Best Nots for TET and DSC | Class 4 EVS Complete
4TH EVS - మన ప్రపంచం
1. కుటుంబం
కొన్ని కుటుంబాల్లో తల్లి, తండ్రి , పిల్లలు మాత్రమే ఉంటారు. కొన్ని కుటుంబాల్లో తల్లి, తండ్రి, పిల్లలు, తాతయ్య, నానమ్మ, కూడా కలిసి ఉంటారు.
పూర్వీకుల వివరాలతో కూడిన పట్టిక - వంశ వృక్షం
మన కుటుంబాల్లో కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు మార్పులు వస్తాయి
మన అత్తలు, మామయ్యలు వారి పిల్లలు మన బంధువులు. వీరందరూ మన కుటుంబంలో భాగం. వీరందరినీ విస్తరించిన కుటుంబం అంటారు
వివాహం లేదా పుట్టుక వలన మన కుటుంబ రూపంలో మార్పులు వస్తాయి
తల్లి, తండ్రి, పిల్లలు గల కుటుంబం - చిన్న కుటుంబం
తాతయ్య, నాన్నమ్మ, తల్లి, తండ్రి, పెద్దమ్మ, పెద్ద నాన్న, పిల్లలు గల కుటుంబం - ఉమ్మడి కుటుంబం
కుటుంబంలో మార్పులు వచ్చినట్టే మన జీవన విధానంలో కూడా మార్పులు వస్తాయి
పూర్వం ప్రజలు పనులు అన్నీ స్వహస్తాలతో చేసుకునేవారు. ఈ రోజుల్లో అనేక గృహోపకరణాలు ఉపయోగించి పనులన్నీ తేలిగ్గా, వేగంగా చేయగల్గుతున్నారు
విద్యుత్ ఉపకరణాలు మనం పని చేయు విధానం మార్చేశాయి.
సమాజంలో ఏక సంరక్షక కుటుంబం, తాతయ్య నానమ్మల కుటుంబం, తల్లిపై ఆధారపడే కుటుంబం మొదలైనవి ఉంటాయి
2. హరిత ప్రపంచం
నేల వాతావరణం బట్టి వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల మొక్కలు పెరుగుతాయి. వాటి నివాస స్థలం ఆధారంగా మొక్కలు రెండు రకాలు. అవి నేలపై పెరిగే మొక్కలు, నీటిలో పెరిగే మొక్కలు
మర్రి, రావి, మామిడి, చింత, బ్లాక్ బెర్రీ వంటివి మైదాన ప్రాంతంలో పెరుగుతాయి
ఫైన్, ఓక్ వంటి పొడవుగా పెరిగే వృక్షాలు పర్వత ప్రాంతంలలో పెరుగుతాయి
బ్రహ్మ జెముడు, నాగ జేముడు వంటి మొక్కలు ఎడారిలో పెరుగుతాయి
ఎడారి మొక్కలు వాటి దళసరి కాండాలలో నీరు నిల్వ చేసి ఉపయోగిస్తాయి
డక్ వీడ్, గుర్రపు డెక్క - నీటిపై తేలే మొక్కలు
కలువ, తామర - వేర్లు నీటి అడుగున పాతుకుని ఉంటాయి
హైడ్రిల్లా, టేప్ గ్రాస్ - నీటి లోపల పెరుగును
మడ చెట్లు - బురద/చిత్తడి నేల
మొక్కని రెండు వ్యవస్థలుగా విడదీయవచ్చు. అవి ప్రకాండ వ్యవస్థ (నేల మీద), వేరు వ్యవస్థ (నేల లోపల)
కొన్ని మొక్కలు వెర్లల్లో ఆహారం నిల్వ చేస్తాయి. ఉదా - క్యారెట్, బీట్ రూట్, ముల్లంగి
వేర్లు మొక్కని నేలలో గట్టిగా పట్టి ఉంచి నేల నుండి పోషకాలను గ్రహిస్తాయి
మొక్కల వేర్లు రెండు రకాలు అవి.
తల్లి వేరు - ఒక బలమైన ప్రధాన వేరు కలిగి ఉంటుంది. ఇది నేలలోకి లోతుగా చొచ్చుకుపోతుంది. ప్రధాన వేరుకి అన్నివైపులా సన్నని వేర్లు పెరుగుతాయి
ఉదా - వేప, చింత
పీచు వేరు/గుబురు వేరు - గుబురుగా పెరుగుతాయి. కాండం అడుగు భాగం నుండి అనేక సన్నని చిన్న వేర్లు గుత్తుగా పెరుగుతాయి
ఉదా - వరి, జొన్న, మొక్క జొన్న
మర్రి, వేప, చింత వంటి వృక్షాలలో వేర్లు నేల లోతుకి చొచ్చుకుపోతాయి. గులాబీ, మల్లె మొక్కల్లో వేర్లు లోతుకి పెరగవు.
నీటి మొక్కల వేర్లు మృదువుగా స్పాంజిలా ఉండి తేలడానికి సహకరిస్తాయి
వేర్లు సాధారణంగా బూడిద వర్ణంలో ఉంటాయి
క్యారెట్, బీట్ రూట్, ముల్లంగి మొదలైనవి ఆహారంగా తీసుకుంటాం
మట్టి వేర్లు వేసవిలో చల్లదనం కోసం ఉపయోగించే కూల్ మ్యాట్ లలో, దుస్తులు ఉంచే అలమరాలో మంచి వాసన కోసం వాడతారు
లెమన్ గ్రాస్ వేర్లు సువాసన తైలాల్లో దోమలు తరిమే పదార్థాల్లో ఉపయోగిస్తారు
పువ్వు యొక్క రంగు రంగు భాగాలను ఆకర్షక పత్రాలు అంటారు అవి కాకుండా పువ్వుకి రక్షక పత్రం కాడ కేసరం అండకోశం లాంటి భాగాలు ఉంటాయి
పుష్పాలు అలంకరణ కోసం ఉపయోగిస్తారు
మందార, వేప, తులసి - ఔషధాల తయారీ
గులాబీ, మల్లె, లిల్లీ, లావెండర్ - సెంట్లు, సౌందర్య తైలాలు
కాలీ ఫ్లవర్ - ఆహారం
ప్రస్తుత రైతులు హైబ్రీడ్ సాంకేతికతతో విత్తనాలు లేని పండ్లు పండిస్తున్నారు
ఫలాలు విటమిన్లు, ఖనిజ లవణాలు మనకి అందించే అద్భుత వనరులు. ఇవి పీచు పదార్థం అధికంగా కలిగి ఉంటాయి
ఉగాది పచ్చడి పండగ నాడు మాత్రమే తయారు చేయు ప్రత్యేక పదార్థం. ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక తమిళనాడు ఉగాది పండగ యొక్క ప్రత్యేక వంటకంగా ప్రసిద్ధి చెందింది
ఉగాది పచ్చడి ఆరు రకాల రుచులు కలిగి ఉంటుంది. అవి తీపి, పులుపు, ఉప్పు, వగరు, కారం, చేదు. ఈ షడ్రుచులు జీవితంలో ఆరు భావోద్వేగాలను చూపుతాయి
పచ్చి మామిడి, చింతపండు, బెల్లం, వేప పూత, పచ్చి కొబ్బరితో ఉగాది పచ్చడి చేస్తారు
నిమ్మ, వేప, ఉసిరి ఔషద విలువలు కలిగి ఉంటాయి
కుంకుడు కాయ, శీకాయ ఫలాలు వెంట్రుకలు శుభ్రం చేయుటకు వాడతారు
మొక్కలు కార్బన్ డై ఆక్సైడ్ నీరు సూర్య రష్మి ఉపయోగించి
ఆహారం తయారు చేస్తాయి. దీనిని "కిరణ జన్య సంయోగక్రియ" అంటారు
3. మన చుట్టూ ఉన్న జంతువులు
జంతువుల చెవులు వేరు వేరు ఆకారాల్లో పరిమాణాల్లో ఉంటాయి. కొన్ని జంతువుల చెవులు మనకి కనిపించవు
పక్షి తలకి ఇరువైపులా సన్నని రంధ్రాలు కలిగి ఉంటుంది. ఇవి పక్షులకు వినికిడి శక్తి కలిగిస్తాయి. ఈ రంధ్రాలు ఈకలతో కప్పి ఉంటాయి
కొన్ని జంతువుల చర్మం దట్టమైన వెంట్రుకలు కల్గి ఉంటుంది. కొన్ని జంతువుల చర్మం మృదువుగా ఉంటుంది
కొన్ని జంతువుల చర్మంతో చెప్పులు తయారు చేస్తారు. గొర్రె చర్మంపై దట్టమైన వెంట్రుకలు స్వెట్టర్ లు కోట్ ల తయారీలో ఉపయోగిస్తారు
చెవులు బయటికి కనిపించి చర్మం మీద వెంట్రుకలు ఉండే జంతువులు పిల్లలకి జన్మనిస్తాయి. వీటిని "శిశోత్పదకాలు" అంటారు. వీటినే క్షీరదాలు/పాలిచ్చే జంతువులు అంటారు
చెవులు బయటికి కనిపించక వెంట్రుకలు ఉండని జంతువులు గుడ్లు పెడతాయి. వీటిని "అండోత్పాడకాలు" అంటారు
డాల్ఫిన్ పిల్లలని కని పాలిచ్చి పెంచును
మొక్కలు నుండి లభించే పదార్థాలు ఆహారంగా తీసుకునేవి శాఖాహారులు. వీటికి పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు ఉండెను. ఉదా - గేదె, ఆవు, జింక, గుర్రం, మేక
ఇతర జంతువులు మాంసం తినేవి మాంసాహారులు. వీటికి పొడవైన బలమైన చీల్చే దంతాలు ఉంటాయి. ఉదా - సింహం, పులి
మాంసాహార పక్షులు పదునైన ముక్కుతో మాంసం చీల్చి తింటాయి. ఉదా - గద్ద, రాబందు
మొక్కలు, జంతువులు రెండింటినీ ఆహారంగా తీసుకునేవి ఉభయాహారులు. వీటికి పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలతో పాటు చీల్చే దంతాలు కూడా ఉంటాయి. ఉదా - ఎలుగుబంటి, కాకి, కుక్క
పక్షుల ముక్కులు ఒకేలా ఉండవు. పక్షి ముక్కు ఆకారాలు వాటి ఆహార అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది
పక్షి ముక్కులు వాటి యొక్క దవడలు
పక్షులు నడవడానికి చెట్లెక్కడానికి ఈదడానికి ఎగరడానికి కాళ్ళు వాడతాయి
ఆహారం పట్టుకోవడానికి తమని తాము రక్షించుకోవడానికి పక్షుల కాలి గోళ్ళు ఉపయోగపడేను
పాదం, కాలి గోళ్ళ ఆకారం వాటి యొక్క ఆహార అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది
కాలి గోళ్లు పొడవుగా వంపు తిరిగి ఉంటాయి
పక్షులు గుడ్లు పెట్టే సమయానికి గూడు కట్టుకుంటాయి. సాధారణంగా మగ పక్షులు గూడు కడతాయి
కాకి - చిన్న కొమ్మలు, ఎండుటాకులు
గిజిగాడు - ఆకులు, గడ్డి, కొమ్మలు, వేర్లు
టైలర్ బర్డ్ - ఆకులు కలిపి కుట్టి గూడు అల్లేను
గద్ద - పొడవైన పుల్లలు, గడ్డి, చెట్టు కొమ్మలు (గద్ద ఎత్తైన రాతి శిఖరాల పైన ఎత్తైన చెట్లపై గూడు కడుతుంది)
కుందేలు - బొరియలు
పులి, సింహం - గుహ
కోతి - చెట్ల మీద
సాలె పురుగు తన గూడు తానే అల్లుకుంటుంది
వలస వెళ్ళే పక్షులు సుదూరానికి ఎగిరి వెళ్ళవలసి వచ్చినప్పుడు ప్రయాణంలో అవి తమ శక్తి కోల్పోకుండా అవి "V" ఆకారంలో ప్రయాణిస్తాయి
చీమలు సమూహంగా జీవించేను. చీమల కాలనీలో రాణి చీమ, మగ చీమ, శ్రామిక చీమలు ఉంటాయి
చీమల కాలనీలో చీమల్లో క్రమశిక్షణ పని విభజన కనిపిస్తుంది
చీమలు ఒక రసాయనం స్రవించి దాని సహాయంతో ఒక దారి ఏర్పరిచి ఆహారానికి సంబంధించిన సమాచారం ఇతర చీమలకు అందించేను
తేనెటీగలు అన్ని కలిసి తమ ఇల్లు (తుట్టి) నిర్మిస్తాయి. అవన్నీ కలిసి ఆహారం పంచుకుంటూ తమ లార్వాలకి ఆహారం అందిస్తాయి.
ఏనుగులు పది నుండి పన్నెండు ఏనుగులు వాటి పిల్లలతో కలిసి జీవిస్తాయి. పెద్ద వయసు ఉన్న ఆడ ఏనుగు వాటికి నాయకత్వం వహిస్తుంది. సమూహ జీవనం వల్ల వాటికి రక్షణ లభించును
4. జ్ఞానేంద్రియాలు
కన్ను - దృష్టి జ్ఞానం, చెవి - శబ్దం, ముక్కు - వాసన, నాలుక - రుచి, చర్మం - స్పర్శ
వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు. ఇవి వివిధ అంశాలకు అనుగుణంగా ప్రతిస్పందించడానికి ఉపయోగపడేను
జ్ఞానేంద్రియాలు చక్కగా పని చేయడం మన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి చిహ్నం
కళ్ళు :
దృష్టి సంబంధ జ్ఞానేంద్రియము
కనురెప్పలు కంటిని రక్షిస్తాయి
కంటికి పుస్తకానికి కనీస దూరం 30 cm
TV కనీసం 6 అడుగుల దూరం నుండి చూడాలి
కంటి చూపు లేనివారిని అంధులు అంటారు. అంధులు వాడే లిపి "బ్రెయిలీ లిపి"
బ్రెయిలీ అంధుల కోసం లిపి కనిపెట్టారు. స్పర్శ ద్వారా వారు ఆ లిపి చదవగలరు
ఈగలు 5 కళ్ళు కలిగి ఉంటాయి
గద్ద, రాబందు, డేగ వంటి పక్షులు మంచి కనుదృష్టి కలిగి ఉంటాయి
గుడ్లగూబ చీకటిలో కూడా చూడగలదు
ముక్కు :
ముక్కు సాయంతో శ్వాస తీసుకుంటాం. వాసన తెలుసుకుంటాం
ముక్కులో సన్నని వెంట్రుకలు గాలిలో దుమ్ము, ధూళి వడకట్టి శుభ్రమైన గాలి లోపలికి పంపుతాయి
పిల్లులు, కుక్కలు సునిశితమైన ఘ్రాన శక్తి కలిగి ఉంటాయి
స్నిఫర్ కుక్కలని నేరస్థులను గుర్తించడానికి పోలీసులు తర్ఫీదు ఇచ్చి డాగ్ స్క్వాడ్ గా ఉపయోగిస్తారు
ఏనుగులు 3km దూరం నుండే నీటి జాడ గుర్తించగలగుతాయి
చెవులు :
శబ్ద జ్ఞానం గల జ్ఞానేంద్రియము
చెవిలో గల కర్ణబేరి చాలా సున్నితంగా ఉంటుంది
ఉరుములు, మెరుపులు లౌడ్ స్పీకర్ వంటి పెద్ద పెద్ద శబ్దాలు వినికిడి శక్తి దెబ్బ తీస్తాయి
గుడ్లగూబ, గబ్బిలం వంటి నిశాచర జీవులకు వినికిడి శక్తి ఎక్కువ
పిల్లులు చిన్న శబ్దం వినగలవు
నాలుక :
నాలుకపై రుచి మొగ్గలు మనకి రుచి కనుగొడానికి సహాయపడును
కప్పలు, బల్లులు, ఉసరవెల్లులు ఆహారం పట్టుకోవడానికి నాలుక ఉపయోగిస్తాయి
జిరాఫీలో పొడవైన నాలుక ఉంటుంది
పాములు నాలుక ద్వారా వాసన పడతాయి
చర్మం :
జ్ఞానేంద్రియాలు అన్నింటిలో చర్మం చాలా సున్నితమైనది. ఇది స్పర్శకి ప్రతిస్పందిస్తుంది
అంటువ్యాధులు నివారించడం కోసం చర్మం ఎల్లప్పుడూ పొడిగా పరిశుభ్రంగా ఉంచాలి
పాము తన చర్మంతో దూరంగా ఉన్న శత్రువులను గుర్తించగలదు
pwd act 2016 ప్రకారం నడవలేని, చూడలేని, వినలేని, మాట్లాడలేని వారిని "దివ్యాంగులు/విభిన్న ప్రతిభ గల వ్యక్తులు" అని అంటారు
సుధా చంద్రన్ ఒక నర్తకి. ఒక ప్రమాదంలో ఒక కాలుని కోల్పోయి కృత్రిమ కాలు సాయంతో నాట్యం చేయడం ప్రారంభించింది
రవీంద్ర జైన్ పుట్టుకతో అంధుడు. ఆయన సినిమా ప్రపంచంలో గాయకునిగా మంచి స్థానం కల్గి ఉన్నారు
భద్రతా భావం కలిగించే స్పర్శ - మంచి స్పర్శ
అభద్రతా భావం కలిగించే స్పర్శ - చెడు స్పర్శ
5. మనం తినే ఆహారం
మనం ఆహారం తీసుకోవడం వల్ల మనకి శక్తి వస్తుంది
పేదరికం కారణంగా చాలామంది పిల్లలు పూర్తి భోజనం తీసుకోరు
పోషక విలువలు గల రుచికరమైన ఆహారం అందించడానికి ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం పెట్టింది
వివాహాలు వేడుకలు లలో ఎక్కువ ఆహారం వృధా అవుతుంది
ప్లాస్టిక్ తో తయారు అయిన గిన్నెలు గ్లాసులు వాడడం ఆరోగ్యానికి మంచిది కాదు
మోదుగ, బాదం, మర్రి ఆకులు ప్లేట్ లుగా తయారుచేస్తారు
పచ్చడి చట్నీలు, జామ్, వడియాలు చాలా కాలం నిల్వ ఉంచగలం
ఉప్పు ఒక నిల్వ చేయు కారకం
నూనె అనేది పచ్చళ్ళలో బాక్టీరియా, ఫంగస్ ఏర్పడకుండా నిరోధిస్తుంది
చెర్రీ లాంటి పండ్లు చక్కెర పాకంలో నిల్వ చెయ్యొచ్చు. జామ్ గా తయారుచేసి నిల్వ చెయ్యొచ్చు.
కూరగాయలు, మాంసం, చేపలు, అధిక చల్లదనం గల పెట్టెలో నిల్వ చేస్తారు. దీనిని "ఫ్రీజింగ్" అంటారు
వరి, గోధుమ, పప్పు ధాన్యాలు, వేరుశనగ వంటి నూనె గింజలు కీటకాలు బూజు చేత పాడు చెయ్యబడతాయి. దీనిని నివారించడానికి వేపాకులు ఎండబెట్టి నిల్వ ఉంచే సంచిలో ఉంచుతారు
ధాన్యం టిన్, అల్యూమినియం పాత్రలలో, వెదురుతో చేసిన పెద్ద బుట్టలలో నిల్వ చేయడం వల్ల ఎలుకలు చుంచులు కీటకాల నుండి కాపాడగలం
కంసాలి - కొడవలి తయారీ, వడ్రంగి - నాగలి తయారీ
6. నీరు
గ్రామ పంచాయితీ ద్వారా స్వచ్ఛమైన త్రాగునీరు ఇంటింటికీ సరఫరా చేస్తారు
చాలా గ్రామాల్లో నీటి వనరులుగా చెరువులు ఉంటాయి
గ్రామ పంచాయితీ చెరువు గట్లు, పూడిక, నీటి సరఫరా భాధ్యత చూస్తుంది
యతలవంక చెరువు - చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం నీటి గుంట్ల పల్లి
కొన్ని చెరువులు కాలువలతో ఆనుసందానం చెయ్యబడి ఉంటాయి. వర్షాకాలంలో నీరు ఒక చెరువు నుండి మరో చెరువుకి ప్రవహించేను. అనంతపురం జిల్లా బుక్కపట్నం , ధర్మవరం చెరువులు ఈ రకానికి చెందినవి
నదులు నీటితో చెరువులు నింపడానికి కూడా కాలువలు తవ్వుతారు. ఈ రకమైన చెరువులు కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాల్లో కలవు
పంచాయితీ వారు ప్రజలకి త్రాగునీరు అందించుటకు ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మిస్తారు
శుద్ధి చేసిన నీరు గ్రామీణ నీటి సరఫరా పథకం ద్వారా ఇంటింటికీ అందిస్తారు
చెరువులో నీరు శుద్ధి చేయు దశలు :
చెరువు/నది నుండి నీరు పెద్ద పరిమాణంలో గల తేర్చే తొట్టెలలో నింపబడెను. నీటిలో బరువైన పదార్థాలు కిందికి చేరుతాయి
తర్వాత నీరు వడపోత తొట్టెలో పంపి వడపోయబడెను. ఇక్కడ చిన్న పదార్థాలు తొలగించబడును
వడపోసిన నీరు క్లోరినేషన్ తొట్టెలో పంపెను. ఇక్కడ నీటికి బ్లీచింగ్ పొడి చేర్చుతారు. దీన్ని క్లోరినేషన్ అంటారు
క్లోరినేషన్ చేసిన నీరు ఓవర్ హెడ్ ట్యాంక్ కి పంపుతారు
ట్యాంక్ నుండి పైపుల ద్వారా నీరు ఇళ్లకు సరఫరా చేస్తారు
ప్రభుత్వం రైతులతో నీటి వినియోగదారుల సంఘం ఏర్పరిచి వారికి చెరువు నిర్వహణ బాధ్యత ఇచ్చింది
నీటి వనరులలో నీరు గాలిలోకి భాస్పీభవనం చెందును. అవి ఘనీభవనం చెంది మేఘాలుగా మారెను
మేఘాలు చల్లగాలి వల్ల చల్లబడి చిన్న బిందువులుగా మారెను - ఘనీభవనం
నీటి చుక్కలు మేఘాలు నుండి కిందికి రావడం - వర్షం
ఈ మొత్తం ప్రక్రియ - జల చక్రం
నేలలో కొన్ని పదార్థాలు కలవడం వల్ల నీటికి రుచి వస్తుంది
7. వృత్తులు మరియు సేవలు
రంగులు వేయువాడు పెయింటర్. రంగు వేయుటకు బ్రష్ వాడతారు
పెన్సిల్ చెక్కడానికి - మర (షార్ప్ నర్)
ఒక పని సులభంగా చేయుటకు వాడే వస్తువు - పనిముట్టు
నైపుణ్యం గల పనుల ద్వారా డబ్బు సంపాదించడం - వృత్తి
రైతులు వాడే పనిముట్లు పార, కొడవలి, నాగలి, పిక్ అక్స్
బట్టలు కుట్టేవాడు - దర్జీ (టైలర్)
దర్జీ పనిముట్లు కొలతకి టేపు, కత్తిరించడానికి కత్తెర, కుట్టడానికి మిషన్, దారం, బాబిన్ లు
గృహ నిర్మాణం - తాపీ మేస్త్రి
తాపీ మేస్త్రి పనిముట్లు - ద్రవ మట్టం, రేకు తాపీ, మూల మట్టం, రంపం, పార, తూకం దారం, సుత్తి, బొచ్చె/గమేలా, టేపు, పైపు, చువ్వలు కోసే మిషన్
కెమిస్ట్ - మందులు అమ్మువాడు
పచారీ వ్యాపారి - ధాన్యం, బియ్యం, పప్పు వంటివి
కుండల తయారీ - కుమ్మరి
కుండ తయారీ దశలు :
మట్టి తేవడం
మట్టికి నీరు కలిపి కాళ్ళతో తొక్కి మెత్తగా చేయడం
మట్టి చకంపై ఉంచి కుండ ఆకారంలో మార్చడం
కుండని ఒక చెక్కతో కొట్టి సరైన ఆకారంలో తేవడం
ముందు నీడలో ఆరబెట్టి తర్వాత ఎండలో ఉంచుట
ఎండిన కుండలు కొలిమిలో కాల్చడం
వీధులు, మురికి కాలువ శుభ్రం చేయువారు - పారిశుధ్య కార్మికులు
మరుగదొడ్లు శుభ్రం చేయు పారిశుధ్య కార్మికులు వృత్తి నుండి విముక్తి కలిగించుటకు పునరావాసం కల్పించడం కోసం కృషి చేసినది - బెజవాడ విల్సన్ (మెగసేసే అవార్డు గ్రహీత)
బట్టలు ఉతికి ఇస్త్రీ చేయువారు - చాకలి/రజకులు
బంగారు ఆభరణాల తయారీ - స్వర్ణ కారుడు/కంసాలి
చెప్పులు కుట్టే వారు - చర్మ కారుడు
కరెంట్ వైరింగ్ - ఎలక్ట్రీషియన్
నీటి పైపుల నిర్వహణ - ప్లంబర్
రైల్వే/బస్ స్టేషన్ లో బరువులు మోసేవాడు - కూలీ (పోర్టర్)
చేపలు పట్టేవారు - జాలరి
దేశ సరిహద్దు కాపలా - సైనికుడు
8. రవాణా
మనుషులు, వస్తువులు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి భూ, జల, వాయు మార్గాల్లో జరిపే కదలిక - రవాణా
రవాణా వ్యవస్థ అక్కడ భౌగోళిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది
గ్రామీణ ప్రాంతాలలో రోడ్డు సౌకర్యం సరిగా లేనిచోట ప్రజలు ఎద్దుల బండి, ట్రాక్టర్, గుర్రపు బండి/టాంగా(జట్కా) వాడతారు
కొండ ప్రాంతంలో సరైన రోడ్డు మార్గం ఉండదు. అక్కడ ప్రజలు కాలిబాటలో ప్రయాణం చేస్తారు
గాడిదలు, గుర్రాలు వస్తు రవాణా కోసం వాడతారు
విశాఖ జిల్లా అరకు లోయలో ఇలాంటి రవాణా చూడొచ్చు
ఇప్పుడు కొండ ప్రాంతంలో రోప్ వే లు వినియోగిస్తున్నారు. దీనిలో వాడేవి ఎరియల్ కార్లు
అడవి ప్రాంతంలో కాలి బాటలో ప్రయాణం. అడవుల్లో వృద్దులు, రోగులను డోలీలలో తీసుకెళ్తారు
ఎడారి ప్రాంతంలో రవాణా సౌకర్యం - ఒంటె. ఒంటె నీ ఎడారి ఓడ అంటారు
ఒంటె పొడవైన కాలు ఇసుక నుండి వచ్చే వేడి శరీరంలోకి తాకకుండా కాపాడెను. పాదాలు వెడల్పుగా ఉండడం వల్ల వేగంగా నడగలవు
మంచు ప్రాంతంలో రవాణా సాధనం - కుక్కలు లాగే స్లెడ్జ్. హిమాలయ ప్రజలు జడల బర్రె , స్లెడ్జి లు రవాణా కి వాడతారు
జల రవాణా సాధనం - పడవ
గోదావరి జిల్లాల్లో లంక గ్రామ ప్రజలు సమీప గ్రామాల్లోకి చేరుటకు పుట్టీలు పడవలు ఘంటులను రవాణా సాధనంలా వాడతారు
ఆంధ్ర ప్రదేశ్ విమానాశ్రయం - విశాఖ, రాజమండ్రి, గన్నవరం, కడప, రేణిగుంట, పుట్టపర్తి
ఆంధ్ర ప్రదేశ్ నౌకాశ్రయం - విశాఖ, కాకినాడ, కృష్ణ పట్నం
9. సమాచార ప్రసారం
భావాలు, అనుభూతులు వ్యక్తం చేయడం - భావ ప్రసారం
ఒకరితో ఒకరు వ్యక్తిగత భావప్రసార సౌకర్యం కోసం పోస్టల్ విధానం నెలకొల్పారు. ప్రజల మధ్య భావ ప్రసారం కోసం పోస్ట్ కార్డ్, ఇన్లాండ్ కవర్, ఎన్వలప్ కవర్ ఉపయోగపడేను
ప్రతి పోస్ట్ ఆఫీస్ కి ఒక సంఖ్య ఇవ్వబడింది. దీనిని పిన్ కోడ్ అంటారు
PIN - POSTAL INDEX NUMBER
సమాచారం వేగంగా చేరుటకు ప్రస్తుతం విరివిగా వాడే పరికరం - మొబైల్
ఒక కంప్యూటర్ నుండి మరో కంప్యూటర్ కి పంపే సంక్షిప్త సమాచారం - ఈ మెయిల్
వార్తా పత్రికలు, టివి, రేడియో అనేవి ఒకే సమయంలో పెద్ద సంఖ్యలో జనాభాకు సమాచారం అందించే బహుళ ప్రసార సాధనాలు
రేడియో - వినికిడి పరికరం
టివి - వినికిడి మరియు దృష్టి
మొబైల్ ఫోన్ లో మనకి కావలసిన సమాచారం అందించే ఆప్ లు - సామాజిక మాధ్యమాలు
10. చూసి వద్దాం
పండగ రకాలు - జాతీయ పండుగలు, వ్యవసాయ పండుగలు, మతపర పండుగలు
జాతీయ పండగలు - స్వతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం
వ్యవసాయ పండుగలు - ఏరువాక
మత పండుగలు - దీపావళి, క్రిస్మస్, రంజాన్
శ్రీరామనవమి - మార్చి/ఏప్రిల్. శ్రీరామునికి పూజించి బెల్లంతో చేసిన పానకం తీసుకుంటారు
ఏసు పుట్టిన రోజు - క్రిస్మస్ డిసెంబర్ 25
ముస్లిం ప్రధాన పండగ - ఈద్ ఉల్ ఫితర్ / శుభాకాంక్షలు - ఈద్ ముబారక్
సిక్కుల ప్రధాన పండగ - గురునానక్ జయంతి అయిన గురు పరచ్. గురుద్వారా లో ప్రార్థన చేస్తారు
భౌద్దుల ముఖ్య పండగ - బుద్ది పూర్ణిమ
పాడేరు వద్ద మోదుగుల గ్రామంలో మొదకొండమ్మ జాతర మూడు రోజులు చేస్తారు
ఆంధ్ర ప్రదేశ్ చారిత్రక ప్రదేశాలు :
లేపాక్షి - అనంతపురం జిల్లా
అనంతపురం జిల్లాలో లేపాక్షిలో వీరభద్రుని గుడి ఉంది
విజయనగర గవర్నర్లు విరుపానంద, వీరన్నలు 1530 లో ఈ గుడి కట్టారు
ఇక్కడ ప్రఖ్యాతి గాంచిన నంది విగ్రహం ఉంది. దీనిని లేపాక్షి బసవన్న అంటారు
సిద్ధవటం కోట - కడప
ఇది పెన్నా నది ఒడ్డున ఉంది
క్రీ.శ. 1303 లో ముప్పై ఎకరాల భూమిలో కట్టారు
ఈ కోటని దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా భావిస్తారు
చంద్రగిరి కోట - చిత్తూరు
ఇది నాయకుల చేత 11 వ శతాబ్దంలో విజయనగర పాలకులు అధీనంలో కట్టబడింది
దీనిలో రాజ్ మహల్, రాణి మహల్ 300 సం.లు అలాగే ఉన్నాయి
రోళ్లపాడు - కర్నూల్
ఇది పక్షి సంరక్షణ కేంద్రం. బట్టమేక పిట్టకి ఈ ప్రదేశం అవాసం
ఇస్రో - నెల్లూరు
పులికాట్ సరస్సు దగ్గర సుళ్ళురు పేటలో
కృత్రిమ ఉపగ్రహాలు రాకెట్ ద్వారా ఇక్కడ నుండి అంతరిక్షంలోకి పంపెను
పులికాట్ సరస్సులో నేలపట్టు వద్ద ఫ్లెమింగో పక్షుల సంక్చుయరీ ఉంది. ఇక్కడ ఫ్లెమింగో పండగ చేస్తారు
మోటుపల్లి పోర్ట్ - ప్రకాశం
కాకతీయుల కాలంలో నిర్మించిన ప్రసిద్ధ నౌకాశ్రయం
11వ శతాబ్దంలో మార్కోపోలో (పోర్చుగీసు) ఈ పోర్టును సందర్శించాడు
గంధం, ముత్యాలు, పట్టు, మిరియాలు, దంతం వంటివి దీని ద్వారా ఎగుమతి అయ్యేవి
అమరావతి స్తూపం - గుంటూరు
ఇది శిధిలావస్థకు చేరుకున్న భౌద్ధ స్తూపం
అమరావతి, ధరణి కోట రెండు శాతవాహనుల రాజధానులు
కొండపల్లి కోట - కృష్ణా
ముసునూరి నాయకులు కట్టించారు
1370 ముసునూరి నాయకులు పతనం తర్వాత కొండవీడు రెడ్డి రాజులు దీనిని ఆక్రమించారు
కొండపల్లి కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి
కొల్లేరు సరస్సు - పశ్చిమ గోదావరి
గోదావరి కృష్ణా నదుల మధ్య విస్తరించి ఉంది
ఇక్కడ ఆటపాక పక్షి సంరక్షణ కేంద్రం ఉంది. విస్తీర్ణం 673 చ.కి.మి
ఇది పెలికాన్ లు, సైబీరియా కొంగలు, పెయింటెడ్ స్టాక్స్ పక్షుల సంరక్షణ ప్రదేశం
కోరింగా - తూర్పు గోదావరి
ఇది భారత మడ అడవుల్లో రెండవ అతి పెద్దది
అనేక మడ చెట్లు 120 కంటే అధిక పక్షి జాతులు కలవు
బొర్రా గుహలు - విశాఖ
అరకు లోయలో అనంతగిరి కొండల్లో ఉన్నాయి
705 మీటర్లు పొడవు, 80 మీటర్ల లోతు
ఇది సున్నపురాయి నిక్షేపాల మధ్య ప్రవహించిన గోస్తని నది కారణంగా ఏర్పడ్డాయి
బొబ్బిలి కోట - విజయనగరం
19 వ శతాబ్దంలో నిర్మించబడినది
మట్టి కోట 1757 లో బొబ్బిలి యుద్ధంలో నాశనం అయ్యి తిరిగి అదే పేరుతో నిర్మించబడినది
గొల్లపల్లి కి చెందిన సర్వసిద్ది వడ్రంగులు చేత బొబ్బిలి వీణ తయారు చేయబడేను
తేలినీలపురము - శ్రీకాకుళం
తేలినీలపురము, తేలుకుంచి పక్షి సంరక్షణ కేంద్రాలు శ్రీకాకుళం జిల్లాలో కలవు
ప్రతి సంవత్సరం సుమారు 300 సంఖ్యలో పెలికాన్ పక్షులు పెయింటెడ్ స్టార్క్ పక్షులు సైబీరియా నుండి సెప్టెంబర్ నుండి మార్చి నెల మధ్య వస్తాయి
11. మనమెక్కడ ఉన్నాం
ప్రజలు అందరు కలిసి నివసించే ప్రదేశం గ్రామం. గ్రామం అనగా కొన్ని ఇల్లు
కొన్ని గ్రామాలు కలిసి మండలం, కొన్ని మండలాలు కలిసి జిల్లా, కొన్ని జిల్లాలు కలిసి ఒక రాష్ట్రం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులు :
తూర్పు - బంగాళాఖాతం , పడమర - కర్ణాటక , ఉత్తర - ఒరిస్సా , తెలంగాణ , ఛత్తీస్గఢ్ , దక్షిణ - తమిళనాడు
ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు 13. రాజధాని అమరావతి. విస్తీర్ణం పరంగా 7వ రాష్ట్రం
నైసర్గికంగా మూడు ప్రదేశాలు - ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ
కొన్ని రాష్ట్రాలు కలిపి ఒక దేశం
భారతదేశం 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలగా విభజించి ఉంటుంది. రాజధాని న్యఢిల్లీ
భారత్ విస్తీర్ణం పరంగా 7వది. జనాభా పరంగా 2వది
కొన్ని దేశాలు కలిపి ఒక ఖండం
భూగోళం మొత్తం 7 ఖండాలు కలవు. భూగోళం మూడు వంతుల నీరు, ఒక వంతు భూమి కలదు
ఖండాలు అన్ని కలిపి ప్రపంచం
ఖండాలు - ఆసియా (పెద్దది), ఆఫ్రికా, ఆస్ట్రేలియా (చిన్నది), దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, యూరప్, అంటార్కిటికా
దక్షిణ అమెరికా - పక్షి ఖండం
భూమి పైన జల భాగం - 5 భాగాలుగా విభజించారు. అవి పసిఫిక్ మహాసముద్రం (బాగా లోతైనది), హిందూ మహా సముద్రం, ఆర్కిటిక్, అట్లాంటిక్, అంటార్కిటికా (దక్షిణ మహా సముద్రం)
భూమి తన చుట్టూ తాను తిరగటం - భ్రమణం (24 గంటలు)
భూమి సూర్యుని చుట్టూ తిరగడం - పరి భ్రమణం (365 1/4 రోజులు)
భూమి చలనం రాత్రి పగలుకి కారణం
నక్షత్రాలు గుంపుగా ఒక ఆకారంలో అమరి ఉంటాయి. దాన్ని నక్షత్ర రాశి/కూటమి అంటారు
చంద్రుని ఆకారంలో మార్పులు - చంద్ర దశలు
చంద్రుడు పూర్తిగా కనిపిస్తే పౌర్ణమి, కనిపించని రోజు అమావాస్య
0 Comments