో గ్రామాల్లో సంచరించేవాడు

ప్రజలని కష్టాల నుండి రక్షించుటకు, దికూ(అన్యులు) బానిసత్వం నుండి వారికి స్వేచ్చ ప్రసాదించడానికి తనను భగవంతుడు నియమించాడని బిర్సా తనకు తానే ప్రకటించుకున్నాడు బిర్సా ఛోటా నాగ్పూర్ ప్రాంతంలో ముండా అనే తెగలో జన్మించారు

బీడు భూమి – కొంతకాలం సాగు చేయకుండా వదిలిన భూమి

సాల్ – ఒక చెట్టు

మహువా – తినడానికి మద్యం తయారీలో వాడే పువ్వు

విస్తరాకు తయారీకి వాడే చెట్లు – పండానస్ 

 

గిరిజనులు కొందరు ఝుమ్ / విస్తాపన వ్యవసాయ పద్దతి అవలంబించారు

వృక్షాలు కాల్చి వచ్చే బూడిద నేలంతా చల్లేవారు. బూడిదలో పొటాష్ నేల సారవంతం చేయడానికి తోడ్పడేను

ఒకసారి పంట సిద్ధం అయిన తర్వాత దానిని కొద్ది సంవత్సరాలు బీడు భూమిగా వదిలి వేరే క్షేత్రానికి వెళ్ళేవారు

వీరు ఈశాన్య, మధ్య భారతదేశంలోని కొండ, అటవీ ప్రాంతంలో నివసించేవారు

చాలా ప్రాంతాల్లో గిరిజనులు జంతువుల వేట, అటవీ ఉత్పత్తుల సేకరణ ద్వారా జీవనం గడిపేవారు

ఒరిస్సా అడవులలో నివసించే కొండులు అలాంటి గిరిజనులే

సాల్, మహువా వృక్ష విత్తనాల నుండి తీసిన నూనె తో ఆహారం వండేవారు

అటవీ ఉత్పత్తులు స్థానిక విపణి (మార్కెట్) లో అమ్మేవారు

స్థానిక చేనేత, చర్మ కార్మికులు తమ బట్టలు, తోలుకు అవసరం అయిన రంగులలో వాడే పలాస, కుసుమ పువ్వుల కోసం కొండులుని ఆశ్రయించేవారు

మధ్య భారతదేశంలో కనిపించే బైగాలు ఇతరుల వద్ద పనికి ఇష్టపడే వారు కాదు

పంజాబ్ లో వాన్ గుజర్లు ఆంధ్రప్రదేశ్ లంబాడీలు – ఆవులు మేపేవారు

కులూ ప్రాంత గద్దీలు – గొర్రెల కాపరులు, కాశ్మీర్ బకర్వాలలు – మేకల కాపరులు

1930, 1940 లలో మధ్య భారతదేశంలో బైగాలు, కొండుల మధ్య గడిపిన వెరియర్ ఎల్విన్ అనే బ్రిటిష్ మానవ శాస్త్రవేత్త కాలమానం గురించి పని విభజన గురించి సమాచారం అందించారు

చైత్ (చైత్రం) - కోసిన పంట దుబ్బులు తొలగించుటకు స్త్రీలు వెళ్ళేవారు. పురుషులు పెద్ద చెట్లు నరికేవారు. సంప్రదాయ వేటకి వెళ్ళేవారు. పౌర్ణమి రోజు తూర్పు నుండి వేట ప్రారంభిస్తారు

ఆదివాసీలందరిలో బైగాలు ఉత్తమ వేటగాళ్ళుగా ప్రసిద్ధి చెందారు బైశాఖ (వైశాఖం) లో అడవిని కాల్చేవారు

జెత్ (జ్యేష్ట్యం) – విత్తడం ప్రారంబించేవాడు, వేట కొనసాగేది

ఆషాడ్ (ఆషాడం) నుండి భాదన్ (భాద్రపదం) వరకు పురుషులు పొలాల్లో పని చేసేవారు

కౌర్ లో బీన్స్ మొదట పక్వానికి వచ్చేవి

కార్తీక్ (కార్తీకం) – కుత్కి పక్వానికి వచ్చేది

అఘాన్ (మార్గశిర) – ప్రతి పంట కోతకి సిద్ధమయ్యేది

పుష్ (పుష్యం) – తూర్పారా బట్టేవారు, పండగలు, నృత్యాలు జరిగేవి

మాగ్ (మాఘం) – కొత్త బేవార్ లకి వెళ్ళేవారు. అప్పుడు వేట సేకరణ ప్రధాన జీవనాధార కృత్యం అయ్యేది

బేవార్ – విస్తాపన వ్యవసాయాన్ని మధ్య ప్రదేశ్ లో ఈ పేరుతో పిలిచేవారు

స్థిర జీవనం గల గోండులు, సంతాలులు మిగిలినవారి కంటే నాగరికులు అని బ్రిటిష్ వారి భావన

నైశి తెగ – అరుణాచల్ ప్రదేశ్

బ్రిటిష్ వారికి అవసరం అయిన కలప ఇచ్చే కొన్ని అడవులను రక్షిత ఆడవులుగా మార్చారు. దీనిలో ప్రజల కార్యకలాపాలకి అనుమతి లేదు

స్లీపర్ – రైల్వే లైన్ల కోసం వాడే అడ్డ చెక్క పలకలు

అటవీ చట్టాలకి వ్యతిరేక తిరుగుబాటు – 1906 అస్సాంలో సోంగ్రామ్ సంగ్మా తిరుగుబాటు, 1930 మధ్య పరగణాల్లో జరిగిన అటవీ సత్యాగ్రహం

ప్రస్తుత జార్ఖండ్ హాజరీభాగ్ ప్రాంతంలో సంతాలులు పట్టు గుళ్ళు పెంచేవారు

19వ శతాబ్ద మలిభాగంలో అస్సాం తేయాకు తోటల్లో, ఝార్ఖండ్ బొగ్గు గనుల్లో పనికి చాలా మంది గిరిజనులను నియమించారు

గిరిజనుల తిరుగుబాటు – 1831-32 కోలులు, 1855 సంతాలులు, 1910 బస్తరులు, 1940 మహారాష్ట్ర వర్లిలు

 

బిర్సా ముండా

1870 మధ్య కాలంలో జన్మించాడు. బోహూండా అడవులలో గొర్రెలు మేపుతూ స్థానిక ఆఖడాల్లో నృత్యం చేస్తూ పెరిగాడు

ముండా సమూహానికి చెందిన సిర్దార్ లు (నాయకులు) తిరుగుబాటుకి పిలుపు ఇచ్చారు

వారి భూమి (ముల్క్ కి లాడాయి) కోసం పోరాటం చేస్తున్నట్టు ప్రజలకి గుర్తు చేశారు

గిరిజన సమాజం సంస్కరించడం బిర్సా ముండా ఉద్యమ లక్ష్యం

1895 లో బిర్సాని అరెస్ట్ చేసి రెండు సంవత్సరాలు జైలులో ఉంచారు

1897 లో విడుదల అయిన తర్వాత గ్రామాల్లో పర్యటన చేశాడు. రావణుని (దికూలు మరియు ఐరోపా వారు) అంతం చేయాలని అతని నాయకత్వంలో రాజ్యం స్థాపించాలని కోరాడు

బిర్సా రాజ్యానికి చిహ్నంగా తెల్ల జెండా ఎగురవేశారు

1900 లో బిర్సా కలరా వ్యాధితో మరణించాడు

ఉద్యమ ప్రాముఖ్యత

అదివాసీల భూమి దికూలు సులభంగా స్వాధీనం చేసుకొని విధంగా చట్టాలు చేసేలా వలస ప్రభుత్వాన్ని ప్రోద్బలం చేసింది

ఆదివాసీ ప్రజలకి అన్యాయానికి వ్యతిరేఖంగా నిరసన చేసే సమర్ధత కలదని నిరూపించింది

 

5. 1857 ప్రజా తిరుగుబాటు – అనంతర పరిణామాలు

రాణి లక్ష్మీ బాయి తన భర్త మరణం తర్వాత తన దత్త పుత్రుడుని రాజ్య వారసునిగా గుర్తించాలని కోరింది

పీష్వా రెండో బాజీరావు దత్తపుత్రుడు అయిన నానాసాహెబ్ తన తండ్రి మరణాంతరం తండ్రికి రావలసిన పింఛను తనకి ఇవ్వాల్సిందిగా కోరాడు 

బ్రిటిష్ వారు విలీనం చేసుకున్న ప్రాంతాల్లో అవద్ చివరిది – 1856 లో                          

సరైన పాలన సాగాలంటే బ్రిటిష్ పాలన అవసరం అని డల్హౌసి ప్రకటించాడు

బహదూర్ షా మరణాంతరం రాజకుటుంబ నివాసం ఎర్రకోట నుండి ఢిల్లీలో మరో ప్రాంతానికి మార్చబడుతుంది అని డల్హౌసి ప్రకటించాడు

బహదూర్ షా తర్వాత వారసులను రాజులుగా గుర్తించడం జరగదని కేవలం యువరాజులుగా పిలవడం జరుగుతుంది అని 1856 లో గవర్నర్ జనరల్ కానింగ్ ప్రకటించాడు

Prepared By :

ABR

AP DSC Best Notes Class 8 Social | History Lesson 1 to 4 | DSC Final touch

 

10 years experience in content writing and coaching                 

 

    

Post a Comment

0 Comments